పాక్ లో కొత్త ఉగ్రవాద నిరోధక చట్టం.. కండిషన్స్ ఘోరం!

ఈ క్రమంలోనే తాజాగా కొత్త ఉగ్రవాద నిరోధక చట్టం 2025ని ఆమోదించింది. అయితే ఈ చట్టంపై ప్రజల నుంచి, మానవహక్కుల సంఘాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి.;

Update: 2025-06-08 20:30 GMT

ఈ శీర్షిక చూసిన తర్వాత... పాకిస్థాన్ ఏమిటి, ఉగ్రవాద నిరోధక చట్టం చేయడం ఏమిటి అనే సందేహం రాకమానదు! ఉగ్రవాదులకు తల్లి, తండ్రి, గురువు అన్నీ తానై అన్నట్లుగా పాకిస్థాన్ నడిపిస్తుందనే విషయం మెజారిటీ ప్రపంచానికి తెలుసు! అయినప్పటికీ తాము కూడా ఉగ్రవాద బాధితులమే అంటూ అంతర్జాతీయ వేదికలపై సన్నాయి నొక్కులు నొక్కుతుంటుంది పాకిస్థాన్.

ఈ క్రమంలోనే తాజాగా కొత్త ఉగ్రవాద నిరోధక చట్టం 2025ని ఆమోదించింది. అయితే ఈ చట్టంపై ప్రజల నుంచి, మానవహక్కుల సంఘాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. దీని ప్రకారం ఎటువంటి అధికారిక అభియోగాలు నమోదు చేయకుండానే వ్యక్తులను 90 రోజుల పాటు నిర్భందించే అనుమతి సైన్యానికి, ఐ.ఎస్.ఐ. నిఘా సంస్థలకు ఉంటుంది. ఇది బలుచిస్తాన్ కోసం!

అవును... బలుచిస్తాన్ అసెంబ్లీ ఉగ్రవాద నిరోధక చట్టం 2025ను ఆమోదించింది. ఇది ప్రావిన్స్ లో పనిచేస్తున్న భద్రతా దళాలకు విస్తృత అధికారాలు ఇచ్చే కొత్త చట్టం. ఈ చట్టం మానవహక్కుల సంఘాలు, న్యాయ నిపుణులు, పౌర సమాజం నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. ఈ చట్టం ఆ ప్రాంతంలో అణచివేతను, అశాంతిని మరింత పెంచుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

వాస్తవానికి దశాబ్ధాలుగా బలుచిస్తాన్ లో మిస్సింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అంటున్నారు. దీంతో సుమారు 10 - 15 ఏళ్లుగా రాష్ట్ర దళాలు అపహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి ఆచూకీ కోసం వారి కుటుంబ సభ్యులు వెతుకుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఈ చట్టం బలుచిస్తాన్ ను చట్టబద్ధమైన నిర్భంధ మండలంగా మరుస్తుందని మండిపడుతున్నారు.

ఇలా ఈ కొత్తచట్టంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోన్న వేల పాక్ ప్రభుత్వం స్పందించింది. ఇందులో భాగంగా... ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను బలోపేతం చేయడం అవసరమని వాదిస్తుంది. ఈ బిల్లు.. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నవారికి మాత్రమే వర్తిస్తుందని, మిగిలినవారు భయపడాల్సిన అవసరం లేదని చెప్పడం గమనార్హం.

Tags:    

Similar News