యుద్ధ మేఘాలతో పెట్రోల్ మంటలు ?

సామాన్యుడి నెత్తిన పెను భారం పడబోతోంది. ఏకంగా జేబుకే చిల్లు పడనుంది. పెట్రో మంటలతో సగటు జీవి కష్టాలు ఒక్కసారిగా పెరగనున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలతో ఈ పరిస్థితి ఏర్పడనుంది.;

Update: 2026-02-28 18:12 GMT

సామాన్యుడి నెత్తిన పెను భారం పడబోతోంది. ఏకంగా జేబుకే చిల్లు పడనుంది. పెట్రో మంటలతో సగటు జీవి కష్టాలు ఒక్కసారిగా పెరగనున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలతో ఈ పరిస్థితి ఏర్పడనుంది. అమెరికా ఇర్జాయిల్ ఒక్కసారిగా ఇరాన్ మీద చేస్తున్న దాడులతో ఇరాన్ ప్రతి దాడులతో పచ్చంగా ప్రశాంతంగా ఉన్న పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఆ ప్రభావం కాస్తా ఏకంగా ప్రపంచం మొత్తం మీద పడనుంది. దాంతో చమురు ధరకు కొండెక్కనున్నాయి. బ్యారెల్ ధర ఏకంగా 110 డాలర్లకు చేరుతుంది అన్న ప్రచారం సైతం జరుగుతోంది. ఇది అందరికీ కలవరపెడుతోంది.

భారీ యుద్ధం దిశగా :

అమెరికా ఒక వైపు ఇజ్రాయెల్ మరొక వైపు ఈ రెండు దేశాలు కలసి ఇరాని మీద బాంబులతో విరుచుకుపడడంతో పశ్చిమాసియాలో భారీ యుద్ధానికి తెర లేచింది. దాంతో ఇరాన్ సైతం ఊరుకోకుండా ఎదురు దాడులు చేస్తోంది. ఈ పరిణామాలు అన్నీ కలసి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపించనున్నాయి. ఇక చమురు ధరలు కూడా పెద్ద ఎత్తున పెరిగేందుకు ఆస్కారం ఏర్పడనుంది. ప్రస్తుతం చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పది శాతం మేర పెరిగాయి. ఇదే రకమైన వాతావరణం కనుక కంటిన్యూ అయితే మాత్రం బ్యారెల్ ధర ఏకంగా 110 డాలర్లకు చేరే ప్రమాదం ఉందని నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు ఇక ప్రస్తుతం చూస్తే ముడి చమురు బ్యారెల్ ధర 72.87 డాలర్ల వద్ద నిలిచి ఉంది.

పెట్రోల్ రేటు కొండెక్కుతుందా :

ఇరాన్ అయితే ప్రస్తుతం ఈ యుద్ధం కారణంగా గగన తలం మూసేసింది. అంతే కాదు హర్మూజ్ జల సంధి కూడా మూసేసింది. దాంతో ప్రపంచం మొత్తం ముడి చమురు కోసం అల్లాడిపోయే వాతావరణం ఏర్పడుతోంది. ఎందుకంటే మొత్తం ప్రపంచం చమురు బిజినెస్ అంతా చూస్తే అందులో అయిదవ వంతు ఈ హర్మూజ్ జలసంధి మీదుగానే సాగుతుంది అని అంటున్నారు. ఇది ఇరాన్ కి చాలా సమీపంలో ఉంది. సరిగ్గా ఇక్కడే ఇరాన్ తన చిన్న సైజ్ పడవలు అలగే హై స్పీడ్ ఎటాక్ చేసే క్రాఫ్టులు సముద్రంలోని చొచ్చుకెళ్ళే మైన్స్ ని కూడా మోహరించింది. మరి ఈ కీలకమైన హర్మూజ్ జల సంధి మార్గంలో ఏ మాత్రం అవరోధం కలిగినా సరే ప్రపంచ చమురు మార్కెట్ షేక్ అవుతుంది. అలా ముడి చమురు ధరలు కూడా దారుణంగా పెరుగుతాయని అంటున్నారు అవి ఏకంగా 20 నుంచి 40 డాలర్లకు పైగా ఎగబాకినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

చమురుతోనే బతుకు :

పశ్చిమాసియా యుద్ధం ఏకంగా సామాన్యుడి మీదనే పెను భారంగా మారనుంది అని నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరిగితే అన్ని రకాల నిత్యావసరాలు పెరిగిపోతాయి. అలాగే సగటు జీవి కిచెన్ లో పొయ్యి మీద ఈ యుద్ధం మంటల ప్రభావం కచ్చితంగా కనిపిస్తుంది అని అంటున్నారు. . పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే మాత్రం సామాన్యుడు నడ్డి విరిగినట్లే అని అంతా ఆందోళన చెందుతున్నారు. మరి ఈ పరిస్థితి మారాలని శాంతి నెలకొనాలని అంతా ఆశిస్తున్నారు

Tags:    

Similar News