జనసేన 'ప్రగతి పత్రాలు'.. ఎవరికంటే..!
కొన్నాళ్ల కిందట.. జనసేన అధినేత.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో గత ఏడాదిన్నర (అప్పటికి) కాలంలో చేపట్టిన కార్యక్రమాలపై ఒక నివేదికను వెలువరించారు.
జనసేన పార్టీ కూడా.. టీడీపీ బాటలో నడిచేందుకు రెడీ అయిందా? అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో కూటమి కట్టేందుకు ముందుకు వచ్చిన జనసేన బీజేపీ, టీడీపీలను కలుపుకొని వైసీపీని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించింది. ఇలా అధికారంలోకివచ్చిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై తాజాగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది. గత కొన్నాళ్లుగా కొందరు ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఇటీవల నలుగురు ఎమ్మెల్యేల పనితీరును తీవ్రంగా భావించిన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వారిని పిలిచి హెచ్చరించారు. అయితే.. పరిస్థితిని ఇక్కడితో ఆపేయరాదని.. కేవలం విమర్శలు వచ్చినప్పుడు మాత్రమే స్పందించడం కాకుండా.. విమర్శలు రాకుండా చూసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ప్రగతి పత్రాలు.. పేరుతో ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు సిద్ధం చేసుకోవాలని.. తద్వారా వారి లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగాలని నిర్ణయించారు.
కొన్నాళ్ల కిందట.. జనసేన అధినేత.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో గత ఏడాదిన్నర (అప్పటికి) కాలంలో చేపట్టిన కార్యక్రమాలపై ఒక నివేదికను వెలువరించారు. దీని ఆధారం గా.. ఆయన ఏం చేశారో.. ఏం చేయాలని నిర్ణయించుకున్నారో కూడా.. ప్రజలకు కళ్లకు కట్టినట్టు వివరిం చారు. దీనిపై 15 పేజీలతో కూడిన పిఠాపురం అభివృద్ధి పేరుతో పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. అలా నే.. మిగిలిన 20 నియోజకవర్గాల్లో పనితీరును కూడా పుస్తకాల రూపంలో తీసుకురావాలని నిర్ణయించారు.
తద్వారా.. గడిచిన కాలంలో చేసిన పనులు.. అభివృద్ధి.. ప్రజలకు అందించిన ఫలాలను వివరించను న్నారు. ఇది ఒక భాగమైతే.. ప్రగతి పత్రాలు అనేవి ఇంటర్నల్ సబ్జెక్టుగా చెబుతున్నారు. వీటి ద్వారా ఎమ్మెల్యేల పనితీరుకు జనసేనాని స్వయంగా మార్కులు వేయనున్నారు. చేసిన పనులు, వచ్చిన విమర్శలు, ప్రజల సంతృప్తి.. ఇలా మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో పాటు అసెంబ్లీకి సభ్యులు హాజరైన తీరును కూడా పరిశీలిస్తారు. దీని ఆధారంగానే ప్రగతి నివేదికలు రెడీ అవుతాయని.. అత్యంత కీలక నాయకుడు ఒకరు ఆఫ్ దిరికార్డుగా చెప్పుకొచ్చారు.