నగరంలో రూ.400 కోట్ల ట్రాఫిక్ జరిమానాలు పెండింగ్.. 50% డిస్కౌంట్ ప్రకటించిన అధికారులు.. ఎక్కడంటే?

ట్రాఫిక్ ఏసీపీ ఎం.శివశంకర్ ఈరోజు ఉదయం స్టార్ ఆఫ్ మైసూర్ తో మాట్లాడుతూ.. "రాష్ట్ర ప్రభుత్వం రేపటినుండి ఈ - చలాన్ ట్రాఫిక్ జరిమానాలపై 50% రాయితీని ఆదేశించింది.;

Update: 2025-08-23 17:30 GMT

ఎక్కడైనా సరే ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే జరిమానా కట్టాల్సిందే. ఈ జరిమానా అందరూ సరైన సమయంలో చెల్లిస్తున్నారా అంటే.. ఇప్పుడు ఇలాంటి ఒక ఘటన నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు. ఆ నగరంలో ఏకంగా రూ.400 కోట్ల ట్రాఫిక్ జరిమానాలు పెండింగ్లో ఉండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ట్రాఫిక్ జరిమానా సకాలంలో చెల్లించాలి అని అధికారులు ఎప్పటికప్పుడు సంబంధిత నంబర్లకు మెసేజ్లు కూడా పంపిస్తున్న విషయం తెలిసిందే. కానీ చాలామంది వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. కొంతమంది కట్టలేని పరిస్థితిలో చెల్లించలేకపోయామని తెలిపారు. అయితే సకాలంలో జరిమానా చెల్లించకపోతే కేసు ఫైల్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే ఆ ప్రాంత ప్రజలను పోలీస్ కేసు నుండి తప్పించడానికి.. ఆ ప్రాంత ట్రాఫిక్ అధికారులు వినూత్న ఆలోచన చేస్తూ బంపర్ ఆఫర్ ప్రకటించారు..

రూ. 400 కోట్ల మేరా పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ జరిమానాలు..

అసలు విషయంలోకి వెళ్తే.. 2025 ఆగస్టు 21న రవాణా శాఖ అండర్ - సెక్రటరీ వీఎస్ పుష్ప కార్యాలయం నుండి వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం.. ఆగస్టు 23 నుండి సెప్టెంబర్ 12 వరకు కర్ణాటక అంతటా ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది అని తెలిపారు. గతంలో పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ జరిమానాపై 50% రాయితీని 2023లో ప్రకటించగా.. ఇప్పుడు మరొకసారి ఈ - చలాన్ ట్రాఫిక్ జరిమానా చెల్లింపు పై 50% రాయితీని ప్రకటించింది. ఇది ట్రాఫిక్ ఉల్లంఘనలు పెండింగ్ లో ఉన్న వాహనదారులకు భారీగా ప్రయోజనం చేకూర్చనుంది అని చెప్పవచ్చు. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఈ రాయితీ ప్రకటించడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

వీటి ద్వారా జరిమానా చెల్లించే అవకాశం..

ముఖ్యంగా మైసూర్ లోని అన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో, పోలీస్ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలోని ట్రాఫిక్ మేనేజ్మెంట్ సెంటర్, వాహన తనిఖీల ట్రాఫిక్ పోలీసులు, కర్ణాటక వన్ మొబైల్ అప్లికేషన్ లలో ఈ పెండింగ్ జరిమానాలు చెల్లించవచ్చు.

ప్రజలను కేసు నుండి తప్పించడానికే ఈ బంపర్ ఆఫర్..

ట్రాఫిక్ ఏసీపీ ఎం.శివశంకర్ ఈరోజు ఉదయం స్టార్ ఆఫ్ మైసూర్ తో మాట్లాడుతూ.. "రాష్ట్ర ప్రభుత్వం రేపటినుండి ఈ - చలాన్ ట్రాఫిక్ జరిమానాలపై 50% రాయితీని ఆదేశించింది. ఇందుకోసం జరిమానా వసూలు చేయడానికి ఒక సాఫ్ట్వేర్ ని కూడా సిద్ధం చేశారు. ఈ సాఫ్ట్వేర్ ఈ రాత్రి నుంచే అందుబాటులోకి వస్తుంది. ఇక రేపటినుండి సెప్టెంబర్ 12 వరకు జరిమానాల వసూలు ప్రారంభం అవుతాయి. నగరంలో రూ.400 కోట్ల ట్రాఫిక్ జరిమానాలు పెండింగ్లో ఉన్నాయి.. ముఖ్యంగా ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ఎందుకంటే ఒకసారి కేసు నమోదు అయిన తర్వాత జరిమానా చెల్లించకుండా తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని" ఆయన కోరారు. మొత్తానికైతే ప్రజలను కేసు నుండి తప్పించడానికి ఆ రాష్ట్ర ట్రాఫిక్ అధికారులు వినూత్న ఆఫర్లను ప్రకటిస్తున్నారు. మరి ఇప్పటికైనా ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి సకాలంలో జరిమానా చెల్లిస్తారేమో చూడాలి.

Tags:    

Similar News