వారిని పరామర్శించని జగన్... ఎందుకలా ?
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శల యాత్ర ఏపీలో కొనసాగుతూ వస్తోంది.;
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శల యాత్ర ఏపీలో కొనసాగుతూ వస్తోంది. ఆయన తన పార్టీకి చెందిన అనేక మంది వివిధ కేసులలో జైలు పాలు అయిన సందర్భాలలో పరామర్శిస్తూ వచ్చారు. దానిని ప్రత్యర్ధులు జైలు యాత్రలు సరికొత్త ఓదార్పు యాత్రలు అని పేరు పెట్టినా జగన్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఆయన వరసబెట్టి పర్యటనకు చేస్తూనే వచ్చారు. ఆ విధంగా ఆయన అనేక మందికి వివిధ జిల్లాలకు వెళ్ళి పరామర్శించారు.
లిస్ట్ అలా సాగిందిగా :
జగన్ జైలుకు వెళ్ళి ములాఖత్ వేసి మరీ కీలక వైసీపీ నేతలు అరెస్ట్ అయినపుడు పరామర్శించారు. అలా మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, అలాగే తన ఇంటిపైన దాడి చేశారు అన్న విషయం మీద మరో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వద్దకు వెళ్ళి మరీ ఓదార్చి వచ్చారు అయితే ఈ లిస్టులో ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. కానీ జగన్ ఆ వైపుగా ఎందుకు చూడడం లేదు అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
రాజమండ్రి రాక ఎపుడు :
జగన్ రాజమండ్రి వస్తారని లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయి సెంట్రల్ జైలులో చాలా రోజులుగా ఉంటున్న లోక్ సభలో వైసీపీ పక్ష నాయకుడు, ఎంపీ అయిన మిధున్ రెడ్డిని పరామర్శిస్తారు అని వార్తలు అయితే గత వారం అంతా ప్రచారంలో ఉన్నాయి. జగన్ నెల్లూరు పర్యటన తరువాత రాజమండ్రీయే తరువాయి అని కూడా అంతా అనుకున్నారు. ఇక జగన్ రాక సందర్భంగా పెద్ద ఎత్తున జనాలతో మేగా రోడ్ షో చేయాలని పార్టీ శ్రేణులు భావించాయి. అయితే జగన్ పర్యటన మాత్రం ఇప్పటిదాకా లేకుండా పోయింది. నిజానికి ఆగస్టు 5న జగన్ రాజమండ్రి వెళ్ళాల్సి ఉంది అని ప్రచారంలోకి వచ్చిన మాట.
అసలు ఉంటుందా ఉండదా :
లిక్కర్ స్కాం అని టీడీపీ కూటమి ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేసి చాలా మంది వైసీపీ నేతలను అరెస్టు చేసింది వీరంగా జగన్ కి అత్యంత సన్నిహితులే అని అంటున్నారు. అందులో బిగ్ షాట్ మిధున్ రెడ్డి. ఆయన రాయలసీమలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు. హ్యాట్రిక్ ఎంపీ. అన్నింటికీ మించి జగన్ కి అత్యంత సన్నిహిత నేతగా పేరున్న వారు. కానీ ఆయనను జగన్ ఇప్పటిదాకా ఎందుకు పరామర్శించడం లేదు అన్న చర్చ సాగుతోంది. అసలు ఈ పర్యటన ఉంటుందా లేదా అన్న డౌట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి.
అంతా వ్యూహాత్మకమా :
లిక్కర్ స్కాం లో మరో కీలక నేత జగన్ కి సన్నిహితుడు అయిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా అరెస్టు అయి ఉన్నారు. అలాగే పి క్రిష్ణ మోహన్ రెడ్డి, పి ధనుంజయ్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ మాజీ అధికారులు అయితే నెలల తరబడి జైలులో ఉన్నారు. జగన్ వీరి విషయంలో పరామర్శించ లేదు అంటే అంతా వ్యూహాత్మకమేనా అని అంటున్నారు. అందుకే ఆయన లిక్కర్ స్కాం లో అరెస్టు అయిన వారి పట్ల పరామర్శలకు దూరంగా ఉంటున్నారు అని అంటున్నారు.
జనాల్లోకి వేరేగా అంటూ :
ఇప్పటికే లిక్కర్ స్కాం విషయంలో కూటమి ప్రభుత్వం నాయకులు జనాలకు చెప్పాల్సింది అంతా ఒకటికి పప్దిసాల్రు చెప్పేసారు. ప్రపంచంలో అతి పెద్ద స్కాం అని కూడా అభివర్ణించారు. ఇక ఈ కేసులో అంతిమ లబ్దిదారు జగన్ అని కూడా ప్రచారాన్ని టీడీపీ అనుకూల మీడియా చేస్తోంది. ఈ నేపధ్యంలో జగన్ పరామర్శలు పెట్టుకుంటే వేరేగా సంకేతాలు వెళ్తాయని ఆలోచించే అలా దూరం పాటిస్తున్నారా అన్న చర్చ అయితే పార్టీ లోపలా బయటా సాగుతోంది.
పార్టీకి మేలు చేస్తుందా :
అయితే జగన్ కి అత్యంత సన్నిహితులు అంతా ఈ కేసులో అరెస్ట్ అయి ఉన్నారు. అందువల్ల ఆయన పరామర్శ చేయకపోవడం వల్ల పార్టీలో కూడా చర్చ సాగుతోంది. పార్టీ పరంగా చూస్తే ఇలా చేస్తే కీలక నేతలు ఏ విధంగా పార్టీ తమ పట్ల భరోసాగా ఉందని నమ్ముతారు అన్నది కూడా చర్చగా ఉందిట. పైగా లిక్కర్ స్కాం అన్నది ఏదీ లేదని వైసీపీ పెద్దలు గట్టిగా చెబుతున్నారు. ఇదంతా కావాలని సృష్టించింది అని కూడా అంటున్నారు. అలాంటపుడు పరామర్శల వల్ల ఇబ్బంది ఏమి కొత్తగా ఉంటుంది అన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా లిక్కర్ స్కాం లో ఇరుక్కుని జైలు పాలు అయిన వారికి మాత్రం జగన్ ఓదార్పు దక్కుతుందా లేదా అన్నది చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.