• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బర్త్ డే రోజున కేక్...

బర్త్ డే రోజున కేక్ తినిపించిన చేత్తోనే చంపేశాడు

| కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగీత్ నగర్ లో సంచనలంగా మారిన పదేళ్ల సహస్త్ర దారుణహత్య కేసు గుట్టు వీడిపోయింది.

By - Garuda Media
Update: 2025-08-23 04:24 GMT

కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగీత్ నగర్ లో సంచనలంగా మారిన పదేళ్ల సహస్త్ర దారుణహత్య కేసు గుట్టు వీడిపోయింది. ఇంటి పక్కనే ఉండే పదో తరగతి చదివే బాలుడు ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తేల్చారు. ఈ హత్యోదంతంలో దారుణమైన అంశం ఏమంటే.. దొంగతానికి వచ్చి.. ఆ విషయం బయటకు వస్తుందన్న భయంలో బాలికను చంపేయటం. బాగా తెలిసిన అమ్మాయి.. ఇంటి పక్కనే ఉండే అమ్మాయి.. కొద్దిరోజుల క్రితం ఆమె పుట్టిన రోజున.. వాళ్లింట్లో జరిగిన వేడుకలో కేక్ తినిపించిన చేత్తోనే కత్తితో పోట్లు పొడిచి చంపేసిన వైనం షాకింగ్ గా మారింది.

అయితే.. హత్యకు ఉపయోగించిన కత్తి ఎక్కడి నుంచి తెచ్చాడన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తన ఇంటికి దగ్గరగా ఉండే స్కూల్లో పదో క్లాస్ చదివే ఈ అబ్బాయి హత్య ఉదంతంలో బాలుడి పాత్ర మీద అనుమానం రావటంతో.. స్కూల్ కు వెళ్లి.. అతడ్నివిచారించారు. సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం ఎలా చేయాలి? ఎలా బయటకు వెళ్లాలి? అన్న అంశాల్ని పుస్తకంలో స్పష్టంగా రాసుకున్న వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అంతేకాదు.. హత్య చేసిన తర్వాత నుంచి ఇంటి నుంచి పెద్దగా బయటకు వెళ్లకపోవటం.. టీవీ.. స్కూల్ కే పరిమితం కావటం లాంటివి చేసేవాడని గుర్తించారు. కొడుకులో వచ్చిన మార్పును గమనించిన తల్లిదండ్రులు కొంత అనుమానించినా.. తమ పిల్లాడు అంతటి దారుణానికి పాల్పడతారని మాత్రం వారు ఊహించలేదు.

పిల్లాడి తండ్రి వ్యాపారం చేసి నష్టపోగా.. తల్లి ల్యాబ్ టెక్నిషియన్ గా పని చేస్తున్నట్లు గుర్తించారు. క్రికెట్ బ్యాట్ దొంగతనం చేసేందుకు వెళ్లినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మరోవైపు.. సహస్త్ర ఇంట్లో ఉన్న రూ.80వేలు చోరీ చేసేందుకు వెళ్లి.. అక్కడ సహస్త్ర తనను చూడటంతో తన గుట్టు రట్టు కాకూడదన్న ఉద్దేశంతో హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

నిజానికి ఈ హత్య జరిగిన తర్వాత పెద్ద ఎత్తున పోలీసులు గాలింపు జరిపినా.. ఎలాంటి ఆచూకీ లభించలేదు. సీసీ కెమేరాల్లో సైతం ఇంట్లోకి ఎవరూ వెళ్లినట్లుగా పుటేజ్ లభించలేదు. అయితే.. పక్క అపార్టుమెంట్ నుంచి లోపలకు వెళ్లటంతో సీసీ కెమేరా కంటికి బాలుడు చిక్కలేదు. అయితే.. హత్య జరిగిన రోజున బాలుడ్ని తాను అపార్ట్ మెంట్ లో చూసినట్లుగా ఐటీ ఉద్యోగి ఒకరు చెప్పటంతో పోలీసులు అతడి మీద ఫోకస్ చేశారు. వర్కు ఫ్రం హోంలో భాగంగా తాను ఇంట్లో నుంచి పని చేస్తున్న వేళలో.. సహస్త్ర వాళ్ల ఇంటి వద్ద ఆ బాలుడ్ని చూసినట్లుగా చెప్పటంతో అనుమానించిన పోలీసులు.. బాలుడ్ని ఒక కంట కనిపెడుతూ ఉన్నారు. చివరకు పలు అంశాలు మ్యాచ్ కావటంతో అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. మొదట్లో ఏమీ చెప్పకున్నా.. ఆ తర్వాత మాత్రం తాను హత్య చేసిన వైనాన్ని వివరించినట్లుగా తెలుస్తోంది.

Tags:    
  • SahasraMurderCase 
  • KukatpallyCrime 
  • HyderabadNews 
  • MinorCrime 
  • SangeetNagar 
  • HyderabadPolice 
  • సహస్త్ర హత్య కేసు 
  • కూకట్‌పల్లి క్రైమ్ న్యూస్ 
  • సంగీత్ నగర్ హత్య 

Similar News

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

GTA 6 తయారీలో బెంగళూరు టీమ్.. 1,600 మందికి పైగా భారతీయుల పని!

2026-11-19 05:08 GMT

చైనాపై మేమూ నిఘా పెడతాం.. ట్రంప్ కామెంట్స్ వైరల్!

2026-11-19 05:03 GMT

గడువు ముగిసిన బాంబుల ప్రయోగమా? అమెరికా 'యుద్ధ నీతి'ని చూసి సిగ్గుపడండి..

2026-11-19 05:02 GMT

కాలుష్యానికి నేనే బాధ్యుడిని.... గడ్కరీ బోల్డ్ స్టేట్మెంట్

2026-11-19 05:00 GMT

Copyright @2026

Powered by Blink CMS