బీహార్ ఓటమి ఎఫెక్ట్ : ముక్కలైన లాలూ ఫ్యామిలీ

బీహార్ ఎన్నికల్లో ఫలితాలు ఆర్జేడీకి అతి పెద్ద షాక్ ని ఇచ్చాయి. ఈ ఫలితాలతో మరో రెండు ఎన్నికల దాకా కోలుకోలేని విధంగా దెబ్బ పడింది అని విశ్లెషణలు ఉన్నాయి.;

Update: 2025-11-17 03:00 GMT

బీహార్ ఎన్నికల్లో ఫలితాలు ఆర్జేడీకి అతి పెద్ద షాక్ ని ఇచ్చాయి. ఈ ఫలితాలతో మరో రెండు ఎన్నికల దాకా కోలుకోలేని విధంగా దెబ్బ పడింది అని విశ్లెషణలు ఉన్నాయి. 2020లో ఏకంగా 75కి పైగా అసెంబ్లీ సీట్లు ఆధించి మహా ఘట్ బంధన్ ద్వారా 114 సీట్లను గెలిచిన తరువాత అడుగు దూరంలోనే తేజస్వి యాదవ్ కి సీఎం పదవి ఉందని అంతా అనుకున్నారు. కానీ అయిదేళ్ళు గిర్రున తిరిగే సరికి 114 సీట్లలో మూడవ వంతుకు పడిపోయి ఏకంగా పాతాళం అంచులు చూస్తూ ఆర్జేడీ దాని మిత్రులు ఇపుడు రాజకీయంగా పూర్తి నిరాశలోకి వెళ్ళిపోయారని అంటున్నారు.

ఆర్జేడీలో కొత్త చిచ్చు :

ఈ పరిణామాల నేపధ్యంలో ఆర్జేడీలో కొత్త చిచ్చు రగులుతోంది అని అంటున్నారు. ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కుటుంబంలోనే బీహార్ ఎన్నికల్లో ఓటమి ప్రభావం తీవ్రంగా పడింది అని అంటున్నారు. లాలూ కుమార్తె అయితే తాను పార్టీతోనూ కుటుంబంతోనూ తన బంధాన్ని తెచ్చుకుంటున్నట్లుగా చేసిన ఒక సంచలన ప్రకటన ఇపుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది 46 ఏళ్ళ రోహిణీ ఆచార్య లాలూకు తీవ్ర అనారోగ్యం చేసిన సమయంలో తన కిడ్నీని దానం చేసి మరీ తండ్రిని బతికించారు. ఆయన రుణం తీర్చుకున్నారు.

అక్కా తమ్ముళ్ళ పోరు :

లాలూ యాదవ్ కుమార్తె మొదట రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవారు. అయితే ఆ తరువాత ఆమె తమ్ముడు తేజస్వి యాదవ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడం లాలూ సైతం ఆయననే తన వారసుడిగా ప్రకటించడంతో కుటుంబంలో కొంత లుకలుకలు మొదలయ్యాయని అంతా అప్పట్లో అనుకున్నారు ఇక లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఎన్నికలకు ముందే ఆర్జేడీ నుంచి బహిష్కరించబడ్డాడు. ఆయన సొంతంగా పార్టీ పెట్టి పోటీ చేసినా ఫలితం లేకపోయింది. ఇక బీహార్ కి కాబోయే సీఎం అని తేజస్వి యాదవ్ ఎంతగా ప్రచారం చేసుకున్నా జనాలు అయితే పట్టించుకోలేదు ఆయననూ పార్టీని పక్కన పెట్టారు. ఈ నేపధ్యంలో ఓటమి తరువాత లాలూ కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరాయని అంటున్నారు. అక్క రోహిణి ఆచార్య తమ్ముడు తేజస్వి యాదవ్ ల మధ్య విభేదాలు బహిర్గతం కావడంతో రోహిణి ఆచార్య లాలూ కుటుంబం నుంచి పార్టీ నుంచి బయటకు వచ్చినట్లుగా సంచలన ప్రకటన చేశారు.

మురికి కిడ్నీ ఇచ్చావు :

ఇక తాజాగా రోహిణి ఆచార్య అయితే ఆర్జేడీ మీద నిప్పులు చెరిగారు తాను ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణం అంటూ తన సోదరుడు తేజస్వి యాదవ్ తిట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాన్నకు మురికి కిడ్నీ ఇచ్చావు అని తనను ఘోరంగా అవమానించారు అని నానా రకాలుగా దుర్భాషలు ఆడారని ఆమె బాధపడ్డారు. దీంతో తాను ఏకంగా ఆర్జేడీని కుటుంబాన్ని వదులుకుంటున్నట్లుగా ఆమె ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె చేసిన ట్వీట్ లో అనేక సంచలన విషయాలు బయట పెట్టారు. నాన్నకు కిడ్నీ దానం చేసిన దానికి తాను ప్రతిఫలంగా కోట్ల రూపాయలతో పాటు పార్టీ టికెట్ తీసుకున్నానని తనపైన తీవ్ర ఆరోపణలు చేశారఇ ఆమె సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొనడం విశేషం.

నేను చేసిన పాపం :

తాను జీవితంలో చేసిన పాపం తన తండ్రిని కాపాడడమేనా అ అని ఆమె వాపోయారు. అంతే కదు తాను తన కుటుంబాన్ని పిల్లలను జాగ్రత్తగా చూసుకోలేకపోయాను అన్నారు. ఇక మీదట తాను సమాజానికి చెప్పేది ఒక్కటే అని ఏ ఇంట్లో అయినా తల్లి తండ్రులను రక్షించేందుకు కుమార్తెలు కంటే కొడుకులు ముందుకు రావాలని వారే కిడ్నీ దానం చేయాలని ఆమె సూచించడం విశేషం. కుమార్తెలు తండ్రిని రక్షించే ప్రయత్నం ఎపుడూ చేయవద్దు అని ఆమె స్పష్టం చేయడం గమనార్హం.

ఒక అనాధను :

తాను ఇపుడు ఒక అనాధను అని రోహిణి ఆచార్య పెట్టిన పోస్ట్ బీహార్ రాజకీయాల్లో చర్చగా మారింది ఒక ఆడ కూతురు ఏడుస్తూ తల్లిదండ్రులను తన తోడ బుట్టిన వారిని విడిచి వెళ్ళిపోయింది అని ఆమె అన్నారు అలా నేను అనాధను అయ్యాను, నా బాటలో ఎవరూ నడవరాదు అని అని ఆమె సూచించారు. ఇక ఏ ఫ్యామిలీలో రోహిణి లాంటి కూతురు కానీ సోదరి కానీ ఉండకూడదని ఆమె ఆవేదనతో పెట్టిన పోస్టు అయితే వైరల్ అవుతోంది.

కోలుకుంటుందా :

లాలూ అయితే రాజకీయ వ్యూహకర్త. కానీ ఆయన ఎనిమిది పదుల వయసులో ఉన్నారు ఇక ఆయన వారసుల మధ్య రాజకీయంగా పోటీ నడిచి చిచ్చు రేగింది. కుమారుడు తేజ్ ప్రతాప్ కుమార్తె రోహిణి అర్జేడీకి దూరం అయ్యారు. దాంతో రానున రోజులలో ఆర్జేడీ పరిస్థితి ఏమిటి మళ్ళీ కోలుకుంటుందా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News