'కామినేని' ప్లేస్ ఖాళీ.. రీజనేంటి ..!
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కైకలూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ రాజకీయ సన్యాసం ప్రకటించారు.;
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కైకలూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ రాజకీయ సన్యాసం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తాను కానీ తన కుటుంబ సభ్యులు గానీ ఎన్నికల్లో పోటీ చేయరని చెప్పడంతో పాటు ప్రత్యక్ష రాజకీయాలనుంచి కూడా తప్పుకుంటానని ప్రకటించారు. ఇది బిజెపి వర్గాల్లో సంచలనంగా మారింది. గత కొన్నాళ్లుగా కామినేని రిటైర్మెంట్ పై వార్తలు వస్తున్నాయి.
అదేవిధంగా విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. అయితే అధికారికంగా మాత్రం ఆయన ప్రకటించలేదు. తాజాగా ఈ విషయంపై స్పందించిన కామినేని తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, తాను గాని తన కుటుంబ సభ్యులు గానీ వచ్చే ఎన్నికల్లో రాజకీయాల్లో కూడా ఉండరని ఆయన చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే దీనికి రీజన్ ఏంటి ఎందుకు అంత కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేది ఆసక్తిగా మారింది.
వాస్తవానికి కామినేని శ్రీనివాస్ కంటే కూడా వయసులో పెద్దయినటువంటి నాయకులు చాలామంది రాజకీయాల్లో కొనసాగుతున్నారు. బిజెపిలోనే ఉన్నారు. అయినప్పటికీ కామినేని హఠాత్ నిర్ణయం కనుక ప్రధాన కారణాలు ఏంటి అనేది చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మంత్రిపాకంలో పదవిని కోరుకున్నారు అన్నది వాస్తవం. గతంలో చంద్రబాబు టీంలో ఆయన పని చేశారు. మంత్రిగా వ్యవహరించారు.
అదేవిధంగా ఇప్పుడు కూడా ఆయన మంత్రి పదవిని కోరుకున్నారు. కానీ అది దక్కలేదు. ఇక రెండో కారణం పార్టీలో కామినేని శ్రీనివాస్ కు ప్రాధాన్యం లేకుండా పోయింది. మొత్తంగా ఏపీ బీజేపీలో రెండు వర్గాలు బలమైన రోల్ పోషిస్తున్నాయి. దీనిలో కామినేని ఏ వర్గంలోనూ లేకపోవడంతో ఆయనకు ఇబ్బందికరంగా మారింది అన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. దీనిపై తరచుగా పార్టీలోనూ.. ఇటు రాజకీయ వర్గాలను చర్చ నడుస్తోంది.
అయితే అనూహ్యంగా కామినేని వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విశేషం. ఇక కైకలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున జయ మంగళ వెంకటరమణ మళ్లీ పోటీ చేసే అవకాశం ఉందన్నది ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ.