జగన్ కు ఫోన్ ట్యాపింగ్ `ఉచ్చు`?
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. ఇప్పటికే ఆస్తుల కేసుల్లో చిక్కుకుని అల్లాడుతున్నారు.;

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. ఇప్పటికే ఆస్తుల కేసుల్లో చిక్కుకుని అల్లాడుతున్నారు. మరోవైపు.. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం సహా.. ఇతర పలు అంశాలపై కూటమి ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. కీలక నిందితులుగా ఉన్న వారిని ఇప్పటికే అరెస్టు చేసి జైల్లో కూడా పెట్టారు. మరో కీలక వైసీపీ నాయకుడు, రాజంపేట ఎంపీ పెద్ద రెడ్డి మిథున్ రెడ్డిని కూడా నేడో రేపో అరెస్టు చేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
ఇలాంటి సమయంలో అనూహ్యంగా జగన్ చుట్టూ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు చుట్టుకుంటోందని అంటు న్నారు పరిశీలకులు. తెలంగాణలో బీఆర్ ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం.. ఊపం దుకుంది. రేవంత్ రెడ్డి సర్కారు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ వేగాన్ని పెంచింది. తాజాగా కేసు విచారణలో కీలక సాక్షి.. గతంలో షర్మిల పోన్లు కూడా ట్యాప్ అయ్యాయని వివరించడం.. దీనిని అధికారులు రికార్డు చేయడం సంచలనంగా మారాయి.
అయితే.. వైసీపీ హయాంలోనే ఇవన్నీ జరగడం గమనార్హం. వైసీపీ అధినేత జగన్‌ను ఢీ అంటే ఢీ అన్నట్టు గా అప్పట్లో ఎదిరించిన షర్మిల.. తర్వాత.. సొంత పార్టీ పెట్టుకున్నారు. అయితే.. దీనివెనుక ఓ పత్రిక య జమాని ఉన్నారన్న అనుమానంతో వైసీపీ నాయకులు నిఘా పెట్టారని సమాచారం. తనను దెబ్బ కొట్టేం దుకు షర్మిల ఎవరెవరితో మాట్లాడుతున్నారు? ఎవరెవరిని కలుస్తున్నారు? అనే విషయాలపై జగన్ కూపీ లాగడం కోసం ఫోన్ ట్యాప్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
దీనికి అప్పటి బీఆర్ ఎస్ ప్రభుత్వ పెద్దలు కూడా సహకరించినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా గా వెలుగు చూసిన సమాచారం.. వైసీపీ అధినేత చుట్టూ ముసురుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే జరిగితే.. జగన్‌కు తీవ్ర నష్టమని.. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇతర కేసుల కంటే తీవ్రమని పరిశీలకులు చెబుతున్నారు. పైగా సొంత చెల్లి ఫోన్‌నే ట్యాప్ చేయడం అంటే మరింత ఇబ్బందికర విషయమని.. రాజకీయంగా ఇప్పటికే జరిగిన నష్టానికి ఇది మరింత ఆజ్యం పోస్తుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో .. జగన్ ఎలా రియాక్ట్ అవుతారో.. చూడాలి.