'జూబ్లీహిల్స్'లో ఓటు హక్కులేదా.. నమోదు చేసుకోండి!
సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్ జిల్లావ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, కొత్త పథకాల అమలు వంటివాటిని నిలుపుదల చేస్తామన్నా రు.;
హైదరాబాద్‌లోని కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం జూబ్లీహిల్స్ పరిధిలో నివాసం ఉండి.. ఇప్పటికీ ఓటు హక్కులేని వారు.. ఈ నెల 1కి 18 ఏళ్ల వయసు నిండిన యువతీ యువకులు.. కొత్తగా ఓటు హక్కును పొందేందుకు అవకాశం ఉంది. మరో 10 రోజుల పాటు.. కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆర్.వీ.కర్ణన్ తెలిపారు. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్ జిల్లావ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, కొత్త పథకాల అమలు వంటివాటిని నిలుపుదల చేస్తామన్నా రు.
అదేసమయంలో కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేవారు.. తక్షణమే ఎన్నికల సంఘం పోర్టల్ లేదా.. నిర్దేశిత న మూనాలో స్థానిక ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసిన కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు ఇప్పటి వరకు లేని వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందన్నారు. మార్పులు, చేర్పులకు అవకాశం లేదన్నారు. కేవలం కొత్తవారికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్టు వివరించారు. ఇక, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉన్నట్టు కర్ణన్ తెలిపారు. ఎక్కడా ఎలాంటివివాదాలకు అవకాశం లేకుండా.. ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు వివరించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3.9 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, వారు ప్రశాంతంగా వచ్చి ఓటు వేసుకునేందుకు ఏ ర్పాట్లు చేస్తామన్నారు. నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రాంతాలు ఏవీలేవన్న ఆయన.. సమస్యలు సృష్టించేవారిపై ఎప్పటిక ప్పుడు నిఘా పెడుతున్నామన్నారు. మొత్తం 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ బూతులను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈవీఎంల ద్వారానే ఎన్నికల పోలింగ్ జరుగుతుందని.. ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకదానిని చూపించి ఓటు హక్కువినియోగించుకోవచ్చన్నారు. ఓటరు స్లిప్పులను నేరుగా అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామ ని కర్ణన్ తెలిపారు.
అమల్లోకి కోడ్!
కేంద్ర ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింద ని కర్ణన్ వివరించారు. ఎక్కడా బ్యానర్లు, ఫ్లెక్సీలు లేకుండా చేస్తామన్నారు. 24 గంటల్లో హైదరాబాద్ వ్యాప్తంగా రాజకీయ పోస్ట ర్లు, బ్యానర్లను తొలగిస్తామని చెప్పారు. పార్టీలు కూడా కోడ్‌ను అనుసరించి ప్రచారం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లు.. చేసే పోస్టులపైనిరంతర నిఘా ఉంటుందన్నారు. ఎవరైనా రెచ్చగొట్టే పోస్టులు పెడితే.. కఠి న చర్యలు తీసుకుంటామన్నారు. కోడ్‌ను ఉల్లంఘించే పార్టీలుఏవైనా సరే.. ఆయా పార్టీల నాయకులపై కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు.