ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ అధికారుల లిస్టు ఇదే

ఇదిలా ఉండగా.. తాజాగా ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ ఉన్నతాధికారుల పేర్లను భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.;

Update: 2025-05-12 05:09 GMT

ఉగ్రవాదానికి అండగా నిలిచే పాడు దేశాల్లో పాకిస్తాన్ ఒకటన్న విషయం ప్రపంచానికి తెలిసిందే. తమ దేశం ఉగ్రవాదులకు అడ్డగా ఉందన్న విషయాన్ని పాక్ కు చెందిన కొందరు నేతలు సైతం పలు సందర్భాల్లో ఒప్పుకోవటం తెలిసిందే. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారీ ఎత్తున ఉగ్రవాదుల్ని మట్టుపెట్టటం తెలిసిందే. ఇందులో దాదాపు వంద మంది తీవ్రవాదులు మరణించారు. దీనికి సంబంధించిన వివరాల్ని భారత ప్రభుత్వం పరిమితంగా విడుదల చేసినా.. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో వంద మందిని మట్టుబెట్టిన విషయాన్ని భారత సైనికాధికారులు తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ప్రకటించటం తెలిసిందే.

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారులు సైతం హాజరు కావటం.. వారి మీద పాక్ జాతీయ పతాకాన్ని కప్పటం లాంటి అంశాలు తీవ్ర చర్చకు తెర తీశాయి. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో తాము పాల్గొనలేదని పాకిస్తాన్ మొదట్లో బుకాయించింది. అయితే.. వీరి వాదనకు చెక్ పెడుతూ.. అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ ఆర్మీ ఉన్నతాధికారులకు సంబంధించిన ఫోటోల్ని విడుదల చేయటంతో మళ్లీ మాట్లాడలేక.. మౌనంగా ఉండిపోయారు.

ఇదిలా ఉండగా.. తాజాగా ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ ఉన్నతాధికారుల పేర్లను భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందులో ఉన్న వారి ర్యాంకును చూస్తే.. పాక్ ఆర్మీ ఉన్నతాధికారులతో ఉగ్రవాదులకు అంత సన్నిహిత సంబంధాలు ఏమిటి? అన్న సందేహం కలుగక మానదు.

జాబితాలో పేర్కొన్న పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు వీరే..

- లెప్టె నెంట్ జనరల్ ఫయ్యాజ్ హుసేన్ షా (లాహోర్ ఐవీ కార్ప్స్ కమాండర్)

- మేజర్ జనరల్ రావు ఇమ్రాన్ సర్తాజ్ (లాహోర్ 11వ ఇన్ ఫ్రాంట్రీ డివిజన్)

- బ్రిగేడియర్ మహ్మద్ ఫర్ఖాన్ షబ్బీర్

- డాక్టర్ ఉస్మాన్ అన్వర్ (ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పంజాబ్ పోలీస్)

- మాలికో సోహైబ్ అహ్మద్ బెర్త్ (పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీ సభ్యుడు)

Tags:    

Similar News