షేక్ హ్యాండ్స్‌కే మోడీ-ట్రంప్ ప‌రిమితం.. ప్ర‌పంచ మీడియా విస్మ‌యం!

ఆప‌రేష‌న్ సిందూర్‌ను తానే ఆపించాన‌ని ట్రంప్ ప‌దే ప‌దే ప్ర‌క‌టించారు. ఇది మోడీ హ‌వాను ఇబ్బంది పెట్టింది.

Update: 2026-06-17 09:08 GMT

అమెరికా అధ్య‌క్షుడు - భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీల జోడీకి ప్ర‌పంచ వ్యాప్తంగా అత్యంత ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఉంది. వీరిద్ద‌రూ క‌లిస్తే.. ప్ర‌పంచ మీడియా అనేక విశ్లేష‌ణ‌లు కూడా చేస్తుంది. దీనికి కార‌ణం.. అమెరికా ఎన్నిక‌ల నుంచి ట్రంప్ భార‌త ప‌ర్య‌ట‌న వ‌రకు, ప్ర‌ధాని మోడీ అమెరికాలో ప‌ర్య‌టించ‌డం నుంచి ట్రంప్‌ను త‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్ కు తీసుకువెళ్లే దాకా.. ఇరువురి మ‌ధ్య అనేక అంశాల‌పై సారూప్య‌త ఉంది. ముఖ్యంగా ట్రంప్‌.. మోడీని, మోడీ ట్రంప్‌నుఅనేక సంద‌ర్భాల్లో ప్ర‌శంసించుకున్నారు. కాగా.. దాదాపు 16 మాసాల విరామం త‌ర్వాత‌.. ప్ర‌ధాని మోడీ, అమెరికా అధినేత ట్రంప్ మ‌రోసారి ఒకే వేదిక‌పై క‌లిశారు.

ఫ్రాన్స్‌లోని ఏవియ‌న్‌లో మంగ‌ళ‌వారం.. జీ-7 దేశాల స‌ద‌స్సు ప్రారంభ‌మైంది. ఇది రెండురోజుల పాటు జ‌రుగుతుంది. ఈ స‌ద స్సులో జీ-7 భాగ‌స్వామ్య దేశాల అధినేతలు పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో ట్రంప్‌-మోడీలు కూడా హాజ‌ర‌య్యారు. ఇరువురు నేత లు.. క‌నీ క‌నిపించ‌గానే ఆప్యాయంగా ప‌ల‌క‌రించుకున్నారు. అంతేకాదు.. ప‌ర‌స్ప‌రం షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. అయితే.. ఇంత‌కుమించి ఏమీ కాలేద‌ని అంత‌ర్జాతీయ మీడియా పేర్కొంది. అంతేకాదు.. ఇరువురు నేత‌లు ఎదురు ప‌డితే భారీ ఎత్తున ఏదో జ‌రుగుతుంద‌ని ఊహించామ‌ని.. కానీ అలాంటి ప‌రిణామం ఏదీ క‌నిపించ‌లేద‌ని సీఎన్ ఎన్ పేర్కొంది.

ముభావం కాక‌పోయినా.. దాదాపు రిస్ట్రిక్టెడ్‌గానే ఇరువురు నాయ‌కులు వేదిక‌పై క‌నిపించారు. జీ-7 దేశాల స‌ద‌స్సుల్లో ఏ-బీ.. సీరియ‌ల్ ప్రాతిప‌దిక‌న సీట్లు కేటాయించ‌గా.. అమెరికా త‌ర్వాత భార‌త్‌.. కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. దీంతో ట్రంప్.. ప‌క్క‌న మోడీ కూర్చున్నారు. కానీ.. ఇరువురి మ‌ధ్య సంభాష‌ణ‌లు లెవ‌ని సీఎన్ ఎన్ పేర్కొంది. తొలుత క‌నిపించిన‌ప్పుడు మాత్ర‌మే క‌ర‌చాల‌నం చేసుకున్నార‌ని.. అంత‌కుమించి ఏమీ జ‌ర‌గ‌లేద‌ని తెలిపింది. ప్ర‌స్తుతం నెల‌కొన్న ప్ర‌పంచ ప‌రిస్థితుల నేప‌థ్యంలో రెండు అగ్ర‌దేశాల నాయ‌కులు.. ఇలా వ్య‌వ‌హ‌రించ‌డంపై పెద‌వి విరుపులు క‌నిపించాయ‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

ఎందుకు?

ఆప‌రేష‌న్ సిందూర్‌ను తానే ఆపించాన‌ని ట్రంప్ ప‌దే ప‌దే ప్ర‌క‌టించారు. ఇది మోడీ హ‌వాను ఇబ్బంది పెట్టింది. అలానే.. భార‌త్.. ర‌ష్యానుంచి చ‌మురు కొనుగోలు చేసే అంశాల‌పై నియంత్ర‌ణ విధించారు. ఇది కూడా భార‌త్‌ను తీవ్ర ఇర‌కాటంలోకి నెట్టింది. మ‌రోవైపు.. భారీ సుంకాలు విధించారు. దీంతో స‌ర్కారు ఆత్మ‌నిర్బ‌ర భార‌త్ నినాదాన్ని మ‌రింత పెంచాల్సివ‌చ్చింది. ఇక‌, తాజాగా గల్ఫ్ యుద్ధంలో అమాయ‌క భార‌త నావిక‌ల‌పై అమెరికా సైన్యం దాడులు చేసింది. ఫ‌లితంగాముగ్గురు మృతి చెందారు. ఇలా.. ప‌లు అంశాల్లో అమెరికా వ్య‌వ‌హ‌రించిన తీరు మోడీకి సంక‌టంగా మారింది. అందుకే.. పెద్ద‌గా ప‌ల‌క‌రింపులులేకుండా పోయాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

Tags:    

Similar News