ఫ్యూచర్ ఫుట్ వేర్ టెక్నాలజీ వీడియో వైరల్.. మీరూ ఓ లుక్కేయండి!

ఈ సమయంలో ఆ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు! ఇందులో భాగంగా... ఈ వీడియో నిజం అయితే బాగుండు అని కొంతమంది ఆశపడుతున్నారు.;

Update: 2025-12-09 07:30 GMT

జపాన్ వినూత్న సాంకేతిక పరిజ్ఞానంలో ముందుంటుంది అనే సంగతి తెలిసిందే. అక్కడ కనిపిస్తోన్న టెక్నాలజీకి సంబంధించిన వీడియోలు చూసినవారికి గతంలో అది గ్రాఫిక్సేమో అనే సందేహం కలగగా ఇప్పుడైతే అది నిజంగా నిజమా.. లేక, ఏఐ సృష్టా అనే సందేహాలు వస్తున్నాయి. ఆ స్థాయిలో అక్కడ టెక్నాలజీ వాడకం ఉంటుందని చెబుతారు. ఈ క్రమంలో తాజాగా మరో వీడియో నెట్టింట సంచలనంగా మారింది.

అవును... తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. జపాన్ లో భవిష్యత్ పాదరక్షల సాంకేతికతను చూపిస్తోన్న ఆ వీడియోలో "సెల్ఫ్ సైజింగ్ స్నీకర్ పాడ్" అనే ఓ అద్భుత ఆవిష్కరణ దర్శనమిస్తోంది. ఈ సమయంలో ఆ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు! ఇందులో భాగంగా... ఈ వీడియో నిజం అయితే బాగుండు అని కొంతమంది ఆశపడుతున్నారు.

ఇదే సమయంలో.. అది ఏఐ సృష్టించిన వీడియో అని మరొకరు అంటున్నారు. ఇంకొకరైతే.. జపాన్ లో ఏదైనా సాధ్యమే అంటూ ఆ దేశం సాంకేతికపై తన అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు! ఎక్స్, ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్, ఫేస్ బుక్ మొదలైన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో విస్తృతంగా షేర్ చేయబడుతున్న ఈ వీడియోలో.. ఒక వ్యక్తి పాదాన్ని స్కాన్ చేసి, తక్షణమే అతడికి సరిగ్గా సరిపోయే స్నీకర్ ను అమర్చుతుంది.

అయితే ఈ వీడియోలో ఇది బ్రాండ్ కి సంబంధించిన అనే విషయం ప్రస్తావించకపోవడంతో.. ఇది ఏఐ అనే చాలా మంది నమ్ముతున్నారు! అదే విధంగా ఏ అఫిషియల్ సోర్సు కూడా ఆ ఫుటేజ్ ని ధృవీకరించలేదు! దీంతో ఎటువంటి నిర్దారణలూ లేక ఆ ఫుటేజ్ ఆన్ లైన్ మిస్టరీ వీడియోగా మిగిలిపోతోంది! మరోవైపు ఓ ఇన్ స్టాగ్రామ్ యూజర్ మాత్రం 10 నెలల క్రితమే దీనిపై తన ఆలోచనను పంచుకున్నట్లు తెలిపాడు!

ఇందులో భాగంగా... బిలోదిబ్రైన్ అనే అకౌంట్ హోల్డర్ 10 నెలల క్రితమే తనకు ఈ ఆలోచన వచ్చిందని, దాన్ని లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేసినట్లు తెలిపారు. తాను భవిష్యత్తును చూస్తాను అని, తన ఆలోచనలను తాను వ్యక్తపరుస్తానని.. అవి తర్వాత ధృవీకరించబడినప్పుడు తనకు చాలా నచ్చుతుందని రాసుకొచ్చాడు.



Tags:    

Similar News