జూనియర్ ఎన్టీఆర్ పాలిటికల్ ఎంట్రీ పక్కా.. ఎపుడంటే ?

జూనియర్ ది సినీ వారసత్వం మాత్రమే కాదు నిండైన మెండైన రాజకీయ నేపధ్యం కూడా ఉంది. తాత సీనియర్ ఎన్టీఅర్ సినీ రాజకీయ రంగాలలో గొప్పగా రాణించారు.;

Update: 2025-08-30 05:30 GMT

జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజున గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. అతి చిన్న వయసులోనే స్టార్ డం సాధించి టాలీవుడ్ లో తన సత్తా చాటుకుని సరికొత్త రికార్డులకు తెర తీసిన జూనియర్ కి సినీ రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఎంతో ఉంది. ఆయన ప్రస్తుతం నాలుగు పదుల వయసులో ఉన్నారు సినీ సీమలో ఇంకా ఎక్కవలసిన శిఖరాలు అనేకం ఉన్నాయి. జూనియర్ కూడా ఎన్నో పాత్రలు చేయాలని జనం మదిలో వెండి తెర వేలుపు గా గుర్తుండిపోవాలని పట్టుదలగా పనిచేస్తున్నారు. ఆయన సినిమా ప్రేమికుడు. మరి అలాంటి జూనియర్ రాజకీయాల్లోకి వస్తారా వస్తే ఎపుడు అది ఇవే అందరినీ ఆలోచింపచేస్తున్న విషయాలు.

రాజకీయ నేపధ్యమే :

జూనియర్ ది సినీ వారసత్వం మాత్రమే కాదు నిండైన మెండైన రాజకీయ నేపధ్యం కూడా ఉంది. తాత సీనియర్ ఎన్టీఅర్ సినీ రాజకీయ రంగాలలో గొప్పగా రాణించారు. ఆయన ముమ్మారు సీఎం గా ఉమ్మడి ఏపీకి పనిచేశారు. ఇక తండ్రి హరి క్రిష్ణ ఎమ్మెల్యేగా మంత్రిగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేసారు. దాని కంటే ముందు ఆయన టీడీపీ చైతన్య రధ సారధిగా ఉన్నారు. పార్టీ పునాదుల నుంచి పనిచేశారు. అందువల్ల జూనియర్ ని రాజకీయంగా చూస్తే బలమైన నేపధ్యమే ఉంది అని చెప్పాల్సి ఉంది.

తమ్ముడు వస్తాడంటూ :

ఇదిలా ఉంటే తాజాగా జరిగిన హరిక్రిష్ణ వర్ధంతి సందర్భంగా ఆయనకు కుమార్తె సుహాసిని ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమెని మీడియా జూనియర్ గురించి ప్రశ్నించినపుడు తమ్ముడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారు అని పక్కా స్టేట్మెంట్ ఇచ్చేసారు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నాడని అవకాశం వచ్చినపుడు పొలిటికల్ ఎంట్రీ గ్యారంటీ అని ఆమె స్పష్టం చేశారు దీంతో సుహాసిని ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ని జూనియర్ ఫ్యాన్స్ అంతా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. వారంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు.

సరైన టైం లో :

ఇదిలా ఉంటే జూనియర్ ఎంట్రీ ఇపుడపుడే ఉండకపోవచ్చు అని అంటున్నారు. ఆయన సినీ రంగంలో చేయాల్సీ సినిమాలు అన్నీ పూర్తి చేసుకుని సరైన సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు అని అంటున్నారు. సినీ రంగంలో ఆయన ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అందువల్ల ఆయన రాజకీయాల గురించి ఇప్పటి నుంచే చర్చలు అనవసరం అన్న వారూ ఉన్నారు ఏది ఏమైనా రాజకీయ కుటుంబమే కాబట్టి కచ్చితంగా జూనియర్ ఆ రంగాన్ని విడిచిపెట్టరు అని అంటున్నారు.

దశాబ్దన్నర కాలం :

ఇక ఇద్దమిద్దంగా తేల్చకపోయినా జూనియర్ పొలిటికల్ ఎంట్రీకి మరో దశాబ్దన్నర కాలం పట్టవచ్చు అని అంటున్నారు. ఆయన ఈ కాలమంతా సినిమాల విషయంలోనే ఫుల్ ఫోకస్ పెడతారు అని అంటున్నారు. ఇక ఏపీలో చూసుకుంటే సార్వత్రిక ఎన్నికలు 2029లో జరుగుతాయి. అలాగే షెడ్యూల్ ప్రకారం 2034లో జరుగుతాయి. ఈ రెండు ఎన్నికల్లోనూ జూనియర్ బరిలోకి దిగకపోవచ్చు అనే అంటున్నారు. ఆయన ముందు ఉన్న సినిమా కమిట్మెంట్స్ వాటి బిజీ అలాంటిదే అంటున్నారు. అయితే కచ్చితంగా 2039 నాటికి మాత్రం జూనియర్ పొలిటికల్ అరంగేట్రం ఉంటుందని అంతా ఊహిస్తున్నారు.

టోటల్ చేంజి :

అప్పటికి ఏపీ రాజకీయం కూడా ఈ విధంగా ఉండకపోవచ్చు అని అంటున్నారు. చంద్రబాబు 2029 ఎన్నికలకు సైతం సారధ్యం వహిస్తారు అని. ఆ మీదట ఆయన వారసుడు టీడీపీ పగ్గాలు అందుకుంటారని అంటున్నారు లోకేష్ నాయకత్వంలో టీడీపీ పవన్ నాయకత్వంలో జనసేన అలాగే జగన్ నేతృత్వంలో వైసీపీ ఏపీలో కనిపించే రాజకీయ శక్తులుగా ఉంటాయని అంటున్నారు. అయితే 2034 తరువాత రాజకీయ శూన్యత ఏపీ పాలిటిక్స్ లో ఏర్పడే అవకాశం ఉంటుందని అదే అదనుగా భావించి జూనియర్ ఎంట్రీ ఇవ్వవచ్చు అన్నది దూర దృష్టితో రాజకీయాలు విశ్లేషించేవారు చెబుతున్న మాట. అప్పటికి ఆయన ఏజ్ కూడా పక్కగా సరిపోతుందని అన్ని విధాలుగా చూసుకునే బరిలోకి దిగవచ్చు అని అంటున్నారు

Tags:    

Similar News