ఛాన్స్ కోసం `చెల్లెళ్ల` వెయిటింగ్.. !
వైసీపీని గత ఎన్నికల్లో దెబ్బతీసిన అనేక కారణాల్లో జగన్ సోదరీమణులు కీలక పాత్ర పోషించారు. తోడబు ట్టిన షర్మిలతోపాటు.. బాబాయి కుమార్తె సునీతలు ఇద్దరూ.. గత ఎన్నికల సమయంలో ఊరూ వాడా తిరిగి జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.;
వైసీపీని గత ఎన్నికల్లో దెబ్బతీసిన అనేక కారణాల్లో జగన్ సోదరీమణులు కీలక పాత్ర పోషించారు. తోడ బుట్టిన షర్మిలతోపాటు.. బాబాయి కుమార్తె సునీతలు ఇద్దరూ.. గత ఎన్నికల సమయంలో ఊరూ వాడా తిరిగి జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. దీనికి తోడు.. కూటమి పార్టీలు కూడా.. ప్రచార పర్వంలో ముందుకు సాగాయి. ఫలితంగా సొంతగా చేసుకున్న పనులతోపాటు.. ఈ వ్యతిరేక ప్రచారం దోహడపడి వైసీపీ పతనానికి దారి తీసింది. మరీముఖ్యంగా ఇద్దరు చెల్లెళ్ల ప్రచారం పార్టీకి శరాఘాతంగా పనిచేసింది.
అయితే.. అక్కడితో అయిపోయిందా? షర్మిల, సునీతలు ఇద్దరూ శాంతించారా? అంటే.. లేదనే చెబుతున్నారు పరిశీలకులు. వారిద్దరూ మళ్లీ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారన్నది పరిశీలకులు, విశ్లేషకులు చెబుతున్న మాట. అయితే.. ఆ ఛాన్స్ ఎన్నికలేనా? అంటే.. అవకాశం ఎప్పుడు వస్తే అప్పుడు విరుచుకు పడేందుకు ప్లాన్‌రెడీ చేసుకుంటున్నారని అంటున్నారు. ఇద్దరు సోదరీమణులు ఎదురు తిరగడానికి కారణమైన కీలక సమస్యలు అలానే ఉన్నాయి.
అవి పరిష్కారం కానంత వరకు .. జగన్‌కు పక్కలో బల్లెం మాదిరిగా ఇద్దరు చెల్లెళ్లు.. కాచుకుని కూర్చుంటారని చెబుతున్నారు. ఆస్తుల వివాదం, రాజకీయ ఉన్నతి కోసం షర్మిల పాకులాడుతున్నారు. దీనిలో రాజకీయంగా ఆమె ఒక లైన్ తీసుకున్నారు. కాంగ్రెస్‌లో ఉన్నారు. కానీ, ఇక్కడ కూడా.. జగన్ చక్రం తిప్పుతున్నారని.. కాంగ్రెస్ పార్టీలోని కొందరిని ఆయన మేనేజ్ చేస్తున్నారని.. ఫలితంగా తన గ్రాఫ్ పెరగడం లేదని షర్మిల భావిస్తున్నారు. ఇక, ఆస్తుల వివాదం ఎటూ తేలడం లేదు.
సునీత విషయానికి వస్తే.. ఏకైక అజెండా వివేకానందరెడ్డి దారుణ హత్య. ఈ కేసు ఎటూ తేలడం లేదు. మరో మూడేళ్లు పట్టినా అంటే.. వచ్చే ఎన్నికల నాటికి కూడా తేలుతుందా? అనేది ప్రశ్న. సో.. ఈ సమస్య తేలే వరకు.. సునీత డైరీలో ఉన్న వారికి శిక్షలు పడే వరకు ఆమె శాంతించేది లేదు. సో.. ఈ ఇద్దరు చెల్లెళ్లు కూడా.. అన్నపైన, అన్నరాజకీయాలపైనా.. ఓ కన్నేసి ఉంచారన్నది వాస్తవం. సో.. వీరి బెడద జగన్ కు తొలిగిపోలేదు. ఎప్పుడైనా .. ఎక్కడైనా వీరు విజృంభించే అవకాశం మెండుగానే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.