జేఈఈ టాపర్ విజయ రహస్యం తెలిస్తే షాక్!

అంతేకాకుండా నేటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన మరో ఆసక్తికర విషయం కూడా ఓం ప్రకాశ్ సక్సెస్ కు ప్రధాన కారణమంటున్నారు.;

Update: 2025-04-19 13:30 GMT

దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక పరీక్ష జేఈఈ మెయిన్స్ విజేత ఓం ప్రకాశ్ విజయం ఎందరితో స్ఫూర్తి నింపుతోంది. 300 మార్కులకు 300 సాధించిన ఒడిశాకు చెందిన ఓం ప్రకాశ్ పరీక్షలో టాపర్ గా నిలిచేందుకు ఎంతో కష్టపడ్డాడు. ఆయన కోసం తల్లిదండ్రులు కూడా త్యాగాలు చేశారంటూ జాతీయ మీడియా కథనాలు ప్రచారం చేస్తోంది. అంతేకాకుండా నేటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన మరో ఆసక్తికర విషయం కూడా ఓం ప్రకాశ్ సక్సెస్ కు ప్రధాన కారణమంటున్నారు.

జేఈఈలో ఆలిండియా టాపర్ గా నిలిచిన ఓం ప్రకాశ్ సక్సెస్ స్టోరీలో మొబైల్ ఫోన్ కూడా ఓ కీలక పాత్ర పోషించింది. చేతిలో సెల్ లేనిదే రోజు గడపలేకపోతున్న ఈ రోజుల్లో ఓం ప్రకాశ్ మొబైల్ ఫోన్ కు దూరంగా ఉండటం వల్ల జేఈఈలో 300 మార్కులు సాధించేందుకు దోహదపడిందని చెబుతున్నారు. తన ఏకాగ్రతను దెబ్బతీసే మొబైల్ ఫోన్ అంటే ఓం ప్రకాశ్ కు అసహ్యమని చెప్పడం విశేషం.

ఓం ప్రకాశ్ సక్సెస్ స్టోరీ అందరినీ ఆకట్టుకుంటోంది. ఫోన్ల ద్వారా సమయం వృథా చేసుకుంటున్న యువతకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఫోను వాడకానికి దూరంగా ఉంటే ఎంత అద్భుత విజయం సాధించవచ్చొ నిరూపించాడని అంతా ఓం ప్రకాశ్ ను అభినందిస్తున్నారు. ఇక జేఈఈ పరీక్షకు సిద్ధమైన ఓం ప్రకాశ్ ఒడిశా నుంచి రాజస్థాన్ లో కోటా వచ్చి శిక్షణ పొందాడు. ఆయనకు మనోధైర్యం ఇవ్వడానికి తల్లి రాణి బెహరా తన ఉద్యోగాన్ని వదులుకున్నారు.

ఒడిశా టీచింగ్ ఎడ్యుకేషన్ లో టీచర్ గా పనిచేస్తున్న రాణి బెహరా కుమారుడి కోసం ఉద్యోగాన్ని మానేసి మూడేళ్లుగా కోటాలోనే ఉంటున్నారు. అదేవిధంగా ఓం ప్రకాశ్ బెహరా తండ్రి కమల్ కాంత్ బెహరా ఒడిశా అడ్మినిస్ట్రేషవ్ సర్వీసెస్ లో పనిచేస్తున్నారు. ఆయన కూడా కుమారుడి కోసం ఢిల్లీకి బదిలీ చేయించుకున్నాడు. ఇలా తల్లిదండ్రులు ఇద్దరు కుమారుడి ఏకాగ్రత చెడిపోకుండా చూసుకున్నారు. దీంతో తన కలలను సాకారం చేసుకున్నట్లు ఓం ప్రకాశ్ బెహరా చెబుతున్నారు.

Tags:    

Similar News