తెలంగాణా మీద జనసేనాని ఫుల్ ఫోకస్

ఇక 2019 ఎన్నికలలో జనసేన ఒంటరిగా పోటీ చేసింది. పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలు అయ్యారు. మరొకరు అయితే పార్టీ మూసేసుకుని వెనక్కి వెళ్ళేవారు.

Update: 2026-05-31 02:45 GMT

పవన్ కళ్యాణ్ పట్టుదల మనిషి. ఆ విషయం ఆయన రాజకీయాలను చూసిన వారికి అర్థం అవుతాయి. ఆయన తన అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున రాజకీయ అరంగేట్రం చేశారు. 2008లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. దాదాపుగా రెండు దశాబ్దాల రాజకీయ అనుభవం పవన్ కి ఉంది. ఇక ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయినా పవన్ రాజకీయం మాత్రం ఆగకపోవడమే ఆయన పట్టుదలకు నిదర్శనం అని అంటున్నారు. అంతే కాదు 2014లో ఆయన టీడీపీ బీజేపీలకు మద్దతు ఇచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటుకు కారణం అయ్యారు. అలా తాను అనుకున్నది సాధించి చూపించారు.

ఉప ముఖ్యమంత్రి దాకా :

ఇక 2019 ఎన్నికలలో జనసేన ఒంటరిగా పోటీ చేసింది. పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలు అయ్యారు. మరొకరు అయితే పార్టీ మూసేసుకుని వెనక్కి వెళ్ళేవారు. కానీ పవన్ మాత్రం తన పట్టుదలను అక్కడా చూపించారు. అయిదేళ్ళ పాటు రాజకీయాల్లో విపక్షంలో కొనసాగి 2024 లో అధికారంలోకి వచ్చారు. ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇదంతా పవన్ లో గట్టి సంకల్ప బలాన్ని తెలియచేస్తుంది. ఆయన విమర్శలకు జడిసే రకం కాదని కూడా ఈ సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం తెలియచేస్తుంది. ఆయన్ని ఎంతలా రెచ్చగొడితే అంతలా ఆయన పట్టు బిగిస్తారు అన్నది కూడా ఆయన పొలిటికల్ ట్రాక్ రికార్డుని చూస్తే అర్ధం అవుతుంది. ఇదంతా ఎందుకు అంటే తెలంగాణాలో కొందరు మేధావులు సీనియర్ పాత్రికేయులు పవన్ మీద ఘాటైన విమర్శలు చేశారు. దాంతో అక్కడ జనసైనికులు గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఇక పవన్ లో ఇది మరింతగా పట్టుదలను పెంచిందని అంటున్నారు. దాంతో ఆయన ఏకంగా తెలంగాణా మీద కూడా జనసేన పవర్ ఏంటో చూపించాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు.

ఆవిర్భావం రోజున :

తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం జూన్ 2న జరుగుతుంది. ఆ రోజున పవన్ కళ్యాణ్ తెలంగాణాలోని జనసేన సాధక్ లల్తో ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దాని పేరు తెలంగాణా నవ నిర్మాణ సంకల్ప సభ. హైదరాబాద్ వేదికగా సాగే ఈ సభలో జనసేన సాధిక్స్ అంతా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. వారికి పవన్ తన ప్రసంగం ద్వారా దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల తెలంగాణాలో చోటు చేసుకున్న పరిణామాల మీద కూడా ఆయన తనదైన స్పందనను తెలియజేసే అవకాశం ఉంది అని అంటున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో :

ఇక చూస్తే కనుక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ తన జనసేనను బరిలోకి దింపుతారు అని కూడా అంటున్నారు. జనసేనలో ఉత్సాహవంతులైన యువత ఇప్పటికే చేరారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా పవన్ అక్కడ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు దానికి మరింత బలం చేకూర్చేలా ఈ సభ సాగబోతోంది అని అంటున్నారు. తెలంగాణాలో జనసేన విస్తరణకు సంబంధించి పవన్ సంచలన నిర్ణయాలే తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే జనసేన అధినేత పవన్ వ్యూహాత్మకంగానే ఈ సభను నిర్వహిస్తున్నారు అని అంటున్నారు. మరి ఈ సభ ద్వారా చేసే తీర్మానాలు పవన్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో అన్నది ఆసక్తికరమే అని అంతా అంటున్నారు.

Tags:    

Similar News