కోటి రూపాయల హ్యాండ్ షేక్.. ఢిల్లీలో మెస్సీమేనియా
అర్జెంటీనా స్టార్, అతడి బృందం చాణక్యపురిలోని ది లీలా ప్యాలెస్ హోటల్ లో బస చేయనున్నారు. వారి కోసం హోటల్ లోని ఒక ఫ్లోర్ ను పూర్తిగా రిజర్వ్ చేశారు.;
అర్జెంటీనా ప్రపంచకప్ విజేత కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఉదయం ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా దేశ రాజధానిలో భారీ భద్రత, ప్రముఖుల సమావేశాలు, ఉన్నత స్తాయి ఇంటరాక్షన్లతో ఆరోజు మొత్తం సందడిగా ఉండనుంది. మెస్సీ, అతడి బృందం చాణక్యపురిలోని దీ లీలా ప్యాలెస్ హోటల్ లో బస చేయనున్నారు. వారి కోసం హోటల్ లోని ఒక ఫ్లోర్ ను పూర్తిగా రిజర్వ్ చేశారు.
అర్జెంటీనా స్టార్, అతడి బృందం చాణక్యపురిలోని ది లీలా ప్యాలెస్ హోటల్ లో బస చేయనున్నారు. వారి కోసం హోటల్ లోని ఒక ఫ్లోర్ ను పూర్తిగా రిజర్వ్ చేశారు. అర్జెంటీనా స్టార్,అతడి బృందం హోటల్ లోని ప్రెసిడెన్షియల్ సూట్స్ లో ఉండనున్నారు. వీటి ఖర్చు రాత్రికి సుమారు రూ.3.5 లక్ష నుంచి రూ.7 లక్షల వరకూ ఉంటుందని సమాచారం.మెస్సీ బస గురించి పూర్తి గోప్యత పాటించాలని హోటల్ సిబ్బందికి కఠినమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
విమానాశ్రయం నుంచి హోటల్ కు చేరుకోవడానికి 30 నిమిషాలు పట్టవచ్చని అంచనా.. అయితే దీ లీలా ప్యాలెస్ చుట్టూ భద్రతా ఏర్పాట్లు మాత్రం చాలా కఠినంగా ఉన్నాయి. గతంలో మెస్సీ భారతదేశాన్ని సందర్శించినప్పుడు భారీగా గుమిగూడిన జనసందోహాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతాన్ని అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రాంతంగా మార్చారు. హోటల్ ను అక్షరాల ఒక కోటలా మార్చేశారు.
హోటల్ లో కేవలం ఎంపిక చేసిన కార్పొరేట్ ,వీఐపీ అతిథుల కోసం మూసివేసిన తలుపుల వెనుక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ ప్రత్యేకమైన ఇంటరాక్షన్లో పాల్గొనడానికి కొంతమంది కార్పొరేట్ సంస్థలు ఫుట్ బాల్ లెజెండ్ ను కలిసే అవకాశం కోసం ఏకంగా రూ.1 కోటి వరకూ చెల్లించినట్టుగా సమాచారం.
ఢిల్లీలో తన స్వల్ప బస సమయంలో మెస్సీ భారత ప్రధానమంత్రితో పాటు భారత ప్రధాన న్యాయమూర్తి,పలువురు పార్లమెంట్ సభ్యులు, క్రికెటర్లతోపాటు ఒలింపిక్ ,పారాలింపిక్ పతక విజేతలతో సహా ఎంపిక చేసిన భారతీయ క్రీడా దిగ్గజాలను కలుసుకోవడానికి షెడ్యూల్ ఖరారైంది. మెస్సీ అరుణ్ జైట్లీ స్టేడియాన్ని కూడా సందర్శించనున్నారు. అక్కడ ఫుట్ బాల్ క్లినిక్, ఎంపిక చేసిన భారతీయ క్రికెటర్లతో ఇంటరాక్షన్ కార్యక్రమాలు నిర్వహించబడుతాయి. అనంతరం అడిడాస్ నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం కోసం ఆయన ఫురానా ఖిలా కి వెళ్లనున్నారు.
ఈ చారిత్రక పాత కోట వద్ద మెస్సీ భారత అగ్రశ్రేణి క్రీడా తారాలైన రోహిత్ శర్మ పారాలింపిక్ జువెలిన్ గోల్డ్ మెడలిస్ట్ సుమిత్ అంటిల్, బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ , ఒలింపిక్ హైజంప్ పతక విజేత నిషాద్ కుమార్ వంటి వారిని కలవనున్నారు.