40 ఏళ్లుగా పని చేస్తున్న ఉద్యోగికి యజమాని ఇచ్చిన గిఫ్టుకు ఫిదా
ఇదంతా ఎక్కడ జరిగిందంటే.. అమెరికాలో చోటు చేసుకుంది. బల్బీర్ గా పేరున్న పర్గన్ సింగ్ 1980లల్లో పంజాబ్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు.;
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని మన పూర్వీకులు చెప్పే మాట అక్షర సత్యం. ఇప్పుడు చెప్పే ఉదంతం ఆ కోవకు చెందిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలభై ఏళ్లుగా తమ వద్ద నమ్మకంగా.. అంతకు మిం చి కమిట్ మెంట్ తో పని చేసే ఉద్యోగి విషయంలో ఒక రెస్టారెంట్ యజమాని సత్కరించిన వైనం ఇప్పుడు వైరల్ గా మారింది. కష్టపడి పని చేసే ఉద్యోగి ఉన్నా.. దాన్ని గుర్తించి సత్కరించే యజమాని దక్కటం సంతోషమని చెప్పాలి.
ఎంత కష్టపడి పని చేసే ఉద్యోగి ఉన్నా.. మనసున్న యజమాని ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పే ఉదంతంలో మాత్రం కష్టపడి పని చేసే ఉద్యోగి.. అంతకు మించి ఉద్యోగి కష్టాన్ని గుర్తించటమే కాదు.. అద్భుతమైన బహుమతితో అతన్ని సత్కరించటం యజమాని పెద్ద మనసుకు నిదర్శనంగా చెప్పాలి.
ఇదంతా ఎక్కడ జరిగిందంటే.. అమెరికాలో చోటు చేసుకుంది. బల్బీర్ గా పేరున్న పర్గన్ సింగ్ 1980లల్లో పంజాబ్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. మసాచుసెట్స్ లో ఒక మెక్ డీ స్టోర్ లో పనికి కుదిరాడు. అలా జాబ్ లో చేరిన అతను.. చూస్తుండగానే 40 ఏళ్ల సర్వీసు పూర్తి చేశారు. ఈ ఫ్రాంఛైజీ యజమాని లిండ్సే వాలిన్ సదరు ఉద్యోగి సేవలకు తగిన గుర్తింపు లభించాలన్న ఉద్దేశంతో స్టోర్ కు వెళ్లారు.
తనతో పాటు ఒక లగ్జరీ కారును బహుమతిగా ఇవ్వటమేకాదు.. కారులో సెలబ్రిటీ మాదిరి ఆయన్ను స్టోర్ కు తీసుకురావటమే కాదు.. రెడ్ కార్పెట్ పరిచి ఘనంగా వెల్ కం పలకటం గమనార్హం. అంతేకాదు.. 40 ఏళ్ల సర్వీసుకు గుర్తుగా 40 వేల డాలర్ల చెక్కును అందజేశారు. భారత రూపాయిల్లో చూస్తే.. రూ.35 లక్షలకు దగ్గరగా ఉంటుందని చెప్పాలి.
సదరు ఉద్యోగిని తమ సంస్థల్లో కీలక స్తంభంగా పేర్కొన్న యజమాని.. స్టోర్ లో ఆ పని ఈ పని అన్న తేడా లేకుండా అన్ని పనుల్ని బల్బీర్ చూసేవాడని ఈ సందర్భంగా యజమాని పేర్కొన్నారు. కిచెన్ లో పని చేయటం మొదలు చెత్త తొలగించటం వరకు అన్ని పనులు చేసినట్లుగా మెక్ డీ యజమాని స్పష్టం చేయటమే కాదు.. ఊహించని రీతిలో బహుమతులతో ఉక్కిరిబిక్కిరి చేశారని చెప్పాలి.