ఆన్ లైన పరిచయం.. నోట మాట రాని రీతిలో నరకం చూపిన ప్రియుడు
అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో ఆన్ లైన్ స్నేహాలు.. పరిచయాలు ఎక్కువ అయ్యాయి.;
అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో ఆన్ లైన్ స్నేహాలు.. పరిచయాలు ఎక్కువ అయ్యాయి. అయితే.. ఎంపికలో జరిగే పొరపాట్లతో నరకాన్ని ప్రత్యక్షంగా చూసే చేదు ఉదంతాలు అప్పుడప్పుడు వెలుగు చూస్తుంటాయి. ఇప్పుడు చెప్పేది ఆ కోవకు చెందిన ఒక దారుణ ఉదంతం. ఆన్ లైన్ లో పరిచయమైన ప్రియుడితో సహజీవనం స్టార్ట్ చేసిన ఆ అమ్మాయికి ఎప్పుడూ ఎదురుకాని షాకింగ్ ఉదంతాలు ఎదురయ్యాయి. చివరకు ప్రియుడి నుంచి తప్పించుకొని.. పోలీసులను ఆశ్రయించటంతో అతడి దుర్మార్గాలు వెలుగు చూశాయి. అసలేం జరిగిందంటే..
త్రిపురకు చెందిన పందొమ్మిదేళ్ల యువతి చదువు కోసం హర్యానాకు వచ్చింది. అక్కడ ఒక ప్రైవేటు యూనివర్సిటీలో బీఎస్సీ బయోటెక్నాలజీ చదువుతోంది. సెక్టార్ 69లోని పీజీలో ఉంటున్న ఆమెకు.. ఆన్ లైన్ లో ఒక యాప్ ద్వారా ఢిల్లీకి చెందిన శివమ్ తో పరిచయమౌంది. అనంతరం.. వారిద్దరు కలుసుకోవటంతో పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
దీంతో.. వాళ్లిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని సహజీవనాన్ని మొదలుపెట్టారు. అయితే.. ఆమెపై అనుమానాన్ని పెంచుకున్న ప్రియుడు శివమ్.. ఆమెను శారీరకంగా..మానసికంగా హింసించటం మొదలుపెట్టాడు. ఇటీవల వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆమెపై దాడికి పాల్పడిన ప్రియుడు.. ఆమెను దారణుంగా హింసించాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన శివమ్.. బాధితురాలి తలపై సీసాతో దాడి చేశాడు. గోడకేసి కొట్టాడు. శానిటైజర్ ను ఆమె ప్రైవేటు భాగాల మీద పోసి నిప్పు అంటించాడు.
ఆ తర్వాత కత్తితో కాళ్లపై గాయపరిచిన ఆమెను.. జీవితాంతం నడవలేని విధంగా చేస్తాడని బెదిరింపులకు దిగాడు. అతడి వద్ద ఉన్న ప్రైవేటు వీడియోలతో బ్లాక్ మొయిల్ చేయటం మొదలు పెట్టాడు. గొడవ జరిగిన రోజు అతను గాఢనిద్రలోకి జారుకున్న తర్వాత.. ఆమె తల్లికి అతడి ఫోన్ నుంచి మెసేజ్ చేసింది బాధితురాలు. తనను సజీవంగా మళ్లీ చూడాలనుకుంటే వచ్చి తనను తీసుకెళ్లాలని.. సేవ్ చేయాలని మెసేజ్ చేసింది. దీంతో స్పందించిన తల్లి వెంటనే పోలీసులను ఆశ్రయించటంతో ఆమెను రక్షించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అనుమానంతో బాధితురాలిని హింసించిన తీరు అత్యంత దారుణంగా ఉందన్నమాట వినిపిస్తోంది.