పవన్ కార్యాచరణకు రంగం సిద్ధం

జనసేన గెలిచిన ప్రతీ చోటా టీడీపీ నేతల పెత్తనం అధికంగా ఉందని చెబుతున్నారు. దాంతో తాము ఉత్సవ విగ్రహాలుగా మారిపోతున్నామని చాలా మంది వాపోతున్నారు.;

Update: 2025-08-13 05:30 GMT

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాచరణకు సిద్ధం అవుతున్నారని చెబుతున్నారు. పవన్ ఉప ముఖ్యమంత్రిగా అధికారిక బాధ్యతలతో ఇప్పటిదాకా ఉన్నారు. మరో వైపు పెండింగులో ఉన్న సినిమాల బ్యాలెన్స్ ని కూడా పూర్తి చేశారు. ఇంతలో పావు సగం పాలన పూర్తి అయింది. ఈ నేపథ్యంలో చూస్తే కూటమిలో లుకలుకలు తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని జనసేన నుంచి ఫిర్యాదులు రావడం ఇవన్నీ జరిగాయి. అయితే సర్దుకుని పోవాలని జనసేన అధినాయకత్వం సూచిస్తూ వచ్చింది. అయితే సర్దుకుపోవడం మాట అటుంచి సైలెంట్ అవుతోంది క్యాడర్. దాంతో విషయం సీరియస్ అని గ్రహించిన జనసేన హైకమాండ్ ఇపుడు రంగాంలోకి దిగుతోంది అంటున్నారు.

వరుస భేటీలతో :

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక మీద పార్టీ నేతలకు కొంత సమయం కేటాయించాలని చూస్తున్నారు అని అంటున్నారు. ముందుగా ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం నిర్వహించి గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు అన్నీ తెలుసుకుంటారు అని అంటున్నారు. అదే విధంగా ప్రతీ నియోజకవర్గంలోని కీలక నాయకులతో కూడా ఆయన భేటీలు వేస్తారు అని అంటున్నారు. దీని వల్ల ఆయనకు చాలా వరకూ గ్రౌండ్ లెవెల్ విషయాలు తెలుస్తాయని అంటున్నారు.

ఇదే ఫిర్యాదు గా ఉంది :

జనసేన గెలిచిన ప్రతీ చోటా టీడీపీ నేతల పెత్తనం అధికంగా ఉందని చెబుతున్నారు. దాంతో తాము ఉత్సవ విగ్రహాలుగా మారిపోతున్నామని చాలా మంది వాపోతున్నారు. అంతే కాదు ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా తమను పక్కన పెడుతున్నారని వారే ముందుకు వచ్చి అంతా హడావుడి చేసుకుంటున్నారని అంటున్నారు. ఇక పనిచేసిన వారికి కనీసం నామినేటెడ్ పదవులు అయినా ఇప్పించుకోలేకపోతున్నామని అసంతృప్తి కూడా ఉందని చెబుతున్నారు. ఈ విధంగా జనసేన నుంచి చాలా ఫిర్యాదులు ఉన్నాయి.

అవగాహన మరింత ఉండాలి :

అయితే పార్టీ నుంచి వచ్చిన సమస్యలను ఫిర్యాదులను పవన్ పూర్తిగా అధ్యయనం చేస్తారు అని అంటున్నారు. అవసరమైతే సమస్యలు ఉన్న చోట్ల ఏకంగా టీడీపీ అధినాయకత్వం తో మాట్లాడి జనసేన ఎమ్మెల్యలకు న్యాయం చేసేందుకు చూస్తారు అని అంటున్నారు. అలాగే కో ఆర్డినేషన్ సమావేశాలు రాష్ట్ర స్థాయిలో జిల్లాల స్థాయిలో తరచుగా జరగాల్సి ఉందని పవన్ అభిప్రాయపడుతున్నారని అంటున్నారు. వాటి వల్ల చాలా మటుకు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయని భావితున్నారు అని అంటున్నారు.

నియోజకవర్గాలలోకి :

రానున్న రోజులలో జనంలోకి పవన్ నేరుగా వెళ్తారు అని అంటున్నారు. నియోజకవర్గాల వారీగా తన పర్యటనలు ఉండేలా చూసుకుంటారు అని అంటున్నారు. ఇక వచ్చేవి స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి పార్టీని ఎక్కడికక్కడ పటిష్టం చేసుకుంటూ ముందుకు సాగితే ద్వితీయ తృతీయ శ్రేణి నాయకత్వాలకు తగిన అవకాశాలు దక్కేలా చూసుకోవచ్చు అన్న ప్లాన్ ఉంది అని అంటున్నారు. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కూటమి పార్టీలు గెలవాలని పవన్ పట్టుదల మీద ఉన్నారు. కూటమి గెలవాలి అంటే క్షేత్ర స్థాయిలో ఐక్యత చాలా ముఖ్యం. అందుకే వయా మీడియాగా తాను ఉంటూ అటు పార్టీని ఇటు కూటమిని కూడా కట్టుగా ముందుకు నడిపించేందుకు తగిన యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసి పెట్టుకున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News