అధ్యక్షుడి మాటల సునామీ.. 15 గంటల ప్రసంగంతో ప్రపంచరికార్డ్
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఒక దేశాధినేతగా అత్యధిక సమయం విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించారు.;
సాధారణంగా దేశంలో మన దేశరాజకీయాల్లో సీఎం చంద్రబబు ఎక్కువగా ప్రెస్ మీట్ లు ,సమావేశాలు నిర్వహిస్తారని పేరొందారు.కానీ మనదేశంలోనేకాదు.. విదేశాల్లోనూ కొందరు నేతలున్నారు. అందులో మల్దీవుల అధ్యక్షులు ఇంకా అరవీర ప్రసంగీకుడిగా ఉన్నారు.తాజాగా ఆయనచేసిన పని వైరల్ అవుతోంది.
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఒక దేశాధినేతగా అత్యధిక సమయం విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆయన దాదాపు 15 గంటల పాటు సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ విలేకరుల సమావేశం శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ప్రెసిడెంట్ ముయిజ్జు మొత్తం 14 గంటల 54 నిమిషాల పాటు మాట్లాడారు. ప్రధానంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మధ్యలో ప్రార్థనల కోసం కొద్దిసేపు విరామం తీసుకున్నారని తెలిపారు.
ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సమాచారం. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అక్టోబర్ 2019లో 14 గంటల పాటు నిర్వహించిన మునుపటి రికార్డును ముయిజ్జు అధిగమించినట్లు మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం ధృవీకరించింది.
ప్రత్యేకమైన రికార్డులను నెలకొల్పిన దేశాధినేతల చరిత్ర మాల్దీవులకు ఉంది. 2009లో అప్పటి అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ హిందూ మహాసముద్రం అడుగున క్యాబినెట్ సమావేశం నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. భూతాపం కారణంగా పెరుగుతున్న సముద్ర మట్టాల వల్ల మాల్దీవుల వంటి తక్కువ ఎత్తులో ఉన్న ద్వీప దేశాలకు ఎదురవుతున్న ప్రమాదాన్ని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకురావడానికి ఈ వినూత్న కార్యక్రమాన్ని అప్పట్లో చేపట్టారు.
ఇప్పుడు అధ్యక్షుడు ముయిజ్జు నిర్వహించిన సుదీర్ఘమైన విలేకరుల సమావేశం దేశ చరిత్రలో మరో ప్రత్యేకమైన రికార్డును జోడించింది, ఇది మీడియాతో సుదీర్ఘంగా ప్రత్యక్షంగా సంభాషించడాన్ని సూచిస్తుంది.