నేపాల్ రచ్చ వెనుక అమెరికా పాత్ర

సోషల్ మీడియా వేదికలపై బ్యాన్ విధిస్తూ నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ దేశంలోని యువతలో ఆగ్రహావేశాల్ని రగిలేలా చేయటంతో పాటు వీధుల్లోకి వచ్చి.. తీవ్రమైన ఆందోళనలు చేయటం తెలిసిందే.;

Update: 2025-09-09 04:21 GMT

సోషల్ మీడియా వేదికలపై బ్యాన్ విధిస్తూ నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ దేశంలోని యువతలో ఆగ్రహావేశాల్ని రగిలేలా చేయటంతో పాటు వీధుల్లోకి వచ్చి.. తీవ్రమైన ఆందోళనలు చేయటం తెలిసిందే. భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో పెద్ద ఎత్తున పౌరులు (ఒక బాలుడితో సహా ఇరవై మంది) మరణించటంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పేలా చేసింది. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. సోషల్ మీడియాపై నేపాల్ సర్కారు విధించిన బ్యాన్ కు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం.. చివరకు కొత్త రూపు దిద్దుకొని.. నేపాల్ ప్రభుత్వం రాజీనామా చేయాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది.

ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను సైతం లెక్క చేయకుండా వీధుల్లోకి వచ్చి.. సర్కారు తీరును తీవ్రంగా వ్యతిరేకించటం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే.. ఇదంతా పక్కాగా ప్రిపేర్ చేసిన స్క్రిప్టు ఆధారంగానే జరుగుతున్నాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. సోషల్ మీడియా బ్యాన్ మీద మొదలైన ఆందోళనలు.. నిరసనలు ప్రభుత్వం దిగిపోవాలనే డిమాండ్ రావటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఈ వాదనకు బలం చేకూరేలా నేపాల్ వెబ్ సైట్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ‘‘సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకండా జరిగిన ఉద్యమం కాస్తా.. కేపీ శర్మ ఓలి దిగిపో’ నినాదం వైపునకు ఎందుకు వెళ్లినట్లు? అన్నది ప్రశ్నగా సంధిస్తున్నారు. నేపాల్ ఆందోళన వెనుక అమెరికా పాత్ర ఉందని నేపాల్ పత్రికల అనుబంధ వెబ్ సైట్లలో కథనాలు వెలువడటాన్ని ప్రస్తావిస్తున్నారు.

ఇంతకూ అమెరికాకు ఒరిగేదేంటి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. ఇటీవల కాలంలో ఓలి చైనాకు దగ్గర కావటాన్ని గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నేపాల్ లో అమెరికా ప్రాజెక్టులను చేపట్టింది. ఆర్థిక.. దౌత్య మద్దతును పెంచింది. మిలీనియం చాలెంజ్ కార్పొరేషన్ వంటి పలు సంస్థలు రూ.లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను నిర్వహిస్తున్న విసయాన్ని గుర్తు చేస్తున్నారు.ఇలా నేపాల్ లో పెద్ద ఎత్తున అమెరికా ఆర్థిక కార్యకలాపాలు చేస్తున్న వేళ.. నేపాల్ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం అమెరికా ప్రాజెక్టులకు బ్రేకులు వేసేలా మారినట్లుగా అక్కడి మీడియా విశ్లేషిస్తోంది. ఈ కారణాలన్ని కలిసి ఓలి కుర్చీకే ఎసరు పెట్టే వరకు వెళ్లినట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ పరిస్థితిని ఓలి ఎలా డీస్తారో చూడాల్సిందే.

Tags:    

Similar News