మొన్న నటి, నిన్న యువతి, నేడు మహిళ.. రే*ప్ కేసులో ఎమ్మెల్యే అరెస్ట్!

అవును... అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ ఎమ్మెల్యే రాహుల్‌ మామ్‌ కుటత్తిల్‌ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.;

Update: 2026-01-11 08:30 GMT

ఈ ఎమ్మెల్యే (మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ)... 'మంచి లక్షణాలున్న అబ్బాయి' కాదు సరికదా.. 'పొలిటికల్ రౌడీ' లక్షణాలు కలిగి ఉన్నాడంటూ ఫిర్యాదు నమోదైంది! అలా అని ఇదే మొదటిసారి కాదు! తమను అత్యాచారం చేశాడంటూ గతంలో ఓ నటి, యువతి, తాజాగా మరో మహిళ సదరు ఓ ఎమ్మెల్యేపై ఫిర్యాదులు చేశారని అంటున్నారు! దీంతో.. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ విషయం సంచలనంగా మారింది. ఈ సందర్భంగా సదరు ఎమ్మెల్యే గురించి మరిన్ని షాకింగ్ విషయాలు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు.

అవును... అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ ఎమ్మెల్యే రాహుల్‌ మామ్‌ కుటత్తిల్‌ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే రెండుసార్లు ఇతనిపై అత్యాచార ఫిర్యాదులు నమోదవ్వగా.. తాజాగా మూడో ఫిర్యాదు నమోదైందంది! ఈ నేపథ్యంలో... ఆదివారం తెల్లవారుజామున 12:30 గంటల ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే రాహుల్ మమ్‌ కూటత్తిల్‌ ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో భాగంగా... పాలక్కాడ్‌ లోని ఒక హోటల్ నుండి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నారు!

వివరాళ్లోకి వెళ్తే.. ప్రస్తుతం కెనడాలో పనిచేస్తున్న పతనంతిట్టకు చెందిన ఒక మహిళ మమ్‌ కూటత్తిల్‌ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా... ఈ ఎమ్మెల్యేపై క్రూరమైన లైంగిక దాడి, బలవంతంగా గర్భస్రావం చేయించడంతో పాటు ఆర్థిక దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఆరోపణల తీవ్రత, వీటికి అనుగుణంగా సమర్పించిన సాక్ష్యాల కారణంగా చర్యలు వేగంగా జరిగాయని పోలీసు వర్గాలు తెలిపాయి. అప్పటికే అతడు తప్పించుకుని తిరుగుతుండగా.. ఆదివారం తెల్లవారు జామున అదుపులోకి తీసుకున్నారు!

తన వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో.. సోషల్ మీడియా ద్వారా మమ్‌ కూటత్తిల్‌ ను కలిశానని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత తనతో సంబంధం పెట్టుకున్నాడని.. తన వివాహ బంధాన్ని ముగించాలని ఒత్తిడి చేశాడని.. తనను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చాడని.. ఆమె ఆరోపించింది. ఈ క్రమంలో తనకు బిడ్డ కావాలని పట్టుబట్టాడని.. అది తన కుటుంబం నుంచి తమ వివాహానికి ఆమోదం పొందడానికి సహాయపడుతుందని చెప్పాడని ఆమె ఆరోపించిందని తెలుస్తోంది.

ఈ క్రమంలో తాను గర్భం దాల్చిన తర్వాత ఆ గర్భాన్ని తొలగించుకోవాలని బెదిరించాడని.. ఈ క్రమంలో తనను శారీరకంగా, మానసికంగా ఎంతో హింసించాడని ఆమె ఆరోపించింది. రాజకీయంగా అతడికి పలుకుబడి ఉండడంతో ఇన్ని రోజులు పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయానని.. అయితే, అతనిపై ఇప్పటికే రేప్ కేసులు నమోదయ్యాయనే విషయం తెలిసిన తర్వాత తాను ముందుకు వచ్చానని ఆమె వెల్లడించారు! ఈ క్రమంలో ఆమె పలు డిజిటల్ ఆధారాలను సమర్పించినట్లు చెబుతున్నారు. కాగా... ఇతన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడానికి కారణం కూడా గతంలో వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలే కావడం గమనార్హం.

Tags:    

Similar News