కేటీఆర్ అమాయ‌కుడు.. బీఆర్ఎస్‌లో సంక్షోభం: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అంత‌ర్గ‌త సంక్షోభంతో అల్లాడుతోంద‌ని ఆ పార్టీ మాజీ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన వ్య‌వ‌స్థాప‌కురాలు క‌విత షాకింగ్ కామెంట్స్ చేశారు.

Update: 2026-08-28 03:00 GMT

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అంత‌ర్గ‌త సంక్షోభంతో అల్లాడుతోంద‌ని ఆ పార్టీ మాజీ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన వ్య‌వ‌స్థాప‌కురాలు క‌విత షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా పార్టీ చీలిపోతుంద ని.. దానికి ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ-ఆర్ ఎస్ ఎస్ నేత‌ల‌తో మాజీ మంత్రి హ‌రీష్‌రావు క‌లివిడిగా ఉంటున్నార‌ని వ్యాఖ్యానించారు.

ఆ రెండు సంస్థ‌ల‌తో క‌లిసి హ‌రీష్‌రావు బీఆర్ ఎస్ ను సొంతం చేసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని క‌వి త వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్య‌వ‌హార‌మే బీఆర్ ఎస్‌లో అంత‌ర్గ‌త సంక్షోభంగా మారుతోంద‌ని ఆమె చెప్పుకొచ్చారు. అందుకే వారు ప్ర‌జ‌ల‌ను వ‌దిలేసి.. పార్టీపైనే దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌ని తెలిపారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై బీఆర్ ఎస్ స్పందించ‌డం లేద‌ని అందుకే త‌మ‌కు ప్ర‌జ‌లు చేరువ అవుతున్నార‌ని చెప్పారు.

ఇదేస‌మ‌యంలో మాజీ మంత్రి బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అమాయ‌కుడు అంటూ క‌విత వ్యాఖ్యానించారు. ఆయ‌న‌కు తెలియ‌కుండానే హ‌రీష్‌రావు మంత్రాంగం న‌డుపుతున్నార‌ని చెప్పారు. మెద‌క్‌లో ర‌హ‌స్య కార్య‌క‌లాపాలు జ‌రిగాయ‌ని.. దీనికి సంబంధించిన ప‌క్కా స‌మాచారం త‌న వ‌ద్ద ఉంద‌ని ఆమె చెప్ప‌డం గ‌మ‌నార్హం. కేటీఆర్ అమాయ‌కుడు కాబ‌ట్టే.. త‌న‌ను ఒక ప‌థ‌కం ప్ర‌కారం బ‌య‌ట‌కు పంపించార‌ని ఆమె వ్యాఖ్యానించారు. అయితే.. ఇప్పుడు తాను బీఆర్ ఎస్‌పై జాలిప‌డుతున్న‌ట్టు తెలిపారు.

రాఖీ క‌డ‌తాను!

త‌న సోద‌రుడు, బీఆర్ ఎస్‌నేత కేటీఆర్‌కు రాఖీ పౌర్ణ‌మి సంద‌ర్భంగా రాఖీ క‌ట్టాల‌నే అనుకున్న‌ట్టు క‌విత తెలిపారు. అయితే.. ముందుగానే ఆయ‌న త‌ప్పించుకున్నార‌ని, విదేశాల‌కు వెళ్లిపోయార‌ని వ్యాఖ్యానిం చారు. గ‌త ఏడాది కూడా హైద‌రాబాద్‌లో లేకుండా త‌ప్పించుకున్నార‌ని.. ఇప్పుడు ఏకంగా వారం ముందే విదేశాల‌కు వెళ్లార‌ని అన్నారు. ఆడ‌బిడ్డ‌ల‌కు ఆత్మ‌గౌరం ఉంటుంద‌ని.. ఇలాంటి ప‌నుల‌తో ఆత్మ గౌర‌వం దెబ్బ‌తింటుంద‌ని అన్నారు. ర‌క్షాబంధ‌న్‌ను రాజ‌కీయాల‌తో ముడిపెట్ట‌డం స‌రికాద‌న్నారు.

Tags:    

Similar News