నర్సీపట్నం ఎమ్మెల్యే...బాగుందా మరి !
టిట్ ఫర్ టాట్ అన్నది రాజకీయాల్లో ఎక్కువ అయిపోయింది. గతంలో విమర్శలు అన్నీ సిద్ధాంతాల మేరకు ఉండేవి కానీ ఇపుడు అలా కాదు వ్యక్తిగతానికి పోతున్నారు.;
టిట్ ఫర్ టాట్ అన్నది రాజకీయాల్లో ఎక్కువ అయిపోయింది. గతంలో విమర్శలు అన్నీ సిద్ధాంతాల మేరకు ఉండేవి కానీ ఇపుడు అలా కాదు వ్యక్తిగతానికి పోతున్నారు. అవతల వారు ఏ స్థాయిలో ఉన్నా వారి మీద హాట్ కామెంట్స్ చేస్తున్నారు. నొచ్చుకుంటారనో మరేదనో ఏమీ లేదు, నిస్సంకోచంగా అనేస్తున్నారు. ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అన్నది పక్కన పెడితే ఎవరూ ఇపుడు తీసి పోవడం లేదు, ఈ మధ్యనే శాసనమండలిలో రమేష్ యాదవ్ అనే వైసీపీ ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి చంద్రబాబుని పట్టుకుని కుప్పం ఎమ్మెల్సీ అని అనేశారు, దాని మీద ఎంత పెద్ద రాద్ధాంతం జరిగిందో అందరికీ తెలుసు. ఇపుడు ఏకంగా జగన్ సైతం అలాగే అనేశారు.
అయ్యన్న ఇలాకాకు వచ్చి :
స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్శీపట్నం నియోజకవర్గంలో భారీ జన సందోహం మధ్యన జగన్ మాట్లాడారు, ఆయన మొత్తం తన ప్రసంగంలో మెడికల్ కాలేజీల ఆవశ్యకతను చెబుతూనే మరో వైపు కూటమి నేతలని ఘాటుగానే విమర్శించారు. చంద్రబాబుని ఎపుడూ జగన్ టార్గెట్ చేస్తూంటారు ఈసారి కూడా అలాగే చేశారు. అంతే కాదు స్పీకర్ అయ్యన్నపాత్రుడి మీద సెటైర్లు వేశారు ఆయనను నర్శీపట్నం ఎమ్మెల్యే అని సంభోదించారు. మెడికల్ కాలేజీ జీవో ఎక్కడ అని నర్శీపట్నం ఎమ్మెల్యే అడుగుతున్నారు, ఆయనకు తెలియదు కాబోలు అని జీవో నంబర్ తో సైతం సభలో చదివి వినిపించారు జగన్.
హర్ట్ అయ్యారా :
ఇదిలా ఉంటే వైసీపీ ఓటమి పాలు అయిన తరువాత జగన్ని పట్టుకుని కూటమి నేతలు అంతా పులివెందుల ఎమ్మెల్యే అని పెద్ద ఎత్తున ర్యాగింగ్ చేస్తూ వస్తున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా ఈ మధ్యనే మీడియాతో మాట్లాడుతూ పులివెందుల ఎమ్మెల్యే అసెంబ్లీకి రావాలి అని ఎకసెక్కమాడారు. బహుశా ఇవన్నీ గుర్తు పెట్టుకున్నారో ఏమో తెలియదు కానీ జగన్ కి కూడా ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకున్న వాయినం అన్న తరహాలో ఇవ్వాల్సింది ఇచ్చేశారు.అంతే కాదు చంద్రబాబు కంటే కూడా ఎక్కువగా అయ్యన్న అబద్ధాలు చెబుతున్నారు అని కూడా విమర్శించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా మెలిక పెడుతూ వస్తున్నందుకు కూడా ఈ విధంగా జగన్ అన్నారేమో అన్న చర్చ నడుస్తోంది.
అమ్మేస్తారా అంటూ :
తాము ప్రజల కోసం పేదల కోసం పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలను కడితే వాటిని ప్రైవేటుకు అప్పగిస్తూ అమ్మేస్తారా అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. పేదల ఆరోగ్యం ఏమి కావాలని ప్రశ్నించారు. పేద విద్యార్ధులకు వైద్య విద్య అవసరం లేదా అని కూడా ఆయన నిలదీశారు. మొత్తానికి జగన్ తమ హయాంలో ఏమి మంచి చేశామో చెప్పుకుంటూ కూటమి ప్రభుతాన్ని ఇరకాటంలో పెట్టడం ఒక కీలకమైన రాజకీయ వ్యూహంగానే ఉంది. దీనిని కూటమి నుని రిటార్టు ఎలా ఉందో చూడాల్సి ఉంది.