న‌డిచొచ్చిన దేవుడు: పొంగిపోయిన‌ చంద్ర‌బాబు అభిమాని

కడపల్లిలోని తన నివాసం నుంచి కుప్పం వెళ్తున్న సమయంలో చెంగాచారి కోరిక మేరకు శాంతిపురంలోని ఆయన ఇంటికి వెళ్లారు.

Update: 2026-07-06 10:50 GMT

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబును చూసేందుకు మాత్ర‌మే కాదు.. ఆయ‌నను త‌మ ఇంటికి ఆహ్వానిస్తున్న అభిమానులు కోకొల్ల‌లుగా ఉంటున్నారు. ఇటీవ‌ల కోన‌సీమ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు 86 ఏళ్ల వృద్ధుడు చంద్ర‌బాబును చూడాల‌ని ఉంద‌ని కోర‌డం.. ఆయ‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం తెలిసిందే. దీంతో సీఎం స్వ‌యంగా ఆయ‌న‌కు ఫోన్ చేసి.. `వ‌స్తున్నా.. స‌త్య‌నారాయ‌ణ‌. రేపు మ‌నం క‌లుద్దాం అంటూ మాట్లాడారు. త‌ర్వాత రోజు ప‌ర్య‌ట‌న‌లో స‌త్య‌నారాయ‌ణ‌ను ప్ర‌త్యేకంగా పిలిపించుకుని అభిమాని కోరిక తీర్చారు.

ఆయ‌న‌కు సొంతిల్లు నిర్మించి ఇవ్వ‌డంతోపాటు.. స్థానికంగా అభివృద్ధి కి కూడా హామీ ఇచ్చారు. తాజాగా సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలోనూ ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. కుప్పం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, సీఎం చంద్ర‌బాబు అంటే ప్రాణం పెట్టే చెంగాచారి ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లారు. కడపల్లిలోని తన నివాసం నుంచి కుప్పం వెళ్తున్న సమయంలో చెంగాచారి కోరిక మేరకు శాంతిపురంలోని ఆయన ఇంటికి వెళ్లారు.

చెంగాచారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించిన సీఎం...వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా చంగాచారి స‌తీమ‌ణి చేసిన అల్పాహారాన్ని రుచి చూశారు. వారి ఇంటికి అవ‌స‌ర‌మైన అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఎవ‌రీ చంగాచారి? కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలోని కీల‌క‌మైన శాంతిపురం మండ‌లంలో టీడీపీకి అనుకూలంగా 99 శాతం మంది ఉన్నారు. ఈ మండ‌లం అత్యంత కీల‌కం. అయితే.. ఇక్క‌డి పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను కాపాడుకోవ‌డంతోపాటు ఇంటింటికీ ప్ర‌భుత్వ సంక్షే ప‌థ‌కాల‌ను ప్ర‌చారం చేయ‌డంలోనూ చంగాచారి కీల‌క‌రోల్ పోషిస్తున్నారు.

వైసీపీ హ‌యాంలో శాంతిపురం మండ‌లంలో ఓట్లు చీల్చే ప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడు.. ధ‌ర్నాలు, నిర‌స‌న‌ల‌కు దిగి.. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా నిలిచారు. అన్న‌గారి హ‌యాం నుంచి టీడీపీలోనే ఉన్న చంగాచారి.. చంద్ర‌బాబు అంటే ప్రాణం పెడ‌తారు. ఆయ‌న గెలుపు కోసం.. అహ‌ర‌హం శ్ర‌మిస్తార‌ని స్థానికులు చెబుతారు. దేవుడు న‌డిచొచ్చాడు! చంద్ర‌బాబు త‌న ఇంటికి రావ‌డం ప‌ట్ల చంగాచారి, ఆయ‌న ఫ్యామిలీ సంతోషం వ్య‌క్తం చేసింది. దేవుడు న‌డిచి వ‌చ్చాడంటూ.. చంగాచారి కుటుంబం పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఇటీవల కాలంలో చంద్ర‌బాబు మాస్ స‌హా.. పార్టీలో కీల‌క కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు అత్యంత చేరువ అవుతున్నారు.

ఈ క్ర‌మంలో ఎక్కడ ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా ఆయ‌న అస్స‌లు మిస్ కాకుండా పార్టీ నేత‌ల‌ను సంతోష ప‌ర‌చే కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుడుతున్నారు. ఒక‌వైపు పార్టీ ప‌రంగా, ప్ర‌భుత్వ ప‌రంగా బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. మ‌రోవైపు అభిమానులను కూడా అంతే దృష్టితో చూస్తున్నార‌నడానికి చంగాచారి కుటుంబానికి ద‌క్కిన ప‌రామ‌ర్శే ఉదాహ‌ర‌ణ‌.

Tags:    

Similar News