కేటీఆర్ మీద భారీ బాంబ్ వేసిన మాగంటి తల్లి
ఈ సందర్భంగా మాగంటి గోపీనాథ్ మరణంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేవారు. గోపీనాథ్ మరణమే ఒక మిస్టరీగా ఆమె అభివర్ణించారు.;
షాకింగ్ వ్యాఖ్యలు చేశారు దివంగత మాగంటి గోపీనాథ్ తల్లి. జూబ్లీ ఉపపోరు వేళ.. మాగంటి ఇంట వారసత్వ పోరు తెర మీదకు రావటం.. గోపీనాథ్ మొదటి భార్య, ఆమె సంతానం లీగల్ హైర్ సర్టిఫికేట్ జారీ మీద అభ్యంతరం వ్యక్తం చేయటం తెలిసిందే. తాజాగా రెవెన్యూ అధికారుల ఎదుట మొదటి భార్య కుమారుడు ప్రద్యుమ్న, మాగంటి సతీమణి సునీత కుమార్తె దిశర కూడా హాజరు కావటం తెలిసిందే. మాగంటి మొదటి భార్య కుమారుడు అధికారులను కలిసిన క్రమంలో మాగంటి తల్లి మహానందకుమారి మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు తానెప్పుడూ బయటకు రాలేదని.. మీడియాతో మాట్లాడింది లేదని చెప్పిన ఆమె.. 1998లో మాలినితో గోపీనాథ్ కు పెళ్లైందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాగంటి గోపీనాథ్ మరణంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేవారు. గోపీనాథ్ మరణమే ఒక మిస్టరీగా ఆమె అభివర్ణించారు. తన కొడుకు ఎఫ్పుడు చనిపోయారో తమకు తెలీదన్న ఆమె.. కేటీఆర్ వచ్చే వరకు తన కొడుకు మరణాన్ని ధ్రువీకరించలేదన్నారు. అలా ఎందుకు చేశారో కేటీఆరే జవాబు చెప్పాలని ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
‘‘గోపీనాథ్ మొదటి భార్య మాలినిదేవే. సునీతతో పెళ్లి నేను చేయలేదు. ఆమె వచ్చాక రెండేళ్లు మాతో కలిసి ఉన్నారు. ఆ తర్వాత బయటకు వెళ్లారు. మాలినితో విడాకులకు దరఖాస్తు చేసుకుంటే అవి రద్దు అయ్యాయి. అందరూ గోపీనాథ్ పిల్లలే. కొడుకుగా ప్రద్నుమ్నకు హక్కులు దక్కాలి. కుటుంబం అంటే అందరు కలిసిమెలిసి ఉండాలి. ఆమె పోటీ చేస్తున్న విషయం గురించి పార్టీ వాళ్లు కానీ.. సునీత కానీ నాకు చెప్పలేదు’’ అని వ్యాఖ్యానించారు.
తన కొడుకు వెంటిలేటర్ పై ఉన్నాడంటూ తెలిసినప్పుడు తాను తన కొడుకును చూడాలని ప్రయత్నించినా అందుకు అనుమతించలేదన్న ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. ‘‘కేటీఆర్ అక్కడకు వస్తే నన్ను చూడనివ్వట్లేదు. నువ్వు అయినా చెప్పయ్యా అని అడిగా. మాట్లాడి వస్తానని వెళ్లిన కేటీఆర్ అటు నుంచి అటే వెళ్లిపోయారు. ఇంత పెద్ద వయసులో పరిగెత్తినా ఫలితం లేకుండా పోయింది’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అదే సమయంలో మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు మీడియాతో మాట్లాడిన సందర్భంలోనూ తన తండ్రి మరణిస్తే.. అమెరికానుంచి వచ్చే ప్రయత్నం చేయగా.. రావొద్దని తనకు చెప్పారన్నారు. తన తండ్రి తనతో టచ్ లో ఉండేవారని.. తరచూ ఫోన్ లో మాట్లాడేవారన్న ప్రద్యుమ్న తన తండ్రి మరణించిన వేళ తనకు ఎదురైన పరిస్థితిని చెబుతూ.. ‘‘నేను అమెరికా నుంచి రావాలని అనుకున్నా. అక్కడ నుంచి రావటానికి 24 గంటలు పడుతుంది. అప్పటివరకు వేచి ఉండటం సాధ్యం కాదని కొందరు చెప్పారు. నువ్వు వస్తే గొడవలు జరుగుతాయి. రాకుండా ఉండటమే మంచిదని ఇంకొందరుచెప్పారు. ఇప్పుడు ఇండియాకు రావొద్దని బీఆర్ఎస్ పార్టీ వారు బెదిరించారు. ఆ వ్యక్తులు ఎవరన్నది తర్వాత చెప్పతా. వాళ్లు నాకు ఫోన్ చేసిన కాల్ లాగ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ సమయంలో వచ్చి గొడవ చేయటం బాగోదని.. గౌరవప్రదంగా నా తండ్రి అంతిమ సంస్కారాలు జరగాలని భావించా. నా జనన ధ్రువీకరణ పత్రంతో తారక్ ప్రద్యుమ్న కొసరాజు అని ఉంది. అప్పటి నుంచి అదే కంటిన్యూ అవుతుంది. నా పాస్ పోర్టు ఇతర డాక్యుమెంట్లలో నా తండ్రి పేరు గోపీనాథ్ పేరు ఉంటుంది’’ అని చెబుతున్న వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కేంద్రమంత్రి బండి సంజయ్ సైతం మాగంటి మరణంపై విచారణ జరిపించాలని.. కేటీఆర్ ను బాధ్యుడ్ని చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.