జూబ్లీ హిల్స్ హీట్ : నవీన్ కి సింపతీ వర్కౌట్ అవుతోందా ?
ఈ ఎన్నికల్లో నవీన్ ఇమేజ్ కూడా తోడు అయి కాంగ్రెస్ ని ఒడ్డున పడేస్తోంది అని అంటున్నారు. దానికి కారణం నవీన్ యాదవ్ పక్కా లోకల్.;
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఫలితం ఏ విధంగా ఉండబోతోంది అన్నది ఇపుడు పెద్ద ఎత్తున చర్చగా ఉంది. అంతే కాదు ఉత్కంఠగా కూడా ఉంది. ఎందుకంటే అధికార కాంగ్రెస్ రెండేళ్ళ పాలనను పూర్తి చేసుకోబోతోంది. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎన్ని అమలు అయ్యాయి, అభివృద్ధి ఏమిటి ప్రభుత్వం సాగుతున్న తీరు రేవంత్ రెడ్డి సీఎం గా ఏ విధంగా పనితీరుని కనబరుస్తున్నారు ఇవన్నీ కూడా ఉప ఎన్నిక మూలంగా చర్చకు వస్తాయి, పైగా అర్బన్ ఓటర్లు అన్నీ పరిగణలోకి తీసుకుంటారు.
కాంగ్రెస్ కే మొగ్గు :
అయితే ఇటీవల వెలువడుతున్న ఆర్ ఆర్ పొలిటికల్ సర్వేస్ అనే సంస్థ సర్వే కాంగ్రెస్ కే మొగ్గు అని చెబుతోంది. కాంగ్రెస్ ఒక విధంగా ఉప ఎన్నికల్లో కొంత ఇబ్బంది పడుతుందని ఆశించిన వారికి ఈ సర్వే ఫలితం షాకింగ్ అని చెప్పాల్సి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ కి అర్బన్ లో 2023లో పెద్దగా సీట్లు దక్కలేదు, పైగా జూబ్లీ హిల్స్ లో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్ధి గెలిచారు. మూడు సార్లు గెలిచిన మాగంటి గోపీనాథ్ మరణించడంతో సహజంగానే సానుభూతి ఉంటుంది. అందుకే ఆయన కుటుంబం నుంచే అభ్యర్థిని నిలబెట్టారు. బీఆర్ఎస్ కి కూడా గట్టి క్యాడర్ ఓటు బ్యాంక్ ఉంది. దాంతో కాంగ్రెస్ గెలుపు మాట అటుంది భారీ సవాల్ ఈ ఎన్నిక అని అనుకున్నారు కానీ సర్వే ఫలితం చూస్తే కాంగ్రెస్ కే ఎడ్జ్ ఉందని చెబుతోంది.
నవీన్ ఇమేజ్ తో :
ఈ ఎన్నికల్లో నవీన్ ఇమేజ్ కూడా తోడు అయి కాంగ్రెస్ ని ఒడ్డున పడేస్తోంది అని అంటున్నారు. దానికి కారణం నవీన్ యాదవ్ పక్కా లోకల్. పైగా సామాజికవర్గం పరంగా బలమైన నాయకుడు, ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నాయి, అనేక రకాలుగా ప్రజా సేవ చేస్తూ వచ్చారు. అంతే కాదు గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు ఇపుడు కరెక్ట్ గా అదే ఆయనకు సింపతీని తెచ్చిపెడుతోంది అని అంటున్నారు. మాగంటి గోపీనాథ్ మరణం తరువాత నవీన్ యాదవ్ వైపు జూబ్లీ హిల్స్ జనాల మొగ్గు కనిపిస్తోంది అని అంటున్నారు. ఈసారి అయినా ఆయనకు ఎమ్మెల్యేగా చాన్స్ ఇస్తే ఎలా పనిచేస్తారో చూద్దామనుకుంటున్నారు. పైగా అధికారంలో కాంగ్రెస్ ఉంది. ఆ విధంగా చూసినా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆయన మరింతగా ప్రజలకు సేవ చేస్తారు అన్న నమ్మకం కూడా కనిపిస్తోందిట.
మజ్లీస్ మద్దతు :
దానికి తోడు మజ్లీస్ మద్దతు కూడా ఉంది అని అంటున్నారు. దాంతో ఈ విధయంగా బీసీ ప్లస్ ముస్లిమ్స్ అన్న యాంగిల్ లో కాంగ్రెస్ తెలివైన నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. ఈ మొత్తం పరిణామాలను బేరీజు వేసుకుంటే కనుక కాంగ్రెస్ కి కొంత మొగ్గు ఉందని అంటున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ ని తీసిపారేయాలని లేదని అంటున్నారు హోరా హోరీ పోరుకు గులాబీ పార్టీ సిద్ధంగా ఉంది. అయితే ఫలితం మాత్రం నవీన్ కే అనుకూలం అని అంటున్నారు. ఇక్కడ నవీన్ కాకుండా వేరే అభ్యర్థిని కాంగ్రెస్ ట్రై చేసి ఉంటే మాత్రం సీన్ వేరేగా ఉండేదని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.