జ‌న‌సేన‌కు ల‌క్కు.. చిక్కిందా ..!

రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క భాగ‌స్వామిగా ఉన్న జ‌న‌సేన పార్టీకి ల‌క్కు చిక్కిందా? ఆ మేరకు.. పార్టీలో చ‌ర్చ సాగుతోందా? అంటే.. ఔన‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.

Update: 2026-05-25 03:00 GMT

రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క భాగ‌స్వామిగా ఉన్న జ‌న‌సేన పార్టీకి ల‌క్కు చిక్కిందా? ఆ మేరకు.. పార్టీలో చ‌ర్చ సాగుతోందా? అంటే.. ఔన‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. కేవ‌లం రాష్ట్రంలోనే కాకుండా.. దేశ వ్యాప్తంగా కూడా జ‌న‌సేన పేరు అంద‌రికీ తెలిసిందే. కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడులోనే కాకుండా.. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో కూడా.. పార్టీ పేరు వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ నుంచి జ‌న‌సేన‌కు ప్రాధాన్యం పెరుగు తుండ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి 2019 త‌ర్వాత‌.. బీజేపీతో జ‌న‌సేన పొత్తు అంద‌రికీ తెలిసిందే. క్షేత్ర‌స్థాయిలో ఎలా ఉన్నా.. జాతీ య‌స్థాయిలో బీజేపీతో జ‌న‌సేన మిత్ర‌త్వం కొన‌సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీ పుంజుకునేందుకు పార్టీకి అవ‌కాశం మెండుగా ఉంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ కూడా ఇప్పుడు జ‌న‌సేన‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని భావిస్తోంది. త్వ‌ర‌లోనే కేంద్ర మంత్రి వ‌ర్గంలో జ‌న‌సేన‌కు అవ‌కాశం క‌ల్పించే దిశ‌గా అడుగులు ప‌డుతు న్నాయ‌ని మీడియా పేర్కొంది.

త‌ద్వారా.. కేంద్రంలో జ‌న‌సేన సంపూర్ణ భాగ‌స్వామిగా మార‌నుంది. ప్ర‌స్తుతం కేంద్రంలో జ‌న‌సేన ఇద్ద‌రు ఎంపీలు మ‌ద్ద‌తు ఇస్తున్నారు. అయితే.. దీనిని ఇద్ద‌రికే ప‌రిమితం చేయ‌కుండా.. దీని వెనుక‌.. రాజ‌కీయ వ్యూహాన్ని చూడాల్సి ఉంటుంది. పార్టీ ప‌రంగా ఇద్ద‌రు ఎంపీలు మాత్ర‌మే విజ‌యం ద‌క్కించుకున్నా (ఇద్ద‌రే పోటీ చేశారు.).. రాజ‌కీయ వ్యూహాల‌ను గ‌మ‌నిస్తే.. బీజేపీకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంద‌న్న విష‌యం తెలిసిందే.

ముఖ్యంగా బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాల‌ను కూడా పుణికి పుచ్చుకునే దిశ‌గా పార్టీ అడుగులు వేస్తోంది. అంటే ఒక‌ర‌కంగా.. బీజేపీకి భిన్నంగా అయితే.. ఎక్క‌డా లేదు. ఈ క్ర‌మంలో మ‌రింత ఎక్కువ‌గా జ‌న‌సేన‌ను అక్కున చేర్చుకునేందుకు క‌మ‌ల నాథులు.. ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన‌కు మం త్రి వ‌ర్గంలో చోటు క‌ల్పించేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఒక సీటును ఖ‌రారు చేసిన‌ట్టు జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

Tags:    

Similar News