జనసేనలో భారీ చేరికలు ఉంటాయా ?

జనసేన సరైన సమయంలోనే ఉత్తరాంధ్రా కేంద్రం అయిన విశాఖలో పార్టీ సమావేశాలను నిర్వహిస్తోంది.;

Update: 2025-08-27 22:30 GMT

జనసేన సరైన సమయంలోనే ఉత్తరాంధ్రా కేంద్రం అయిన విశాఖలో పార్టీ సమావేశాలను నిర్వహిస్తోంది. అని అంటున్నారు గడచిన పదిహేను నెలల కాలంలో వైసీపీ ఉత్తరాంధ్రాలో పెద్దగా బలపడిన దాఖలాలు లేవని అంటున్నారు. అదే సమయంలో లుకలుకలు ఎన్ని ఉన్నా కూటమి బలంగా ఉందని గుర్తు చేస్తున్నారు. ఉత్తరాంధ్రాలో వైసీపీకి 2024 ఎన్నికల్లో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలకు గానూ కేవలం రెండు ఎమ్మెల్యేలే దక్కాయి. అలాగే అయిదు ఎంపీ సీట్లు ఉంటే అరకు ఎంపీ సీటు మాత్రమే వైసీపీ సొంతం చేసుకుంది

టీడీపీ పరిస్థితి అలా :

ఉత్తరాంధ్రాలో మొదటి నుంచి టీడీపీ బలంగా ఉంది ఆ బలం సంతృప్త స్థాయిని దాటేసింది. దాంతో టీడీపీ అయితే కిక్కిరిసిపోయింది. ఆ పార్టీకి ప్రతీ జిల్లాలో బలమైన నాయకులు ఉన్నారు. పటిష్టమైన నాయకత్వం ఉంది ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి కనీసంగా ఇద్దరు నుంచి నలుగురు దాకా ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఉన్నారు. అలాగే మండలాల వారీగా చూసినా ఎక్కువ మంది నాయకులు ఉన్నారు. దాంతో వైసీపీలో ఉన్న నాయకులు ఎవరైనా టీడీపీలో వెళ్ళేందుకు ప్రయత్నం చేసినా వారికి చాన్స్ అయితే పెద్దగా లేదని అంటున్నారు. ఒకవేళ చేరింగా వారు పక్క వాయిద్యంగానే మిగిలిపోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

వైసీపీ సీన్ ఇలా :

ఇక వైసీపీ విషయానికి వస్తే అధికారంలో ఉన్నపుడు ఎంతో మంది పదవులు పొందారు 2019 ఎన్నికల తరువాత మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు గానూ 28 వైసీపీ గెలుచుకుంది. టీడీపీకి కేవలం ఆరు సీట్లే లభించాయి. అలాగే అయిదు ఎంపీ సీట్లకు ఒక్క సీటే టీడీపీకి దక్కింది దాంతో అత్యంత బలంగా వైసీపీ ఉన్నట్లుగా కనిపించింది. కానీ అయిదేళ్ళు తిరిగేసరికి మాత్రం ఆ పార్టీ పూర్తిగా చతికిలపడాల్సి వచ్చింది. ఇపుడు పదవులు అనుభవించిన నాయకులు ఎవరూ బయటకు రావడం లేదు, పక్క చూపులు చూసే వారు కూడా ఉన్నారు. దాంతో పార్టీ పదవులు ఇచ్చి జనంలోకి వెళ్ళమని అధినాయకత్వం ఆదేశిస్తున్నా కూడా నాయకులు ఎక్కువ మంది కదలడంలేదని అంటున్నారు. ఒక విధంగా చూస్తే స్తబ్దత అంతటా ఆవరించింది అని అంటున్నారు. దీంతో వైసీపీలో నిర్వేదం నిరాశ కనిపిస్తున్నాయి. ఓడిన తరువాత పార్టీ పెద్దగా ఎత్తిగిల్లిన దాఖలాలు అయితే లేవని అంటున్నారు.

ఉత్తరాంధ్రా ఫోకస్ :

ఈ నేపధ్యంలోనే జనసేన ఉత్తరాంధ్రా మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. వైసీపీ వీక్ అయిన చోట తాము ఆల్టర్నేషన్ గా బలపడాలని చూస్తోంది అని అంటున్నారు. ఇక వైసీపీ నేతలు కూడా టీడీపీలో ఎటూ బలమైన నాయకులు ఉన్నారని జనసేనలో చేరితే భవిష్యత్తులో తమకు అవకాశాలు వస్తాయని ఆలోచిస్తున్నారు. దాంతో జనసేన మూడు రోజుల పార్టీ కార్యక్రమాల పట్ల ఆసక్తి అయితే పెరుగుతోంది. మరో వైపు చూస్తే ఉత్తరాంధ్రాకు చెందిన నాయకులు కొందరు జనసేనలో చేరాలని ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. దాంతో పాటు పవన్ మూడు రోజుల పాటు విశాఖలో ఉండబోతున్నారు. ఈ నేపధ్యంలో భారీ చేరికలు జనసేన వైపుగా ఉంటాయా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News