ఉగ్రదాడిలో తెలుగువారు... వెంటాడి మరీ హతమార్చబడ్డారు!

అవును... తాజాగా జమ్మూకశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిలో తెలుగువారు మృతిచెందారు. ఇందులో భాగంగా... నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు ప్రాణాలు కోల్పోయారు.;

Update: 2025-04-23 07:12 GMT

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు పెట్రేగిపోయిన సంగతి తెలిసిందే. మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన అనంతనాగ్ జిల్లా పహల్గాం సమీప బైసరన్ లోయలో విహరిస్తున్న పర్యాటకులను ముష్కరులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్పటివరకూ సందర్శకుల కేరింతలతో సందడిగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా ఆర్తనాదాలతో దద్దరిల్లింది.


ఆహ్లాదకరమైన వాతావారణంలో రమణీయ ప్రకృతిని ఆస్వాదిస్తూ దేశ విదేశాల పర్యాటకులు ఆదమరిచి ఉన్న వేళ.. ఉగ్రమూకల తూటా గాయాలతో నెత్తురోడుతూ ఒక్కొక్కరుగా నేలకొరిగారు. ఫలితంగా పచ్చని మైదానం రక్తసిక్తమైంది. ఈ అమానవీయ చర్యకు ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. ఈ ఘటనలో తెలుగువారు బలైపోయారు!


నేలకొరిగిన నెల్లూరు వాసి!:

అవును... తాజాగా జమ్మూకశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిలో తెలుగువారు మృతిచెందారు. ఇందులో భాగంగా... నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న ఆయన.. పహల్గాంలో విహారయాత్రకు వెళ్లారు. ఈ సమయంలో ఉగ్రదాడిలో మృతి చెందారు.


విశాఖకు చెందిన విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి!:

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో విశాఖకు చెందిన విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి మృతి చెందారు. చంపొద్దని వేడుకుంటూ పరిపోతున్న ఆయనను వెంటాడి మరీ చంపినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఆయన మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించి.. విశాఖలోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

హైదరాబాద్ లోని ఐబీ ఆఫీసర్ మృతి!:

కశ్మీర్ లోని ఉగ్రదాడిలో హైదరాబాద్ కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందారు. కోఠీలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్.ఐ.బీ) కార్యాలయంలో సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తోన్న మనీశ్ రంజన్ కుటుంబ సభ్యులతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ఈ సమయంలో ఇద్దరు పిల్లలు, భార్య ముందే ఆయనను ఉగ్రవాదులు కాల్చిచంపారు. బీహార్ కు చెందిన మనీశ్.. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్నారు.

Tags:    

Similar News