• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆ కాలేజీల్లో చేరికకు లింగ...

ఆ కాలేజీల్లో చేరికకు లింగ మార్పిడి.. జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు

| రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న జేడీ వాన్స్ తమ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ నకు తమ్ముడే అని చెప్పాలి.

By - Tupaki Desk
Update: 2024-11-01 12:30 GMT

మరొక్క నాలుగు రోజులే.. అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు. అటు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. ఇటు డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్. హోరాహోరీగా సాగుతున్న ఈ ఎన్నికల్లో విజయం ఇద్దరి మధ్య దోబూచులాడుతోంది. ఒకరిని మించి ఒకరు అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఇక ఈ రెండు పార్టీల నుంచి ఉపాధ్యక్ష అభ్యర్థులు ఎవరన్నదీ ఆసక్తికరమే. ట్రంప్ పార్టీ రిపబ్లికన్ తరఫున జేడీ వాన్స్. డెమోక్రటిక్స్ నుంచి టిమ్ వాల్జ్ నిలిచారు.

ట్రంప్ తమ్ముడే..

రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న జేడీ వాన్స్ తమ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ నకు తమ్ముడే అని చెప్పాలి. అయితే, ఇది రక్త సంబంధంలో కాదు. వివాదాస్పద వ్యాఖ్యల్లో కావడం గమనార్హం. తాజాగా ఆయన ప్రతిష్ఠాత్మక కాలేజీల్లో ప్రవేశానికి కొంతమంది టీనేజర్లు చేస్తున్న ప్రయత్నాలను విమర్శించే క్రమంలో మాటలు అదుపుతప్పారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలుగా హార్వర్డ్, యేల్ లకు పేరున్న సంగతి తెలిసిందే. వీటిలో అడ్మిషన్ల కోసం టీనేజర్లు లింగమార్పిడి చేయించుకుంటున్నారని వాన్స్ నోరు జారారు. వీటిలో చోటు కోసం మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి పిల్లలకు లింగ మార్పిడి మాత్రమే మార్గంగా ఉందని పేర్కొన్నారు.

రిపబ్లికన్ల రూటే వేరు..

మొదటినుంచి ట్రాన్స్‌ జెండర్ల హక్కులపై రిపబ్లికన్ పార్టీ నేతలది భిన్న వైఖరి. వీరు ఈ విషయంలో తీవ్రమైన అభిప్రాయాలతో ఉంటారు. సాక్షాత్తు ట్రంప్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఒలింపిక్స్‌లో అల్జీరియాకు చెందిన బాక్సర్ ఇమానె ఖెలిఫ్‌ లో ఎక్స్‌, వై క్రోమోజోములు ఉన్నాయని, మహిళల విభాగంలో అనుమతించొద్దనే దుమారం రేగింది. ఈ సమయంలో ట్రంప్‌ కలుగజేసుకుని మహిళల క్రీడలో పురుషులు లేకుండా చేస్తానని వ్యాఖ్యానించారు. వాన్స్ అయితే.. ఓసారి అబార్షన్ ను కొందరు మహిళలు వేడుకగా చేసుకుంటున్నారని ఆరోపించారు. కేకులు సిద్ధం చేసుకుని ఫొటోలు దిగుతున్నారని వ్యాఖ్యానించారు. ట్రంప్ కూడా తొమ్మిది నెలల్లో గర్భ విచ్ఛిత్తి ఎలా చేస్తారని ప్రశ్నించారు. అబార్షన్‌ పై నిషేధానికి అనుకూలం కాదని, అలాంటి బిల్లుపై సంతకం చేయనని చెప్పారు.

Tags:    
  • Jdvance 
  • Vicepresidentcandidate 
  • Republicanparty 
  • Ivyleague 
  • USElections2024 
  • USA 
  • Imanekhelief 
  • Donaldtrump 
  • kamalaharris 

Similar News

జైలు - బెయిల్ రాజకీయాల కోసం పొత్తు పెట్టుకోలేదు: వైసీపీపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

2026-11-22 12:30 GMT

బండి సంజయ్ టార్గెట్ నెరవేరుతుందా? అసలు గురి 2028 ఎన్నికలేనా?

2026-11-22 11:36 GMT

టెన్షన్ ఎందుకు...లైట్ తీస్కో బ్రో !

2026-11-22 11:35 GMT

ఇమ్మిగ్రేషన్ అధికారుల దుర్మార్గం.. ఫ్లైట్ ఎక్కుతుండగా లాక్కేళ్లారు.. కూతురి ఆర్తనాదాలు వైరల్

2026-11-22 11:34 GMT

టీమిండియాలో సిరాజ్ కు దక్కని చోటు.. సెలెక్షన్ చుట్టూ రాజకీయ దుమారం..

2026-11-22 11:28 GMT

జగన్ లాంటి మనస్తత్వం ఎవరికి లేదు.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

2026-11-22 11:24 GMT

బాండ్ పేపర్లు.. రూ.కోట్ల ఆఫర్లు : పంచాయతీ ఎన్నికల్లో హామీల జాతర

2026-11-22 11:20 GMT

వరుణుడా.. మజాకా.. చలికాలంలోనూ తుఫాన్ల వెబ్ సిరీస్.. క్లైమాక్స్ ఎప్పుడో?

2026-11-22 10:55 GMT

అవెంజర్స్: ఎండ్‌గేమ్ రికార్డును బద్దలు కొట్టిన GTA 6.. ఒక్క రోజులోనే రూ. వేల కోట్ల వసూళ్లు!

2026-11-22 10:33 GMT

రూ.800 కోట్ల కలల సాకారం.. ఐఐటీ క్లాస్‌రూమ్ నుంచి మెటా సూపర్ ఇంటెలిజెన్స్ వరకు ఓ భారతీయుడి అద్భుత ప్రస్థానం

2026-11-22 04:34 GMT

పుష్క‌రాల‌కు మోడీ వ‌స్తున్నారు.. ఏర్పాట్లు అద‌రాలి: చంద్ర‌బాబు

2026-11-22 04:32 GMT

టెస్టు క్రికెట్‌లో టీమ్‌ఇండియా విధ్వంసం.. రికార్డులన్నీ బద్దలు.. పంత్‌ ఖాతాలో అరుదైన ఘనత

2026-11-22 04:32 GMT

Copyright @2026

Powered by Blink CMS