ఆర్జేడీ కంచుకోటలో యువ గాయని సంచలనం
బీహార్ అసెంబ్లీలో అతి చిన్న వయసు కలిగిన ఎమ్మెల్యేగా ఆమె కొత్త రికార్డుని స్థాపించారు. ఇప్పటిదాకా ఈ రికార్డు తేజస్వి యాదవ్ పేరున ఉంది. ఆయన 26 ఏళ్ళ వయసులో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.;
అది ఆర్జేడీకి కంచుకోట లాంటి సీటు. అక్కడ నుంచి అనేక ఎన్నికల్లో ఆర్జేడీ గెలుస్తూ వస్తోంది. అలాంటి సీట్లో ఒక యువ గాయని గెలవడం అంటే బీహార్ లో తాజా రాజకీయాల్లో అది ఒక అద్భుతంగా చూడాల్సి ఉంది. ఆమె రాజకీయ అరంగేట్రం చేస్తూనే ఒక బిగ్ టాస్క్ ని ఎదుర్కొన్నారు. ఎపుడూ అక్కడ బీజేపీ గెలవని సీటు నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. ఆర్జేడీకి దిట్టమైన బలం ఉన్న చోట ఆమె డేరింగ్ గా వేసిన స్టెప్ ఈ రోజున ఆమెను అసెంబ్లీ దాకా నడిపించింది.
రెండు నెలల్లోనే :
ఇదిలా ఉంటే ఈ యువ గాయని పేరు మైథిలీ ఠాకూర్. ఆమె జానపద గాయనిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో కార్యక్రమాలను బీహార్ అంతటా ఇస్తూ పేరు తెచ్చుకున్నారు. అయితే ఆమెకు ప్రజా సేవ చేయాలన్న కోరిక కలిగింది. అందుకే ఆమె బీజేపీ నేతలను సంప్రదించారు. వారు కూడా ఆమె రాకను స్వాగతించారు. అయితే ఆమెకు సులువైన సీటుని అయితే ఇవ్వలేదు. ఆమె పాపులారిటీ మీద కమలం పార్టీ కూడా పందెం కాస్తూ ఆర్జేడీ కంచుకోటలో పోటీకి దింపింది. అలా అలీనగర్ లో పోటీ చేసిన మైథిలీ ఠాకూర్ సమీప ఆర్జేడీ అభ్యర్థి బినోద్ మిశ్రాపై 11 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపుతో ఘన విజయం సాధించారు. కేవలం రెండు నెలల వ్వవధిలోనే ఆమె రాజకీయ రంగ ప్రవేశం ఆ వెంటనే ఎమ్మెల్యే స్థానాన్ని అందుకోవడం జరిగిపోయాయి.
మరో రికార్డు :
బీహార్ అసెంబ్లీలో అతి చిన్న వయసు కలిగిన ఎమ్మెల్యేగా ఆమె కొత్త రికార్డుని స్థాపించారు. ఇప్పటిదాకా ఈ రికార్డు తేజస్వి యాదవ్ పేరున ఉంది. ఆయన 26 ఏళ్ళ వయసులో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఈసారి ఆ రికార్డుని ఆమె బద్ధలు కొట్టారు. అంతే కాదు ఆమెతో పాటుగా పాతికేళ్ళ వయసు కల్గీన వారు ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో సోను కుమార్ (గోహ్), నవీన్ కుమార్ (భట్నాహ), కుందన్ కుమార్ (షేక్‌పురా), శంబూబాబు (సుపాల్), రాజ్ కుమార్ సాదా (సిమ్రీ భక్తీయార్‌పూర్) ఉన్నారు. దీంతో ఈసారి యంగ్ స్టర్స్ తో అసెంబ్లీ కళకళలాడనుంది అన్న మాట.
ముస్లిం ఆధిపత్యం :
అలీనగర్ సీటులో ముస్లిం ఓటు గణనీయంగా ఉంటుంది. ఇది ఆర్జేడీకి బాగా కలసి వస్తోంది. అనేక సార్లు ఆ పార్టీ గెలవడానికి కారణం ఈ ఓటు బ్యాంకే. సీమాంచల్ లో ఉన్న ఈ అసెంబ్లీ సీటు బీజేపీకి అందని పండుగా మారుతూ వచ్చింది. కానీ తొలిసారి రాజకీయ అరంగేట్రం చేసిన మైథిలీ ఠాకూర్ ఆ ఫీట్ ని చేదించి బీజేపీకి విన్నింగ్ సీటుగా మార్చారు. ఇదిలా ఉంటే అలీ నగర్ సీటు పేరుని సీతానగర్ గా మార్చే ప్రతిపాదన ఉంది. ఎన్నికల సమయంలో ఈ ప్రచారం కూడా కలసి వచ్చింది అని అంటున్నారు.
మాటలకు అందని విజయం :
ఇక తన విజయం మీద మైథిలీ ఠాకూర్ మీడియా ఎదుట మాట్లాడుతూ, ఈ గెలుపు చలా గొప్ప్పదని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలవడం అనందంగా ఉంది, అదే సమయంలో తనకు నోటి వెంట మాటలు రావడం లేదని అన్నారు. ఇంతటి ఘనతను అందించిన ప్రజలదే ఈ గెలుపు అని ఆమె పేర్కొన్నారు. తన గెలుపుతో పాటు అలీనగర్ నియోజకవర్గ ప్రజలు కూడా గెలిచినట్లుగా భావిస్తున్నానని ఆమె చెప్పడం విశేషం. ఈ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలు బీజేపీ పట్ల విశ్వాసం ప్రకటించారని అన్నారు.