వెంకీ కుటుంబం.. నాగవంశీకి ఇది పెద్ద టాస్కే..

ఇప్పుడు అక్టోబర్ 30న సినిమాను రిలీజ్ చేయాలని మూవీ టీమ్ భావిస్తోంది. శనివారం జరిగిన జైలర్ 2 ప్రెస్‌ మీట్‌ లో నిర్మాత నాగవంశీ ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

Update: 2026-10-17 11:05 GMT

వెంకటేష్, త్రివిక్రమ్.. ఆ ఇద్దరి కాంబినేషన్‌ లో సినిమా అంటే ప్రేక్షకుల్లో కామన్ గానే అంచనాలు ఉంటాయి. అందులోనూ ఫ్యామిలీ స్టోరీతో వస్తున్నారంటే ఇంట్రెస్ట్ మరింత పెరుగుతుంది. కానీ ఆదర్శ కుటుంబం విషయంలో ఇప్పుడు పరిస్థితి కొంచెం మారింది. విడుదల వాయిదాలు, పాటలతో ఆశించిన స్థాయిలో బజ్ రాకపోవడంతో సినిమాపై మొదట్లో ఉన్న హైప్ మళ్లీ పెంచాల్సిన అవసరం ఏర్పడింది.

దీంతో ఇప్పుడు నాగవంశీ ఆశలన్నీ ట్రైలర్‌ పైనే ఉన్నాయి. అంతే కాదు, ప్రేక్షకుల్లో మళ్లీ అంచనాలు పెంచడం ఆయన ముందున్న పెద్ద టాస్క్‌ గా మారింది. మొదట ఆ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలని భావించారు. ఆ తర్వాత అక్టోబర్ 9కి వాయిదా వేశారు. కానీ ఆ తేదీకి కూడా సినిమా రిలీజ్ కాలేదు. సినిమా చుట్టూ ఉన్న హైప్ పై ఆ ఎఫెక్ట్ పడింది. మరోవైపు పాటలు కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో సినిమాపై బజ్‌ పెంచాల్సిన అవసరం ఏర్పడింది.

ఇప్పుడు అక్టోబర్ 30న సినిమాను రిలీజ్ చేయాలని మూవీ టీమ్ భావిస్తోంది. శనివారం జరిగిన జైలర్ 2 ప్రెస్‌ మీట్‌ లో నిర్మాత నాగవంశీ ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అయితే ఈసారి విడుదల తేదీని తానే అఫీషియల్ గా ప్రకటించనని చెప్పారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడటంతో మళ్లీ తనే తేదీ చెబితే ప్రేక్షకులు నమ్మరంటూ సరదాగా అన్నారు. ఈసారి హీరో వెంకటేష్‌ తోనే విడుదల తేదీని ప్రకటించాలని డిసైడ్ అయ్యారు.

ప్రస్తుతం వెంకటేష్ ఊటీలో షూటింగ్‌ లో ఉన్నారు. ఆయన హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత అక్టోబర్ 21 లేదా 22న ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే స్టేజ్ పై వెంకటేష్ సినిమా విడుదల తేదీని ఆఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. ఆ ఈవెంట్ సినిమాకు కొత్త ఊపు తీసుకొచ్చేలా ఉండాలని మేకర్స్ భావిస్తున్నారు.

అయితే కేవలం విడుదల తేదీ ప్రకటించినంత మాత్రాన సినిమాపై బజ్ పెరగదు. ప్రేక్షకులను ఆకట్టుకునే ట్రైలర్ రావడం ఇప్పుడు చాలా ముఖ్యం. స్టోరీలోని స్పెషాలిటీ, వెంకటేష్ రోల్, త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైన్మెంట్ ట్రైలర్‌ లో స్ట్రాంగ్ గా కనిపిస్తే ప్రేక్షకుల్లో మళ్లీ హైప్ పెరిగే అవకాశం ఉంటుంది. పాటలతో రాని దాన్ని ట్రైలర్ ద్వారా తీసుకురావాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ కాంబినేషన్‌పై ఉన్న అంచనాలకు తగ్గ కంటెంట్ ఉందనే నమ్మకాన్ని కలిగించాలి.

సినిమా విడుదలకు ఇంకా కొద్ది రోజులే ఉండటంతో ప్రమోషన్స్ కు ఎక్కువ సమయం లేదు. ట్రైలర్ విడుదల తర్వాత ప్రమోషనల్ ఈవెంట్స్ ఎలా నిర్వహిస్తారు, ఆడియన్స్ లో ఎలా హైప్ పెంచుతారనేది మెయిన్. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోపై ఉన్న ఇంట్రెస్ట్ మళ్లీ పెంచగలిగితే సినిమాకు మంచి ఊపు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆదర్శ కుటుంబం విషయంలో నాగవంశీకి రిలీజ్ డేట్ ప్రకటించడం కంటే, ప్రేక్షకుల్లో తగ్గిన ఆసక్తిని పెంచడమే పెద్ద టాస్క్. ట్రైలర్‌ తో ఆడియన్స్‌ను ఆకట్టుకుని సినిమాను అక్టోబర్ 30 విడుదలకు రెడీ చేయడం మేకర్స్ ముందున్న అసలు సవాల్.

Tags:    

Similar News