• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రత్యేక పార్లమెంట్.......

ప్రత్యేక పార్లమెంట్.... డీలిమిటేషన్ కోసమేనా ?

| పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలు, బిల్లులకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీపై ఉత్కంఠ నెలకొంది.

By - Satya P
Update: 2026-11-27 02:31 GMT

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ మేరకు డేట్ కూడా ఫిక్స్ చేశారు. ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే పార్లమెంట్ ని ప్రొరోగ్ చేయకపోవడంతో షార్ట్ నోటీస్ లోనే పార్లమెంట్ సమావేశాలకు అవకాశం దొరికింది. ఇదిలా ఉంటే నవంబర్ 30, నుండి డిసెంబర్ 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని అనుకుంటున్నట్లుగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అత్యవసర ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ కోసమే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. దాంతో ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు డీలిమిటేషన్ కోసమేనని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

జోరుగా ఊహాగానాలు :

మరో వైపు చూస్తే ఈ ప్రత్యేక సమావేశాలలోనే డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లులకు సంబంధించిన అంశాలు తెరపైకి రావచ్చనే ఊహాగానాలు ప్రస్తుతం సర్వత్రా జోరుగా వినిపిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇంకా సమావేశాల్లో ప్రవేశ పెట్టబోయే బిల్లులు లేదా పూర్తి అజెండాను అధికారికంగా ఇంకా వెల్లడించలేదు కానీ ఈ ప్రత్యేకం వెనక బలమైన అజెండా ఉందనే అంటున్నారు. ఇక డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ల బిల్లులను ఆమోదం పొందడం కోసమే ఈసారి సమావేశాలు అని కూడా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే 2023 మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు సంబంధించిన అంశాలతో పాటు లోక్‌సభ సీట్ల పెంపు అలాగే నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను కేంద్ర ప్రభుత్వం తిరిగి తీసుకురావచ్చునని పెద్ద ఎత్తున వార్తా కథనాలు వస్తున్నాయి.

మూడింట రెండు వంతులు :

అయితే రెండు కీలక బిల్లులు ఆమోదం పొందడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదనే అంటున్నారు. వీటి ఆమోదానికి మూడింట రెండు వంతుల ఎంపీల మద్దతు అయితే కావాల్సి ఉంది. ఇదే ఏడాది ఏప్రిల్ లో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026కు లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ లభించని నేపథ్యంలో వీగిపోయింది. దాంతో ఈసారి ఏమి అవుతుంది అన్నదే సర్వత్రా చర్చగా ఉంది. అయితే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను అధికారికంగా ప్రొరోగ్ చేయకుండా ఉంచడం వెనుక డీలిమిటేషన్ బిల్లుకు మెజారిటీ కూడగట్టే వ్యూహం ఉందని కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఇప్పటికే ఆరోపించాయి. దానికి తగినట్లుగానే ప్రత్యేక సమావేశాలకు రంగం సిద్ధం అయింది.

మహిళా బిల్లు మీద మోడీ :

ఇక చూస్తే కనుక మహిళా బిల్లుని అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొనడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఈ మేరకు మోడీ రాసిన ఒక వ్యాసంలో చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. నారీ శక్తికి న్యాయం జరగకుండా ఏ శక్తీ ఆపలేదని పేర్కొంటూ గతంలో ఈ బిల్లుకు ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయని ఆయన విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్షాలు రాజ్యాంగ విలువల పట్ల తమ వైఖరిని బయటపెట్టుకున్నాయని కూడా మోడీ ఆరోపించారు.

అక్కడే పేచీ :

అయితే మహిళా బిల్లు ఆమోదానికి తమకు అభ్యంతరం లేదని ఇప్పటికీ ప్రతిపక్షాలు అంటున్నారు. తాము 33 శాతం మహిళా రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నామని అయితే దానిని నియోజకవర్గాల పునర్విభజన ) ప్రక్రియతో ముడిపెట్టడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు చెబుతున్నాయి. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని అవి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 30న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ బిల్లును సవరించి మళ్లీ సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తాజాగా స్పష్టం చేశారు. అయితే కేంద్రం ఆలోచనలలో డీలిమిటేషన్ బిల్లు కూడా ఉంది. మరి దానికి మూడింట రెండు వంతుల ఎంపీల మద్దతు ఎలా సమకూరుతుందన్నది మరికొద్ది రోజులలో మొదలు కానున్న ప్రత్యేక సమావేశాలలోనే చూడాల్సి ఉంది.

Tags:    
  • parliamentspecialsession 
  • delimitation 
  • womensreservation 
  • narendramodi 
  • amitshah 

Similar News

కలసి ఉండాల్సిందే...బాబు పవన్ బీజేపీ ఈక్వేషన్స్ ఇవే !

2026-11-27 02:30 GMT

షర్మిలకు వైఎస్ ఇచ్చిన ఆస్తులు ... చిట్టా విప్పిన రాచమల్లు

2026-11-27 02:30 GMT

రేవంత్ రెడ్డికి జగన్ కౌంటర్...మౌనం వీడినట్లేనా ?

2026-11-27 02:29 GMT

తెలంగాణ నీళ్ల పంచాయితీలో కొత్త ట్విస్ట్.. తప్పు కేసీఆర్‌దా? కాంగ్రెస్‌దా?

2026-11-27 02:29 GMT

ఒకప్పుడు కలల సౌధం.. నేడు బంగారు పంజరం.. సాఫ్ట్‌వేర్ రంగానికి గుడ్‌బై చెబుతున్న 72% టెకీల ఆవేదన ఇదే..

2026-11-27 02:27 GMT

బతికుండగానే తమ అంత్యక్రియలకు బుకింగ్.. రూ.1.49 లక్షల వరకు ప్యాకేజీలు!

2026-11-27 02:26 GMT

బీజేపీకి అంత సీన్ లేదు...కమలం గుండెల్లో రేవంత్ గునపాలు !

2026-11-27 02:25 GMT

భార్యాభర్తల మధ్య తరచూ గొడవలా? B12 లోపం ప్రభావం కూడా ఉండొచ్చు!

2026-11-27 02:25 GMT

హైదరాబాద్‌లో యాపిల్ తొలి స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం!

2026-11-27 02:24 GMT

కాంగ్రెస్ కి బాబు దగ్గరట...జగన్ దూరమట !

2026-11-26 17:39 GMT

డిజిటల్ విశ్వగురువు కాదు.. ‘డిలీట్’ గురువు.. యూట్యూబ్ రికార్డులో మనదే అగ్రస్థానం

2026-11-26 17:38 GMT

Copyright @2026

Powered by Blink CMS