మంగళగిరిలో లోకేష్ ధీమా...వైసీపీలో హాట్ డిస్కషన్...!

మంగళగిరి సీటు ఇపుడు టాక్ ఆఫ్ ది ఏపీ అన్నట్లుగా మారింది. అక్కడ నారా లోకేష్ వరసగా రెండవ సారి పోటీ చేస్తున్నారు.

Update: 2024-02-16 09:30 GMT

మంగళగిరి సీటు ఇపుడు టాక్ ఆఫ్ ది ఏపీ అన్నట్లుగా మారింది. అక్కడ నారా లోకేష్ వరసగా రెండవ సారి పోటీ చేస్తున్నారు. ఆయన ఈసారి కూడా ఓడాలన్నది వైసీపీ అధినాయకత్వం పట్టుదలగా ఉంది. అయితే లోకేష్ బేఫికర్ గా ఉన్నారు. ఆయన యువగళం పేరుతో గత ఏడాది అంతా మంగళగిరికి దూరం అయ్యారు. ఇపుడు శంఖారావం పేరుతో ఏపీలో టూర్లు చేస్తున్నారు.

అయినా కూడా మంగళగిరిలో చూస్తే లోకేష్ గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎంత ధీమా లేకపోతే మరో సీటు కూడా వెతుక్కోకుండా లోకేష్ అక్కడే పోటీకి సై అంటారు అన్నది వైసీపీ పెద్దలకు పట్టుకుంది. అదే టైం లో ఆయన మంగళగిరిలోనే ఉండిపోవడం లేదు. హాయిగా ఏపీ అంతా చుట్టబెడుతున్నారు. పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల నారా లోకేష్ మంగళగిరిలోని పార్టీ నాయకులతో మాట్లాడుతూ గతసారి అయిదు వేల ఓట్ల తేడాతో ఓడానని ఈసారి పది వేసి హెచ్చిస్తే తనకు యాభై వేల ఓట్ల మెజారిటీయే వస్తుంది అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఆయనకు పోటీగా గంజి చిరంజీవిని తెచ్చారు. ఆయన బలమైన చేనేత సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయన సతీమణి కాపు సామాజిక వర్గం.

ఈ రెండు సామాజిక వర్గాలు అక్కడ డామినేటింగ్ రోల్ ప్లే చేస్తున్నాయి. పైగా 2014లో జస్ట్ 12 ఓట్లతో చిరంజీవి ఓడారు. దాంతో పాటు టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దాంతో ఆ సానుభూతి కలసి ఈసారి వైసీపీ తరఫున గంజి చిరంజీవి గెలుస్తారు అని లెక్క వేసుకుని పోటీలోకి దించుతున్నారు.

Read more!

అయితే గంజి చిరంజీవికి ఒంటరి పోరాటం అవుతోందిట.ఆయనకు వైసీపీ నుంచి తగిన సాయం లభించడంలేదు అని అంటున్నారు. అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసి వైసీపీలో ఉన్న ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కానీ మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలను పిలిపించుకుని మాట్లాడారు అని తెలుస్తోంది. అయితే కాండ్రు కమల వర్గం మురుగుడు వర్గం అసంతృప్తిగా ఉన్నారు అంటున్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఓకే అన్నట్లుగా ఉంది.

కానీ జగన్ మాత్రం చిరంజీవినే గెలిపించాలని కోరినట్లుగా తెలుస్తోంది. మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చాక సరైన ప్రాధాన్యత ఇస్తామని కమలకు చెప్పారని అంటున్నారు. ఇక మంగళగిరి బాధ్యతలు విజయసాయిరెడ్డికి అప్పగించారు. దాంతో లోకేష్ మీద పదునైన వ్యూహాన్నే వైసీపీ రూపొందించింది అని అంటున్నారు. మరి లోకేష్ ధీమాకు చెక్ పెడుతూ గంజి చిరంజీవి గెలుస్తారా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News