పదకొండేళ్ళ మోడీ...టాప్ త్రీ ర్యాంకర్
ఆయన సంఘ్ మనిషి. ఎనిమిదేళ్ళకే సంఘ్ లో చేరిన మోడీ నాలుగు దశాబ్దాల పాటు సంఘ్ సేవలోనే నిమగ్నం అయ్యారు.;
నరేంద్ర మోడీ. ఈ రోజు ప్రపంచ స్థాయి నాయకుడిగా నిలిచారు. ఒకనాడు టీ అమ్మే కుటుంబంలో అత్యంత పేదరికంలో పుట్టి టీనేజ్ వరకూ అంతా సాదా సీదా జీవితం గడిపిన నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అనే ఒక యువకుడు జీవితం ఎన్నో మేలు మలుపులు తిరిగి ఈ రోజున అంతర్జాతీయ నాయకుడిగా ఆయనను నిలిపింది అంటే కనుక దాని వెనక మోడీ కృషి పట్టుదల ఎంతటివో అందరూ తెలుసుకోవాల్సిందే.
ఆయన సంఘ్ మనిషి. ఎనిమిదేళ్ళకే సంఘ్ లో చేరిన మోడీ నాలుగు దశాబ్దాల పాటు సంఘ్ సేవలోనే నిమగ్నం అయ్యారు. ఆయన సంఘ్ కోసం దేశం కోసం ఏమైనా చేయాలన్న లక్ష్యంతో పనిచేశారు. నరేంద్ర మోడీ. ఏ రోజూ పదవుల కోసం తాపత్రయ పడలేదు. అందుకే ఆయనను ఆ పదవులు వెతుక్కుని వచ్చాయి.
ఆయన మంత్రి పదవి చేపట్టకుండా ఒకేసారి గుజరాత్ సీఎం అయిపోయారు. అది ఒక రికార్డు. అలా ఆయన ప్రజా జీవితం 2001లో, మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం చేశారు. ఆ మీదట 2002, 2007, 2012లలో మూడుసార్లు తన నాయకత్వంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటి చేత్తో బీజేపీని గెలిపించిన మోడీ అజేయుడిగా చరిత్ర సృష్టించారు. ఆయన 13 ఏళ్ళకు పైగా నిరాటంకంగా ముఖ్యమంత్రిగా పనిచేశారు. అది సైతం ఒక రికార్డు.
ఇక 2014 మే 26న ఆయన తొలిసారి దేశానికి ప్రధాని అయ్యారు. ఇది కూడా మరో రికార్డు. అప్పటిదాకా జాతీయ రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం గుజరాత్ సీఎం గానే ఉన్న మోడీ ఎకాఎకీన కేంద్ర రాజకీయాలలోకి ప్రవేశించి మొదటి ప్రయత్నంలోనే ప్రధాని అయ్యారు. అంతే కాదు అప్పటికి గత మూడు దశాబ్దాలుగా పూర్తి మెజారిటీ కేంద్రంలో రాకుండా సంకీర్ణ ప్రభుత్వాల రాజ్యం చేస్తున్న నేపధ్యంలో బీజేపీకి తొలిసారి ఫుల్ మెజారిటీ తెచ్చారు. దేశ రాజకీయాలలో ఒక సుస్థిరతను ఆయన సాధించారు. అది మరో రికార్డు.
అంతే కాదు ఆయన 2019లో మరోసారి గెలిచి ప్రధాని పదవి చేపట్టడం రికార్డుగా ఉంది. ఈసరి ఆయన మే 30న ప్రమాణం చేసారు. 2014 కంటే అధిక ఎంపీ సీట్లు బీజేపీకి సాధించగలిగారు అలా మోడీ మార్క్ తో దేశ రాజకీయాలలో తనదైన ముద్ర వేశారు. ఇక 2024లో ఆయన మూడోసారి ప్రధాని జూన్ 9న కావడం ఇంకో గొప్ప రికార్డు. ఈ రికార్డు తో ఆయన దేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ సరసన చేరారు.
ఇక వరసగా మూడు సార్లు ప్రధానిగా ఇందిర సైతం కాలేకపోయారు. ఇక 11 ఏళ్ళ పాటు ప్రధానిగా కొనసాగుతూ ఆయన దేశంలో ఇప్పటిదాకా పనిచేసిన ప్రధానుల అందరినీ దాటుకుని ముందుకు సాగారు. పదేళ్ళ పాటు నిరాటంకంగా కొనసాగిన కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ ని సైతం ఆయన అలా అధిగమించారు.
ఇక ఆయన ముందు మరో రికార్డు సాధించాల్సి ఉంది. దెశానికి మూడు సార్లు ప్రధానిగా చేసి మొత్తం 16 ఏళ్ళకు పైగా ఏలిన ఇందిరాగాంధీ రికార్డుని 2029 తరువాత మరోసారి ప్రధాని అయి మోడీ తిరగరాస్తారు అని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అదే విధంగా దేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ పేరుతో మరో రికార్డు ఉంది. ఆయన ఏకంగా 17 ఏళ్ళ పాటు ప్రధానిగా ఉన్నారు. 2029లో మోడీ నాలుగవ సారి గెలిచిన రెండేళ్ళకే అలా ఇందిరా గాంధీ నెహ్రూ రికార్డుని బద్ధలు కొడతారు అన్న నమ్మకాన్ని దృఢ విశ్వస్వాన్ని బీజేపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఇన్ని రికార్డులు ఇప్పటికే సాధించి దేశానికి సరికొత్త దశ దిశను చూపించిన మోడీ 11 ఏళ్ళ పాలన పూర్తి చేసుకోవడం పట్ల బీజేపీ వర్గాలు ఎంతో సంతోషం వ్యక్తం చేశాయి. ఇది మోడీ నాయకత్వ పటిమకు నిదర్శనం అని బీజేపీ శ్రేణులు కొనియాడాయి. మోడీ ప్రధానిగా దేశాన్ని బలోపేతం చేశారని, తనదైన అద్భుతమైన విధానాలతో వ్యూహాత్మకమైన చర్యలతో దేశాన్ని ఎదురులేకుండా నిలిపారు అని పేర్కొన్నారు.
ఇక మోడీ నాయకత్వంలో 11 ఏళ్ల క్రితం దేశాంలో పరిణాంతామకమైన పాలన మొదలైంది అని బీజేపీ కొనియాడింది. సబ్ కా సాధ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వస్, సబ్ కా ప్రయాస్ అన్న నినాదంతో దార్శనీయతతో మోడీ నాయక్త్వంలో దేశంలో ఒక అద్భుతమైన ప్రయాణం మొదలైంది అని కేంద్ర గిరిజన మంత్రి జూయెల్ ఓరం అన్నారు
అలాగే మోడీ ఈజ్ గ్రేట్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే కూడా ప్రస్తుతించారు. ఏది ఏమైనా ఈ దేశంలో మోడీ రికార్డులు ఆయన సాధించిన విజయాలు ఆధునిక యుగంలో గొప్పవని చెప్పాలి. 2029లో ఆయన మళ్ళీ ప్రధాని అయితే ఆయన కంటే అత్యధిక కాలం పాలించిన వారు బహుశా మరొకరు సమీప కాలంలో రారు రాలేరు అని ఘంటాపధంగా చెప్పవచ్చు అన్నది రాజకీయ చరిత్రకారుల స్పష్టమైన మాట.