మైలవరం పాలిటిక్స్ మారుతున్నాయా ..!
ఈ నేపథ్యంలో రాజకీయంగా దూకుడు పెంచుతున్నారు. మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వర్సెస్ జోగి రమేష్ రాజకీయాలు రోజుకోరకంగా దూకుడు పెంచుతున్నాయి.;

ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో రాజకీయాలు వేడి వేడిగా ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ఎలా ఉన్నా.. ప్రస్తుతం వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ పుంజుకున్నారు. ఆదిలో ఆయనపై అగ్రిగోల్డ్ భూముల కొనుగోలుకు సంబంధించిన వివాదం ముసురుకుంది. అయితే.. దీని నుంచి తృటిలో ఆయన తప్పించుకున్నారు. అదేవిధంగా ఆయన కుమారుడిని కూడాదాదాపు తప్పించారు. ప్రస్తుతం ఈ కేసు వ్యవహారంపై స్టే ఉందని తెలుస్తోంది.
ఇక, రాజకీయంగా కూడా జోగిపై ఉన్నది.. చంద్రబాబు ఇంటిపై అప్పట్లో దాడి చేయాలని చేసిన ప్రయ త్నానికి సంబంధించిన కేసు. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. అయితే.. దీనిలోనూ తమ ప్రమేయం లేదని.. తాము దాడి చేయాలన్న ఉద్దేశంతో అసలు రాలేదని కూడా.. అప్పట్లోనే చెప్పారు. దీంతో విచార ణాధికారులకు కూడా ఈ విషయంలో ఆధారాలు లభించలేదని తెలిసింది. ప్రస్తుతం ఇది విచారణలో ఉంది. దీంతో దాదాపు జోగిపై ఎలాంటి కేసులు లేవు.
ఈ నేపథ్యంలో రాజకీయంగా దూకుడు పెంచుతున్నారు. మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వర్సెస్ జోగి రమేష్ రాజకీయాలు రోజుకోరకంగా దూకుడు పెంచుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. గనుల కుంభకోణం వ్యవహారం అంటూ.. జోగి నిత్యం విమర్శలు చేస్తున్నారు. అయితే.. దీనిపై వసంత వ్యూహాత్మకంగా స్పందిస్తున్నారు. రాజకీయ నిరుద్యోగులు అంటూ.. ఎదురు దాడి చేస్తున్నారు. మరోవైపు.. వసంతకు సొంత పార్టీలో సెగలు తప్పాయి.
ఇది ప్రస్తుతం జోగి రమేష్ చేస్తున్న రాజకీయాలను బలంగా ఎదుర్కొనేందుకు వసంతకు కలిసి వస్తున్నా యి. మొదట్లో వసంతను వ్యతిరేకించిన వారు.. కూడా ఇప్పుడు ఆయనతో కలివిడిగా ఉంటున్నారు. మాజీమంత్రి దేవినేని ఉమ కూడా.. సైలెంట్ అయ్యారు. ఇది వసంతకు ప్లస్ అయింది. అయితే.. జోగి నుంచి మాత్రం రోజు కో రూపంలో ఆయనకు రాజకీయ యుద్ధం ఎదురవుతోంది. దీంతో వసంత ఒకరకంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అయితే.. పార్టీ నుంచి బలమైన మద్దతు ఉండడంతో జోగి వాయిస్ పెద్దగా ఫలించడం లేదనే చెప్పాలి.