పసుపు నీళ్లు తెచ్చిన పంచాయతీ !

దీంతో ఎర్రవెల్లి పరిసర గ్రామాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య దాడులు, పోలీసులు అడ్డుకోవడం, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి గాయాలు కావడం, ఆసుపత్రిలో చేరడం జరిగింది.

Update: 2026-09-09 08:31 GMT

తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశాడని, దానికి కారణం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని, కాబట్టి ఆయన స్పీకర్ కు క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ పార్టీ చావుడప్పు పేరుతో ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ముట్టడికి పిలుపునిచ్చించి. భువనగిరి నుండి ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీర్ల అయిలయ్య, వేముల వీరేశం తదితరులు, గజ్వేల్ నుండి మాజీ ఎమ్మెల్యీ నర్సారెడ్డి, ఆయన కూతురు, డీసీసీ అద్యక్షురాలు ఆంక్షరెడ్డి తదితరులు వేలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలతో బయలుదేరారు.

దీంతో ఎర్రవెల్లి పరిసర గ్రామాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య దాడులు, పోలీసులు అడ్డుకోవడం, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి గాయాలు కావడం, ఆసుపత్రిలో చేరడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు వెనుదిరిగిన తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ చావుడప్పు పేరుతో దాడికి వచ్చారంటూ, వచ్చిన రహదారి మీద పసుపునీళ్లు చల్లారు.

ఈ నేపథ్యంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ దళితులు ముట్టడికి వచ్చారనే పసుపు నీల్లు చల్లారు. దళితులు అంటే అంత చులకన ఎందుకు ? దళిత స్పీకర్ ను అవమానించడమే కాకుండా, పసుపు నీళ్లు చల్లి మరోసారి అవమానిస్తారా ? అంటూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద ప్రశ్నల వర్షం కురిపించింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, వేముల వీరేశం, అద్దంకి దయాకర్, బల్మూరి సుమన్ తదితరులు దీనిని ఖండించారు.

దళితులను ముందుపెట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందని, అసలు వచ్చిన వారిలో దళితులు ఎక్కడ ఉన్నారని, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీర్ల అయిలయ్య, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డిలు దళితులా ? చావుడప్పు పేరుతో కేసీఆర్ నివాసాన్ని ముట్టడించిన కార్యక్రమం బూమరాంగ్ అయినందుకే పసుపునీళ్లతో దళితులను అవమానించారన్న వాదన లేవనెత్తుతున్నారని బీఆర్ఎస్ వాదిస్తుంది.

శాసనసభ సమావేశాల సంధర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేశారంటున్న వ్యాఖ్యలు గందరగోళానికి దారితీయగా, చావుడప్పు కార్యక్రమం నేపథ్యంలో కేసీఆర్ చావాలని కోరుకుంటున్నామని, ఆయన తెలంగాణకు పట్టిన పీడ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనడం మరో గందరగోళానికి దారి తీసింది. అయితే తాను ఫ్లోలో అన్నప్పుడు అలా వచ్చిందని, కేసీఆర్ చావాలని తాను కోరుకోవడం లేదని శంకర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పసుపునీళ్లు చల్లి ప్రక్షాళన చేసిన కార్యక్రమం వివాదాస్పదం కావడం గమనార్హం.

Tags:    

Similar News