పవర్ స్టార్ కంటే పవర్ ఫుల్ పేరును తానే పెట్టుకున్న పీకే
మిగిలిన రంగాల్ని పక్కన పెడితే.. సినీ నటులకు ఉండే ప్రత్యేకత ఒకటి ఉంటుంది. వారి పేర్లకు ముందు.. వారి ఇమేజ్ ను పరిచయం చేసేలా వారికో పేరు పెడుతుంటారు.;
మిగిలిన రంగాల్ని పక్కన పెడితే.. సినీ నటులకు ఉండే ప్రత్యేకత ఒకటి ఉంటుంది. వారి పేర్లకు ముందు.. వారి ఇమేజ్ ను పరిచయం చేసేలా వారికో పేరు పెడుతుంటారు. అది వారి ఇంటి పేరుగా మారుతుంటుంది. మెగాస్టార్ చిరంజీవి.. సూపర్ స్టార్ మహేశ్ బాబు.. రెబల్ స్టార్ ప్రభాస్.. యంగ్ టైగర్ తారక్.. ఇలా చెప్పుకుంటూ చాలానే ఉంటాయి. అలానే పవన్ కల్యాణ్ కు పవన్ స్టార్ అన్న పేరుంది. ఈ పేరును ఎవరు డిసైడ్ చేస్తారంటే.. సినిమా వాళ్లేనని చెప్పాలి. అయితే.. ఇప్పటివరకు తనకున్న పవర్ స్టార్ బిరుదుకు మించిన కొత్త పేరును తనకు తానే పెట్టుకున్నారు పవన్ కల్యాణ్.
ఏ ఊరికి వెళితే.. ఆ ఊళ్లోనే పుట్టానని చెప్పుకుంటాడు పవన్ కల్యాణ్.. ఆయన మానసిక స్థితి సరిగా లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజాకు.. తాజాగా పవన్ కల్యాణ్ కౌంటర్ ఇవ్వటం తెలిసిందే. ఈ సందర్భంగా తన పేరుకు భారీ విశేషణాన్ని జోడిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలు.. ఆయన్ను అభిమానించి.. ఆరాధించే వారికి అదిరే అస్త్రంగా మారాయని చెప్పొచ్చు.
తన పేరును పవనంగా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పవనం అంటే గాలి అన్నది అర్థం. భూమి మీద ఎక్కడైనా.. ఏ ప్రాంతమైనా.. ఎలాంటి వాతావరణంలో అయినా గాలి ఉంటుంది. అంటే.. తన పరిధి విస్త్రతమన్న మాటను పవన్ తన తాజా మాటలతో తన గుంంచి చెప్పుసుకున్నట్లుగా చెప్పాలి. తాను వివిధ ప్రాంతాలతో తనకున్న అనుబంధం ఉండటానికి కారణమైన తన కుటుంబ నేపథ్యం గురించి ప్రస్తావిస్తూ.. మళ్లీ తనను వేలెత్తి చూపకుండా ఉండేలా భారీ కౌంటర్ ఇచ్చారని చెప్పాలి.
అయితే.. ఇలాంటివి తమకు తాముగా ప్రముఖులు చేయటం కనిపించదు. ఆ లోటును పవన్ కల్యాణ్ తాజాగా తీర్చేశారని చెప్పాలి. తన పేరు పక్కనే ఒక అక్షరాన్ని జోడించటం ద్వారా.. తన ప్రత్యేకతను తానే చెప్పుకున్నారని చెప్పాలి. ఇలాంటి తీరును ఇప్పటివరకు ఏ ప్రముఖుడు ప్రదర్శించలేదని చెప్పాలి. ఎవరో తన ప్రత్యేకతను చెప్పే కన్నా.. తనకు తానే చెప్పేసుకోవటం ద్వారా.. తనను మాట అనే వారికి వాత పెట్టినట్లుగా ఆయన తాజా వ్యాఖ్య ఉందని చెప్పక తప్పదు.