• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  హీరోయిన్ పై కిడ్నాప్...

హీరోయిన్ పై కిడ్నాప్ కేస్.. మరో ముగ్గురు నిందితులు కూడా!

| మలయాళ హీరోయిన్ లక్ష్మీ మీనన్ అంటే అందరికీ సుపరిచితమే.. ఈ హీరోయిన్ నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి.

By - Madhu Reddy
Update: 2025-08-27 08:33 GMT

మలయాళ హీరోయిన్ లక్ష్మీ మీనన్ అంటే అందరికీ సుపరిచితమే.. ఈ హీరోయిన్ నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ పై తాజాగా కిడ్నాప్ కేసు నమోదు అయింది. మరి ఈ హీరోయిన్ నిజంగానే కిడ్నాప్ చేసిందా? ఎందుకు ఈ హీరోయిన్ పై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

కొచ్చిలో జరిగిన కిడ్నాప్ కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెనర్జీ రోడ్డు లోని ఓ బార్ లో ఆదివారం రోజు లక్ష్మీ మీనన్, మిథున్, అనీష్, సోనామోల్ లకి ఓ ఐటీ కంపెనీలో వర్క్ చేసే ఉద్యోగితో గొడవ జరిగిందట.అయితే ఈ గొడవ ముదిరి పోవడంతో అక్కడి నుండి ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు. కానీ అదే సమయంలో బార్ నుండి ఆ ఐటీ ఉద్యోగి బయటికి రాగా.. కొంతమంది కారులో కిడ్నాప్ చేసి ఆయనపై దాడి చేశారట. ఈ విషయంలో ఆ బాధితుడు హీరోయిన్ లక్ష్మీ మీనన్ తో పాటు ముగ్గురిపై ఎర్నాకులం నార్త్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.

ఇక విషయంలోకి వెళ్తే.. అలువాకు చెందిన అలియార్ షా సలీంతో లక్ష్మీ మీనన్ గ్యాంగ్ కి బార్ లో గొడవ జరిగింది. ఆ తర్వాత సలీం బార్ నుండి బయటికి వెళ్లిపోగా లక్ష్మీ మీనన్ గ్యాంగ్ ఆయన వాహనాన్ని వెంబడించి , రాత్రి 11:45 గంటలకి నార్త్ రైల్వే ఓవర్ బ్రిడ్జి దగ్గర సలీం కారుని ఆపి బలవంతంగా బయటికి లాగారట. ఆ తర్వాత సలీంని మరో వాహనంలోకి ఎక్కించి శరీరం, మొహం మీద దారుణంగా కొట్టి సైలెంట్ గా ఉండకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బెదిరించి అక్కడి నుండి వెళ్లిపోయారట. దీంతో భయపడిన బాధితుడు కేస్ పెట్టాడు. బాధితుడు పెట్టిన కేసుని విచారించిన ఎర్నాకులం పోలీసులు లక్ష్మీ మీనన్ అలాగే మరో ముగ్గురిపై కేసు పెట్టారు. అయితే వీరిలో ఇప్పటికే అనీష్ , మిథున్, సోనామోల్ లని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ లక్ష్మీ మీనన్ మాత్రం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.. అరెస్టు చేసిన వ్యక్తులు పోలీసుల కస్టడీలోనే ఉన్నప్పటికీ లక్ష్మీ మీనన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.. ప్రస్తుతం లక్ష్మీ మీనన్ పై కిడ్నాప్ ఆరోపణలు మలయాళ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి.

ఇక 2011లో రాఘవింటే స్వాంతం రజియా అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన లక్ష్మీ మీనన్.. ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. అలా తమిళ,తెలుగు, మలయాళ భాషల్లో రాణించిన లక్ష్మీ మీనన్ చివరిగా శబ్దం అనే మూవీలో కనిపించింది.

Tags:    
  • LakshmiMenon 
  • MalayalamActress 
  • KochiKidnappingCase 
  • CelebrityNews 
  • LakshmiMenonCase 
  • KidnappingAllegation 
  • మలయాళహీరోయిన్ 
  • లక్ష్మీమీనన్ 
  • కిడ్నాప్‌ కేసు 

Similar News

రాప్తాడు బాలిక ఆరోగ్యంలో కీలక మార్పు.. ప్రాణాపాయం దాటినట్లే!

2026-11-10 09:39 GMT

ఒక ఎఫైర్ ఖరీదు అక్షరాల రూ.18 లక్షల కోట్ల నష్టం..

2026-11-10 09:37 GMT

10 రోజుల ఉత్కంఠ.. 19న జడ్పీ, మండల పరిషత్ చైర్మన్ల ఎన్నిక

2026-11-10 09:36 GMT

పవన్ కోసం.. టీడీపీ, వైసీపీ ఒకే మాట!

2026-11-10 09:36 GMT

ఆ వార్తలు ఓవైపు.. ప్రజా నాయకుడిగా పవన్ ఇలా!

2026-11-10 09:31 GMT

అనంతపురంలో మేయర్ రచ్చ : టీడీపీ ఎమ్మెల్యేలకు అనంత వెంకటరామిరెడ్డి బిగ్ సవాల్

2026-11-10 09:27 GMT

కనీసం నా కళ్లలోకి కూడా చూడడు.. మోడీపై సోనియా హాట్ కామెంట్స్

2026-11-10 07:52 GMT

అమెరికాలో ఎస్‌బీఐ విస్తరణ.. టెక్సాస్‌లో కొత్త బ్రాంచ్ ప్రారంభం!

2026-11-10 07:15 GMT

న్యూజెర్సీలో దీపావళి వేడుకల తర్వాత చెత్తకుప్పలు.. పండుగ సంబరాల్లో పౌర బాధ్యత మరిచారా?

2026-11-10 07:15 GMT

పవన్ విడాకులు.. ప్రత్యర్థులకు ఎలాంటి కౌంటర్ ఇస్తారు!

2026-11-10 06:53 GMT

కార్తీక మాసంలో శాకాహారమే ఎందుకు తినాలి?

2026-11-10 06:42 GMT

ఇరాన్ పై యుద్ధం ఆపేశాడు.. వెనక్కి తగ్గేశాడు.. ట్రంప్‌కు ఇప్పటికైనా జ్ఞానోదయం అయిందా?

2026-11-10 06:39 GMT

Copyright @2026

Powered by Blink CMS