• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బందరు బియ్యం మాయం వెనుక...

బందరు బియ్యం మాయం వెనుక అధికారులు?

| దీంతో మాజీ మంత్రి పేర్నితో కొందరు కుమ్మక్కై రేషన్ బియ్యం మాయాం చేశారా? అని ప్రభుత్వ పెద్దలు అనుమానిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-12-24 13:30 GMT

రాష్ట్రంలో సంచలనం కలిగించిన మచిలీపట్నంలోని రేషన్ బియ్యం కేసులో విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. ఈ విషయంలో పౌరసరఫరాల శాఖ అధికారులు సహకారం లేకపోవడంతో కేసు దర్యాప్తు ఆలస్యమవుతోందని పోలీసులు చెబుతున్నారు. దీంతో మాజీ మంత్రి పేర్నితో కొందరు కుమ్మక్కై రేషన్ బియ్యం మాయాం చేశారా? అని ప్రభుత్వ పెద్దలు అనుమానిస్తున్నారు.

పౌరసరఫరాల శాఖలోని కొందరు అధికారుల సహకారంతోనే బియ్యం బయటకు వెళ్లాయని పోలీసులు సందేహిస్తున్నారు. కేసును నీరుగార్చేందుకు అధికారులు, ఉద్యోగులు ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ తప్పించుకోవాలని చూస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు గొడౌన్లల్ ఉన్న రేషన్ బియ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాల్సివుంటుంది. ప్రతి నెలా సరకు నిల్వబ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి.

డిసెంబర్ 4న జేసీ గీతాంజలి శర్మ తనిఖీ చేసేందుకు ముందు 11 నెలలుపాటు ఏ అధికారి కానీ, ఉద్యోగి కానీ పేర్ని జయసుధకు చెందిన గిడ్డంగులను తనిఖీ చేయలేదని పోలీసులు చెబుతున్నారు. ఆరు నెలల ముందు వరకు వైసీపీ ప్రభుత్వ హయంలో పేర్ని పలుకుబడి వల్ల గొడౌన్లను తనిఖీ చేయలేకపోయారనుకుంటే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తనిఖీలు చేయకపోవడం పరిశీలిస్తే బియ్యం మాయం వెనుక అధికారుల పాత్ర కూడా ఉందని తెలుస్తోందని పోలీసు వర్గాల సమాచారం.

పేదల బియ్యం నిల్వచేసిన గొడౌన్లను 11 నెలల పాటు తనిఖీ చేయకుండా వదిలేయడమేంటని ప్రభుత్వపెద్దలు నిలదీస్తున్నారు. ఈ నెలతో గొడౌన్ లీజు కాలం పూర్తవుతుంది. లీజు పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో అసలు విషయం బయటపడింది. గొడౌన్ ఖాళీ చేసే పరిస్థితి వస్తే మాయమైన బియ్యం లెక్కలు చెప్పాల్సి వస్తుందనే ఆలోచనతో కొంతమంది అధికారులు రంగంలోకి దిగి తేడా వచ్చిన బియ్యానికి డబ్బు చెల్లిస్తామని ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందిగా సూచించినట్లు చెబుతున్నారు.

వాస్తవానికి గొడౌన్ యజమాని పేర్ని జయసుధ లేఖ ద్వారా చెప్పినంత వరకు బియ్యం తరలిపోయాయనే విషయం ఎవరికీ తెలియదు. గొడౌన్లను ఖాళీ చేస్తే పూర్తిస్థాయిలో బియ్యం లెక్కలు చెప్పాల్సి వస్తుందనే ఆలోచనతో బియ్యం తరుగుదల వచ్చిందని, వే బ్రిడ్జి సాంకేతిక సమస్య కారణంగా లెక్కలు తేడా వచ్చాయని, బియ్యం సంచులు కన్నాల వల్ల కారిపోయాయని చెప్పుకొచ్చారు. అయితే తేడా వేల టన్నుల్లో ఉండటంతో డబ్బు చెల్లించి తప్పించుకోవాలని చూశారు. కానీ, ప్రభుత్వ పెద్దలు సానుకూలంగా లేకపోవడంతో మాజీ మంత్రి పేర్ని కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు కూపీ లాగితే అధికారుల పాత్ర బయటపడుతోందంటున్నారు.

Tags:    
  • Tdp 
  • Jsp 
  • Bjp 
  • Congressparty 
  • Ycp 
  • Governmentofficials 
  • Police 
  • Rationrice 
  • CivilSuppliesDepartment 
  • Privategodoms 
  • Warehouses 
  • Policeofficials 

Similar News

చైర్మ‌న్ గిరి.. అంత ఈజీ కాదు ..!

2026-11-17 13:09 GMT

ఏపీలో జ‌డ్పీ పీఠాల‌పై చిక్కుముడులు.. రీజ‌నేంటి.. ?

2026-11-17 13:07 GMT

టీడీపీ హాట్ టాపిక్‌: విజ‌య‌న‌గ‌రం జ‌డ్పీ ప్ర‌స్తుతానికి రెండేళ్లేనా..?

2026-11-17 13:03 GMT

జెఫ్రీ ఎప్‌స్టీన్‌ది ఆత్మహత్యా కాదా.? పక్కా ప్లాన్‌తో చేసిన హత్యా? ఫోరెన్సిక్ విశ్లేషణతో సంచలనం

2026-11-17 12:46 GMT

తల్లి, చెల్లి అనే తేడా లేదా.. జగన్ సైతాన్ సైన్యానికి పచ్చరోగం.. ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు

2026-11-17 12:45 GMT

బ్రేకింగ్ : ఐపీఎల్ కు ధోని రిటైర్ మెంట్.. ఇక సీఎస్కే లో ఈ కొత్త రోల్..

2026-11-17 10:33 GMT

తుఫాన్ విపత్తుల అసలు లింకు ఎక్కడ ఉందో తెలుసా?

2026-11-17 10:31 GMT

మొన్న మైక్రోసాఫ్ట్.. నేడు అమెరికా బ్యాంకులు.. అగ్రరాజ్యంలో అసలేం జరుగుతోంది?

2026-11-17 10:30 GMT

రాహుల్ మనసులో మాట.. ఎవరా లక్కీ గర్ల్? నెట్టింట మొదలైన వేట!

2026-11-17 10:30 GMT

అమెరికాలో భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రంప్ తెచ్చిన కొత్త రూల్‌ను కొట్టేసిన కోర్టు!

2026-11-17 10:20 GMT

టాటా గ్రూప్‌లో ఏం జరుగుతోంది? జిమ్మీ టాటా లేఖతో కొత్త చర్చ

2026-11-17 10:03 GMT

‘‘అయ్యా మీ రూ.1000 తీసుకోండి’’.. బ్యాలెట్ బాక్స్‌లో నోట్లు, లేఖ వేసిన ఓటరు!

2026-11-17 10:02 GMT

Copyright @2026

Powered by Blink CMS