పుతిన్‌కు ఎనలేని ప్రాధాన్యం.. మోడీ మెసేజ్ ఏంటి?
ప్రస్తుతం అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గిందన్న ప్రచారం జరుగుతోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల ను నియంత్రించామని.. అందుకే భారత్ చమురు కొనుగోళ్లను నిలిపి వేసిందని ట్రంప్ చెబుతున్నారు.;
భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. స్వయంగా ఆయనే విమానాశ్రయానికి ఎదురేగి ఆయ నకు స్వాగతం పలికారు. ఇరువురు నేతలు ఒకే కారులో ప్రయాణించి.. బస చేసే ప్రాంతానికి చేరుకున్నా రు. అంతేకాదు.. పుతిన్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లను స్వయంగా మోడీనే పర్యవేక్షిస్తున్నారు. అయితే .. ఇలా రష్యా అధినేతకు ఇంత ప్రాధాన్యం ఇవ్వడం వెనుక రీజనేంటి? మోడీ ఇస్తున్న సందేశం ఏంటి? అనేది ఆసక్తికగా మారింది.
వాస్తవానికి.. అమెరికా నుంచి భారత్‌కు పెద్ద ఎత్తున సవాళ్లు ఎదురవుతున్నాయి. అమెరికా అధినేత.. డొనా ల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. పైగా.. నాటో దేశాల వైఖరి కూడా.. భారత్‌కు ఇబ్బందిగా మారింది. ఇలాంటి సమయంలో రష్యాకు దన్నుగా భారత్ ఉందన్న మెసేజ్‌ను పంపించడంతోపాటు.. అవసరమైతే.. రష్యాతో చేతులు కలుపుతామన్న సందేశాన్ని కూడా.. పంపిస్తున్నట్టు అయింది. ఇది.. భారత వ్యూహాత్మక వైఖరికి నిదర్శనంగా అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గిందన్న ప్రచారం జరుగుతోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల ను నియంత్రించామని.. అందుకే భారత్ చమురు కొనుగోళ్లను నిలిపి వేసిందని ట్రంప్ చెబుతున్నారు. కానీ, భారత్ తన అవసరాల మేరకు కొనుగోళ్లు చేస్తోందని విదేశాంగ శాఖ చెబుతోంది. ఈ పరిణామాలతో రష్యా నుంచి భారత్ దూరంగా జరిగిపోలేదని.. రష్యాతో అనుబంధాన్ని మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తోందన్న సంకేతాన్ని కూడా భారత్ పంపించినట్టు అయింది.
మరీ ముఖ్యంగా ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో తటస్థ వైఖరిని అవలంభిస్తున్న భారత్.. ఇప్పుడు రష్యాను అమితంగా ప్రేమించడం వెనుక.. రష్యా అధ్యక్షుడిని తన వాడిగా చూడడం వెనుక.. వ్యూహాత్మక వైఖరిని అవలంభిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రష్యా నుంచి వ్యవసాయ ఉత్పత్తులతో పాటు.. ఆయుధాల ను కూడా దిగుమతి చేసుకుంటున్న భారత్.. అమెరికాకు ఒక రకంగా పరోక్ష చెక్ పెట్టే ఉద్దేశం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే.. అన్ని ప్రపంచ దేశాలను బారత్ కలుపుకొని వెళ్తుందన్న సందేశాన్ని ఇవ్వడం ద్వారా తాము ఎవరికీ శత్రువులు కాదన్న సందేశాన్ని కూడా ఇస్తోందని నిపుణులు చెబుతున్నారు.