కారు కొనాలనుకుంటున్నారా? బంపర్ ఆఫర్ ప్రకటించిన మహీంద్రా!

ఇండియాలోని ప్రముఖ కార్ల తయారీ కంపెనీలలో మహీంద్రా కంపెనీ ఎంతో ఫేమస్.. ఈ కంపెనీ నుంచి కార్లు మాత్రమే కాకుండా ఎన్నో వాహనాలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి;

Update: 2025-09-06 12:16 GMT

ఇండియాలోని ప్రముఖ కార్ల తయారీ కంపెనీలలో మహీంద్రా కంపెనీ ఎంతో ఫేమస్.. ఈ కంపెనీ నుంచి కార్లు మాత్రమే కాకుండా ఎన్నో వాహనాలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే అలాంటి మహీంద్రా కార్ల కంపెనీ వారు.. సెప్టెంబర్ 6 నుంచే పూర్తిస్థాయిలో జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు అందజేస్తున్నట్లు తెలియజేశారు.. ఈ మేరకు ఆనంద్ మహీంద్రా.. తన ఎక్స్ ఖాతా ద్వారా.. "కేంద్రం ప్రకటించిన జీఎస్టీ సవరణ సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తుందని.. కానీ తమ మహీంద్రా కంపెనీ మాత్రం ఈరోజు నుంచే తగ్గిన ధరలతో ఎస్ యు వి కార్లను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రామిస్ చేయడమే కాదు.. చేసి చూపిస్తాం.. థాంక్యూ మహీంద్రా ఆటో" అంటూ ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విషయంలోకి వెళ్తే.. ఈ వారం ప్రారంభంలో కేంద్ర సర్కార్ ప్రకటించినటువంటి వస్తువులు, సేవల పన్ను తగ్గింపు కారణంగా.. అర్హత కలిగి ఉన్నటువంటి కార్లపై రూ.1.6 లక్షల వరకు ధర తగ్గింపును అందిస్తోంది.ముఖ్యంగా మహీంద్రా ఎస్.యూ.వీ విభాగంలో మాత్రమే కార్స్ ను తయారు చేస్తూ ఉన్నది. ఇందులో 1500 సీసీకి మించని ఇంజన్ సామర్థ్యం, 4000 మిల్లీమీటర్స్ మించని పొడవు కలిగిన డీజిల్ ఆధారిత మోటర్ వాహనాలపై జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి తగ్గించారు. ముఖ్యంగా 350సీసీ లేదా అంతకంటే తక్కువ సామర్థ్యం గల చిన్న కార్లు, మోటార్ సైకిళ్లపై జిఎస్టిని తగ్గించారు. నిజానికీ ఎక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగినటువంటి పెట్రోల్, డీజిల్ కార్లు గతంలో 50 శాతం ప్రభావంతమైన పన్నులు చెల్లించాయి.

అలాగే కొత్త వ్యవస్థ కింద దీనిని ఫ్లాట్ 40% జీఎస్టీ గా కూడా సవరించారు. బొలెరో /నియో 31 శాతం నుండి 18 శాతానికి తగ్గించడంతో.. మహీంద్రా కార్లపై రూ.1.27 లక్షల ప్రయోజనం ఉంటుంది.

ఎక్స్ యువి 3XO ( పెట్రోల్): 29%( జీఎస్టీ+సెస్ ) నుండి 18 శాతం తగ్గింపుతో.. రూ.1.40 లక్షల వరకు ప్రయోజనం కలుగుతుంది.

XUV 3XO (డీజీల్ ) :31%(జీఎస్టీ+సెస్ )18%కి జిఎస్టి కుదించబడింది.. దీంతో ఈ మోడల్ పై రూ.1.56 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది.

XUV3XO (డీజిల్): 31% (జీఎస్టీ+ సెస్) నుండి 18%కి తగ్గించారు. ఈ తగ్గిన జీఎస్టీ కారణంగా ఈ మోడల్ పై సుమారుగా రూ. 1.56 లక్షల వరకు ప్రయోజనం కలుగుతుంది.

థార్ 2WD (డీజిల్): 31% ( జీఎస్టీ+ సెస్) నుండి 18% కి తగ్గించారు. దీంతో ఈ మోడల్ పై రూ.1.35 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు.

థార్ 4WD (డీజిల్): 48% ( జీఎస్టీ+ సెస్) నుండి 40%కి తగ్గించారు. దీంతో ఈ మోడల్ పై రూ:1.01 లక్షల వరకు ప్రయోజనం కలుగుతుంది.

స్కార్పియో క్లాసిక్: 48% ( జీఎస్టీ+ సెస్) నుండి 40% కి తగ్గించారు. ఇలా తగ్గిన మోడల్ పై రూ: 1.01 లక్షల వరకు ప్రయోజనం కలుగుతుంది.

స్కార్పియో-ఎన్: 48% ( జీఎస్టీ+ సెస్) నుండి 40% కి తగ్గించారు. ఈ మోడల్ పై రూ.1.45 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.

Tags:    

Similar News