ఏఐని ఇలా కూడా వాడవచ్చా.. యూకే ఎంపీ వినూత్న శ్రీకారం..
టెక్నాలజీ పరంగా ప్రపంచం దూసుకుపోతోంది. ఎవరి ఊహకు అందనంతగా ఎదుగుతోంది.;
టెక్నాలజీ పరంగా ప్రపంచం దూసుకుపోతోంది. ఎవరి ఊహకు అందనంతగా ఎదుగుతోంది. ఇండియాలో 5జీ ఉంటే కొన్ని దేశాల్లో 7జీ నుంచి 8జీకి వరకు కూడా వినియోగంలో ఉంది. మొన్నీ మధ్య జపాన్ కనిపెట్టిన స్పీడ్ చూసి ప్రపంచం తెల్లమొహం వేసింది. 5జీ నెట్ వర్క్ కొంత వరకు స్పీడ్ ఉంటే 6జీ మరికొంత కానీ జపాన్ కనిపెట్టిన ఇంటర్ నెట్ స్పీడ్ 1.02 పెటాబైట్స్ పర్ సెకండ్ గా ఉంది. అంటే ఒక నెట్ ఫ్లిక్స్ ను తీసుకుంటే దాదాపు సెకండ్ లో మొత్తం సినిమా లైబ్రరీని డౌన్ లోడ్ చేయచ్చు. జపాన్స్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్స్ టెక్నాలజీ సృష్టించిన ఈ స్పీడ్ ను చూసి ప్రపంచం తెల్లబోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఏఐతో మేలుతో పాటు కీడు కూడా..
మారుతున్న సాంకేతికలో భాగంగా వచ్చిందే ఏఐ. ఇది వచ్చిన తర్వాత మానవ జీవితం ఒక్కసారిగా కుదేలైంది. వందలాది నుంచి కోట్లాది మంది ఉద్యోగాలు పోయాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు మరింత ప్రమాదాల్లో పడ్డాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగాల కంటే ప్లంబింగ్ బెస్ట్ అని అక్కడికి ఏఐ రాదని సాక్షాత్తు సాఫ్ట్ వేర్ ప్రముఖులు చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే కాదు.. ఏఐ చాలా ఇబ్బందులను తెచ్చిపెట్టింది. సొంతంగా ఆలోచించేంతగా మారింది. ఒక దశలో మీ మేయిల్స్, పాస్ వర్ట్స్ లాంటివి లీక్ చేస్తానని బెదిరించసాగింది కూడా.
చాట్ బాట్ ను రూపొందించిన సంస్థ..
కానీ దాన్ని మంచిగా వాడుకుంటే కూడా మేలు చేస్తుందని కొందరు వాదిస్తున్నారు. ఇందులో భాగంగా యూకేకు చెందిన ఎంపీ మార్క్ సెవార్డ్స్ సరికొత్త ఆలోచన చేశాడు. ఏఐని పాలనా పరంగా వాడుకోవాలని అనుకున్నాడు. ప్రజా సమస్యలను పరిష్కరించాని సొంతంగా ఏఐ వెర్షన్ ను రూపొందించుకున్నాడు. ఇందుకు న్యూరాల్ వాయిస్ అనే అంకుర సంస్థ సహకారం తీసుకున్నారు. సంస్థ ఎంపీకి ఒక చాట్ బాట్ ను రూపొందించింది. దీని ద్వారా ప్రజల నుంచి సమస్యలు తీసుకోవచ్చు, సలహాలు ఇవ్వచ్చు, సూచనలు చేయవచ్చు.
ప్రజలతో నేరుగా టచ్ లోకి..
ఈ చాట్ బాట్ తో ప్రజలతో సంబంధం మరింత పెరుగుతుందని మార్క్ చెప్పారు. ఇక ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్తున్నారు. ప్రస్తుతం సాంకేతిక పరంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా నడవాలని అనుకుంటున్నాడు. ఈ చాట్ బాట్ ప్రజా సమస్యలను రికార్డు చేసి తనకు వివరిస్తుందన్నారు. అలాగే తాను చేయబోయే పనులకు కూడా వారి చెప్తుందని వివరించారు. ఇలాంటి విధానం ద్వారా ప్రజలకు, నాయకులకు మధ్య దూరం పెరుగుతుందన్న వాదనలు లేకపోలేదు అంటున్నారు నిపుణులు. ఏది ఏమైనా మార్క్ సెవార్డ్ చేస్తున్న విధానంకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తు్న్నారు. ఇకపై గంటల పాటు ఆయన కోసం వేచి చూడకుండా సమస్యలు పరిష్కారం అయితే చాలని అనుకుంటున్నారు.