కీలక వ్యాఖ్యలు... 'ముస్లింలు వదులుకోవాలి.. హిందువులు ఆపాలి'!

అయితే ఆ చరిత్రకారుడు పురావస్తు శాస్త్రవేత్త కాదని.. ఆయన తవ్వకానికిముందు, తవ్వకం సమయంలో, తవ్వకం తర్వాత కూడా ఆ స్థలాన్ని ఎప్పుడూ సందర్శించలేదని అన్నారు.;

Update: 2025-12-02 05:12 GMT

భారతదేశంలో కొనసాగుతున్న కీలక వివాదాల్లో మందిర్-మసీదు వివాదం అత్యంత కీలకమైనదనే సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో... మందర్-మసీదు వివాదాలలో సంయమనం పాటించాలంటూ, పలు కీలక వ్యాఖ్యలు చేశారు భారత పురావస్తు సర్వే (ఏ.ఎస్.ఐ) మాజీ ప్రాంతీయ డైరెక్టర్ కేకే ముహమ్మద్. ఇదే సమయంలో అటు హిందువులకు, ఇటు ముస్లింలకు కీలక సూచనలు చేశారు.

అవును... రామ జన్మభూమి, మధుర, జ్ఞాపవాపి స్థలాలను ముస్లింలు ఇష్టపూర్వకంగా అప్పగించాలని.. ఇదే సమయంలో, హిందువులు మరిన్ని డిమాండ్లు చేయకుండా ఉండాలని సూచించారు ముహమ్మద్. వాదనలు విస్తరించడం వల్ల మరిన్ని సమస్యలు తలెత్తుతాయని నొక్కి చెప్పారు. దేశవ్యాప్తంగా మదిర్-మసీదు వివాదంపై అనేక పిటిషన్లు కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన... ముస్లింలకు మక్కా, మదీనా ఎంత ముఖ్యమైనవో.. హిందూ సమాజానికి రామ జన్మభూమి, జ్ఞానవాపి, మధుర అంతే ముఖ్యమైనవని తెలిపారు! 1976లో బీబీ లాల్ నేతృత్వంలో జరిగిన బాబ్రీ మసీదు తవ్వకంలో తన పాత్రను గుర్తుచేసుకున్న ముహమ్మద్... కమ్యునిస్ట్ చరిత్రకారుడి ప్రభావం వల్లే ఈ వివాదం పెరిగిందని అన్నారు.

అయితే ఆ చరిత్రకారుడు పురావస్తు శాస్త్రవేత్త కాదని.. ఆయన తవ్వకానికిముందు, తవ్వకం సమయంలో, తవ్వకం తర్వాత కూడా ఆ స్థలాన్ని ఎప్పుడూ సందర్శించలేదని అన్నారు. విషయం తెలియకుండానే తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో.. మందిర్ - మసీదు చర్చల విస్తృత అంశంపై జాగ్రత్తగా ఉండాలని ముహమ్మద్ సలహా ఇచ్చారు.

ఈ నేపథ్యంలోనే... రామ జన్మభూమితో పాటు మధుర, జ్ఞానవాపిలను హిందూ సమాజానికి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలుగా గుర్తించిన ఆయన.. ముస్లింలకు వాటి ప్రాముఖ్యత మక్కా, మదీనాతో పోల్చదగినదని అభివర్ణించారు. అందువల్ల.. ఈ మూడు ప్రదేశాలను ముస్లింలు ఇష్టపూర్వకంగా అప్పగించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు!

ఇదే సమయంలో... ఈ మూడూ తప్ప, హిందూ సమాజం నుంచి వచ్చే డిమాండ్ ఇంకేదీ ఉండకూడదని.. అదనపు వాదనలు కొనసాగించడం వల్ల సమస్య పరిష్కారంకాదని, అవి మరింత సంఘర్షణకు దారితీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా... రెండు వర్గాల నుంచి సమ్యమనం, రాజీ అవసరాన్ని ముహమ్మద్ ఎత్తి చూపారు.

తాజ్ మహల్ పై కీలక వ్యాఖ్యలు!:

ఇదే సమయంలో... తాజ్ మహల్ మూలాలకు సంబంధించి కొన్ని గ్రూపుల నుంచి వినిపిస్తోన్న ఆరోపణలను ఆయన నిర్ద్వందంగా తోసిపుచ్చారు. వాటిని పూరిగా అబద్ధమైనవని అన్నారు. ఈ సందర్భంగా ఈ స్థలం చారిత్రక బదిలీని వివరిస్తూ... ఇది మొదట రాజా మాన్ సింగ్ ప్యాలెస్ అని, తర్వాత దీన్ని జై సింగ్ కు, ఆ తర్వాత షాజహాన్ కు బదిలీ చేశారని.. వీటికి సంబంధించిన సహాయక పత్రాలు బికనీర్, జైపూర్ మ్యూజియంలలో భధ్రపరచబడ్డాయని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News