పవన్ ఏపీ ని చూసుకోవడమే బెటరా...?
ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో జనసేన ఏం చేయాలి? ఎలాంటి స్టెప్ తీసుకోవాలి? అనేది రాజకీయ వర్గాల మధ్య ఆసక్తికర చర్చగా మారింది.
ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో జనసేన ఏం చేయాలి? ఎలాంటి స్టెప్ తీసుకోవాలి? అనేది రాజకీయ వర్గాల మధ్య ఆసక్తికర చర్చగా మారింది. అనేక మంది విశ్లేషకులు తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏపీలోనే జనసేన ఎదగడం మంచిదని ఎక్కువ మంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. నిజానికి ఏపీలోనే క్షేత్రస్థాయిలో జనసేనకు కార్యకర్తల కొరత ఉందని చెబుతున్నారు.
బూత్ స్థాయిలో కార్యకర్తలు లేరన్న విషయాన్ని పవన్ కల్యాణ్ కూడా పలు సందర్భాల్లో అంగీకరించిన విషయాన్ని కొందరు ప్రస్తావించారు. ఏపీలో గత 2024 ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం దక్కించుకున్నా.. ఇవే నియోజకవర్గాలలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. మూడు నుంచి నాలుగు స్థానాలు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యేలపై వస్తున్న విమర్శలే దీనికి కారణమని అంటున్నారు.
దీని కి తోడు ఉద్యమి సభ్యత్వ నమోదు విషయంలోనూ నాయకులు వెనుకబడడం.. కార్యకర్తలు లేని తీరును కళ్లకు కట్టిందని చెబుతున్నారు. ఈ పరిణామాలను అంచనా వేసి.. ఏపీలోనే పార్టీని డెవలప్ చేసుకుం టే మంచిదని సూచిస్తున్నారు. పార్టీ పరంగా ఇంకా బలమైన కార్యకర్తల అవసరం ఉందని అనేవారు పెరుగుతున్నారు. నాయకుడిగా పవన్‌కు మంచి పేరు ఉన్నప్పటికీ.. పార్టీ పరంగా జెండో మోసేవారు అత్యంత కీలకమని అంటున్నారు. వీరి సంఖ్యను పెంచుకోవడంతోపాటు.. మరింత బలంగా ఎదగాలని అంటున్నారు.
అలా కాకుండా.. ముందుకు సాగితే వ్యూహాత్మక లోపం ఏర్పడుతుందని చెబుతున్నారు. ఇది దీర్ఘకాలిక రాజకీయాలపై ప్రభావం చూపుతుందని చెప్పేవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. సంచలనాల కోసమో.. మీడియాలో నిలవాలన్న కుతూహలం కోసమో అయితే.. అది రాష్ట్రంలోనూ భిన్నమైన పరిస్థితి కి దారి తీస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ముందు పట్టున్న చోట మరింత పట్టు పెంచుకుని.. స్థిరంగా నిలబడితే.. ఆ తర్వాత.. వేసే అడుగులు బలంగా పడతాయని చెబుతున్నారు.