వైసీపీ నేతల అల్టిమేటం: జోగికి టికెట్ వద్దే వద్దు.. !
మైలవరం నియోజకవర్గం అంటేనే అత్యంత సునిశితమైన సెగ్మెంట్. పైగా.. కమ్మ సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గం.
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ వ్యవహారం పార్టీలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఆయనకు టికెట్ ఇవ్వద్దంటూ.. మైలవరం వైసీపీ నాయకులు గత ఏడాదే ప్రయత్నాలు చేశారు. అప్ప ట్లోనే జోగికి వ్యతిరేకంగా గళం వినిపించారు. ఆయన వల్ల పార్టీ కేడర్ చిన్నాభిన్నం అయిందని కూడా చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు కుటుంబపరమైన కేసులు చుట్టుముట్టడంతో ఈ డిమాండ్ మరింత పెరిగింది. స్థానిక నాయకులు వైసీపీ కార్యాలయానికి పోటెత్తారు. తమ డిమాండ్ వినిపించారు.
ఎందుకు..?
మైలవరం నియోజకవర్గం అంటేనే అత్యంత సునిశితమైన సెగ్మెంట్. పైగా.. కమ్మ సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన జోగికి టికెట్ ఇస్తే.. గెలుపు గుర్రం ఎక్కడం సాధ్యం కాదన్నది స్థానిక నాయకులు చెబుతున్న తొలి విషయం. ఇక, రెండోది.. పార్టీలో ఐక్యత కంటే కూడా.. జోగి ఒంటెత్తు పోకడలు పెరిగాయన్నది వారు చెబుతున్న మాట. ఇది తమకు ఇబ్బందిగా మారిందని కూడా వారు చెబుతున్నారు.
మరీ ముఖ్యంగా కుటుంబం పరంగా కోడలు మేఘన చేస్తున్న ఆరోపణలు.. ఇప్పుడు నియోజకవర్గం వ్యాప్తంగా రచ్చగా మారాయి. ఈ సమయంలో జోగిని తప్పించడమే బెటర్ అని సీనియర్ నాయకులు కుండబద్దలు కొడుతున్నారు. గతంలోనే ఆయనపై నకిలీ మద్యం కుంభకోణం ఆరోపణలు వచ్చాయి. సూత్రధారితో కలిసి నకిలీ మద్యం విక్రయించేందుకు ప్రణాళికలు వేశారన్న కేసులో జైలుకు కూడా వెళ్లివచ్చారు. ఇవన్నీ.. పార్టీకి ఇబ్బందిగా మారాయని అంటున్నారు.
మరోవైపు.. జోగి కుమారుడు రాజీవ్ పై కూడా అగ్రిగోల్డ్ భూముల కుంభకోణం కేసు ఉంది. ఈ కేసులో రాజీవ్ సైతం జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చారు. ఇవన్నీ సీరియస్ కేసులేనని.. సామాన్య ప్రజలతో సంబంధం ఉన్న కేసులేనని స్థానిక నాయకులు చెబుతున్నారు.ఇ లాంటి నాయకుడికి మైలవరం వంటి కీలక టికెట్‌ను ఇస్తే.. అన్ని విధాలా పార్టీ దెబ్బతింటుందని చెబుతున్నారు. ఈ విషయంలో పార్టీ పునరాలోచన చేసుకోవాలని తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డికి సీనియర్లు తేల్చి చెప్పారు.