హైదరాబాద్ మొయిన్ రోడ్ మీద లిక్కర్ లారీ బోల్తా.. ఎగబడి ఎత్తుకెళ్లిపోయారు

హైదరాబాద్ మహానగరంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. జంట నగరాల్లో ఒకటైన సికింద్రాబాద్ ప్రధాన రహదారి మీద బుధవారం సాయంత్రం వేళలో లిక్కర్ లోడ్ తో వెళుతున్న లారీ బోల్తా పడింది.

Update: 2024-05-23 04:48 GMT

హైదరాబాద్ మహానగరంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. జంట నగరాల్లో ఒకటైన సికింద్రాబాద్ ప్రధాన రహదారి మీద బుధవారం సాయంత్రం వేళలో లిక్కర్ లోడ్ తో వెళుతున్న లారీ బోల్తా పడింది. దీంతో.. లారీలోని మద్యం కేసులు రోడ్డు మీద పడిపోయాయి. దీంతో.. అటుగా వెళుతున్న ప్రజల్లో చాలామంది లారీ వద్దకు వచ్చి.. అందులోని వ్యక్తులకు ఏం జరిగింది? వారెలా ఉన్నారు? అన్న దాని కంటే.. రోడ్డు మీద పడిపోయిన లిక్కర్ కేసుల నుంచి బయటకు వచ్చిన బాటిళ్లను ఎవరికి దొరికింది వారు ఎత్తుకెళ్లిన వైనం ఆసక్తికరంగా మారింది.

సికింద్రాబాద్ పరిధిలోని బోయినపల్లి ప్రధాన రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఎప్పుడైతే లారీ లోని మద్యం బాటిళ్లు రోడ్డు మీదకు వచ్చాయో.. కాసుపు అక్కడంతా గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. వాహనంలో ఇరుక్కున్న డ్రైవర్.. క్లీనర్ కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదం నుంచి తేరుకున్న వారు.. లారీ బోల్తా ఘటన గురించి యజమానులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే.. జనం రోడ్డు మీద పడిన బాటిళ్లను పట్టుకోకుండా ఉండేందుకు రక్షణగా నిలిచారు.

Read more!

అయినప్పటికి పలువురు మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడంతా ట్రాఫిక్ జాం నెలకొంది. ప్రధాన రహదారి కావటం.. రద్దీ ఎక్కువగా ఉండే ఈ రోడ్ మీద మద్యం లారీ బోల్తా కారణంగా కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జాం అయ్యింది. సందట్లో సడేమియా అంటూ పలువురు మద్యం బాటిళ్లను పట్టుకొని వెళ్లిపోయారు. బోల్తా ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు వచ్చి.. ట్రాఫిక్ క్లియర్ చేయటంతోపాటు మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లకుండా కట్టడి చేశారు. కానీ.. అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది.

Tags:    

Similar News